Home /News /technology /

iPhone 13 series: త్వరలో యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. ఈ ఏడాదిలోనే విడుదల.. పూర్తి వివరాలివే..

iPhone 13 series: త్వరలో యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. ఈ ఏడాదిలోనే విడుదల.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ నుంచి ఈ సంవత్సరం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్‌ ఫోన్ల ప్యానెల్ డిజైన్, మోడళ్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. సంస్థ నుంచి ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. యాపిల్ నుంచి ఈ సంవత్సరం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్‌ ఫోన్ల ప్యానెల్ డిజైన్, మోడళ్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కొత్త సిరీస్ ఫోన్లు ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 12 సిరీస్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ మాదిరిగానే ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐఫోన్ 13లో వినియోగదారులను ఆకర్షించే కొన్ని అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. నాచ్ డిజైన్, ఇన్ డిస్‌ప్లే, ఫింగర్‌ ప్రింట్ స్కానర్, పోర్ట్ లెస్ ఛార్జింగ్.. వంటి సరికొత్త ఫీచర్లతో వీటిని రూపొందిస్తున్నారు. గత సిరీస్‌లతో పోలిస్తే ఐఫోన్ 13 ఫోన్లలో మెరుగైన కెమెరా లెన్స్ ఉంటాయి. లెన్స్ నాణ్యతను యాపిల్‌ అభివృద్ధి చేసింది. 120Hz LTPO టచ్ స్క్రీన్ ప్యానెల్, మెరుగైన బ్యాటరీ లైఫ్ వీటి సొంతం. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లను రూపొందిస్తున్నారు. సాధారణ ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ బడ్జెట్ ఫోన్, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ వంటి మోడళ్లను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లు 5.4 అంగుళాలు, 6.1 అంగుళాలు, 6.7 అంగుళాల స్క్రీన్‌తో రానున్నాయి.

అదిరిపోయే ఫీచర్లు
యాపిల్ మొదటిసారి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తోంది. సిరీస్‌లోని ప్రో లైనప్‌ వేరియంట్లు హై ఎండ్ LTPO స్క్రీన్‌తో రానున్నాయి. ఈ అత్యాధునిక LTPO టెక్నాలజీ ఐఫోన్‌ 13కు అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఇది ఫోన్ల బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. వీటి డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తాయి. ఈ ఫోన్లలో f/1.8 లెన్స్‌తో అప్ గ్రేడ్ చేసిన అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఫోటో నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఐఫోన్ 13 మోడళ్లలో LiDAR సెన్సార్లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ వివరాలను యాపిల్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

విడుదల ఎప్పుడు?
యాపిల్ కంపెనీ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ను జూన్ 7 నుంచి జూన్ 11 వరకు వర్చువల్ విధానంలో నిర్వహించనుంది. ఈ సమావేశాల్లోనే ఐఫోన్ 13 సిరీస్ గురించి మరిన్ని వివరాలను సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ చివర్లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి ధరలు రూ.69,990 నుంచి 1,49,990 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు