కొత్త యాపిల్ ఐఫోన్‌ను(Apple iphone) కొనుగోలు చేయాలనుకునే వారు లేటెస్ట్ మోడల్(Latest Model) కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. యాపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 14 సిరీస్(Series) విడుదల కావడానికి ఇంకా నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అద్భుతమైన లేటెస్ట్ ఐఫోన్‌ను మంచి డీల్‌లో(Deal) సొంతం చేసుకొనే ఆఫర్ అందుబాటులో ఉంది. హై ఎండ్ యాపిల్ ఫ్లాగ్‌షిప్ మోడల్.. iPhone 13 Pro Max ఫోన్‌ను ప్రస్తుతం AT&T కంపెనీ నమ్మలేని ధరకు అందిస్తోంది. డల్లాస్‌కు చెందిన ఈ వైర్‌లెస్ నెట్‌వర్క్ ప్రొవైడర్ కంపెనీ(Wireless Network Provider Company).. యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో(Exchange Offer) సహా నెలకు 11.12 డాలర్లు చెల్లించి సొంతం చేసుకునే సదుపాయం అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించే ముందు ఈ డీల్‌కు ఉన్న కొన్ని నిబంధనలు, షరతులు తెలుసుకోవాలి.
Android Smartphones: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్... మే 11 నుంచి ఈ సర్వీస్ ఉండదు
ఐఫోన్ 13 ప్రో మాక్స్ అత్యంత ప్రీమియం ఐఫోన్ 13 మోడల్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది సరికొత్త Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో OISతో 12MP వైడ్ లెన్స్ ప్రైమరీ కెమెరా తో పాటు 3X ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4352mAh బ్యాటరీతో పని చేస్తుంది.
* AT&T అందిస్తున్న ఆఫర్
iPhone 13 Pro Max బేస్ వేరియంట్ ధర 1,099 డాలర్లు. AT&T దాని సాధారణ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్ కోసం 36 నెలల కాలానికి నెలకు 30.56 డాలర్ల చొప్పున వసూలు చేస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ఐఫోన్ 13 ప్రో మాక్స్ ధర తగ్గింపు ఆఫర్‌లో వినియోగదారులు అదే స్మార్ట్‌ఫోన్‌ను కేవలం నెలకు 11.12 డాలర్లు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఇది అసలు ధరలో మూడింట ఒక వంతు మాత్రమే! కానీ ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి.. మీరు కొత్త AT&T లైన్‌ని కొనుగోలు చేయాలి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా ఇంత భారీ ఆఫర్ పొందే అవకాశం లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా iPhone 13 Pro Maxపై 700 డాలర్ల తగ్గింపు పొందవచ్చు. మీరు అన్ని ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలిగితే కేవలం 11.12 డాలర్లకు స్మార్ట్‌ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. AT&T అందిస్తున్న ఆఫర్ 128GB వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. 256 GB, 512 GB లేదా 1024 GB వేరియంట్‌ను ఇష్టపడితే, అధిక రుసుము చెల్లించవలసి ఉంటుంది.
* iPhone 13 Pro Max ఆఫర్ పొందడం ఎలా..
మొదట వెబ్‌సైట్ లింక్ https://www.att.com/buy/phones/apple-iphone-13-pro-max-128gb-alpine-green.html ను ఓపన్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న iPhone 13 Pro Max ఫోన్ ఇంటర్నల్ మెమరీ, కలర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత న్యూలైన్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రేడ్ ఇన్ యాన్ ఓల్టర్ డివైజ్ ఆప్షన్‌లో ఎక్స్ఛేంజ్ చేస్తున్న ఫోన్ వివరాలు నమోదు చేయాలి. అంతే త్వరలోనే iPhone 13 Pro Max ఇంటికి డెలివరీ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exchange, Iphone, Mobile phones, New offer