హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 13: ఐఫోన్‌ 13పై బంపర్‌ ఆఫర్‌.. నెలకు 2.78 డాలర్లతోనే సొంతం చేసుకునే అవకాశం..!

iPhone 13: ఐఫోన్‌ 13పై బంపర్‌ ఆఫర్‌.. నెలకు 2.78 డాలర్లతోనే సొంతం చేసుకునే అవకాశం..!

ఐఫోన్ 13పై అద్భుతమైన ఆఫర్.

ఐఫోన్ 13పై అద్భుతమైన ఆఫర్.

అమెరికాలోని టెలికమ్యునికేషన్స్‌ హోల్డింగ్‌ కంపెనీ AT&T.. ఐఫోన్ 13పై భారీ ఆఫర్ అందిస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే ప్రస్తుతం వినియోగదారులు ఐఫోన్‌ 13ను కేవలం నెలకు 2.78 డాలర్లు చెల్లించి సొంతం చేసుకునే అవకాశం ఉంది.

కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నవారు కచ్చితంగా ఐఫోన్ 13ని ఒక ఆప్షన్‌గా పరిశీలించవచ్చు. గతేడాది సెప్టెంబరులో దీని సేల్స్ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ 13 ఒకటిగా నిలుస్తోంది. ఐఫోన్‌ 13ను కొనుగోలు చేయాలని చాలా మందికి కోరిక ఉన్నా.. అధిక ధర ప్రధాన అవరోధంగా మారుతోందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ప్రస్తుతం ఈ డివైజ్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకొనే అవకాశం ఉంది. అమెరికాలోని టెలికమ్యునికేషన్స్‌ హోల్డింగ్‌ కంపెనీ AT&T.. ఐఫోన్ 13పై భారీ ఆఫర్ అందిస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే ప్రస్తుతం వినియోగదారులు ఐఫోన్‌ 13ను కేవలం నెలకు 2.78 డాలర్లు చెల్లించి సొంతం చేసుకునే అవకాశం ఉంది.

AT&T వెబ్‌సైట్‌ను సందర్శిస్తే ఐఫోన్‌ 13 128GB మెమరీ వేరియంట్ రిటైల్ ధర 799.99 డాలర్లుగా కనిపిస్తుంది. అయితే ఐఫోన్‌ 13 ధరపై 700 డాలర్ల డిస్కౌంట్‌ను అందుకోవడానికి.. వినియోగదారులు AT&T ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్, ట్రేడ్-ఇన్ డీల్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. సరికొత్త ఐఫోన్‌ 13ని పొందాలని నిర్ణయించుకుంటే, దాని స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకోవడం మంచిది.

iPhone 13 ప్రత్యేకతలు

యాపిల్‌ ఐఫోన్‌ 13.. 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సల్స్‌ కాగా వీడియోల కోసం సినిమాటిక్ మోడ్‌ ఫీచర్‌ అందిస్తున్నారు. ఐఫోన్‌ 12 మోడల్స్‌లో కంటే ఐఫోన్‌ 13లో ఎక్కువ స్టోరేజ్‌(128జీబీ) కల్పిస్తున్నారు. లేటెస్ట్‌ ఏ15 బయానిక్‌ చిప్‌, ఐఓఎస్‌ 15తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. 5జీ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ, 3,227 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ, 20W ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐఫోన్ 13పై AT&T తగ్గింపును ఎలా పొందాలి


  • ముందు AT&T వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో ఐఫోన్‌ 13 గురించి సెర్చ్‌ చేయాలి లేదా https://www.att.com/buy/phones/apple-iphone-13-128gb-starlight.html లింక్‌పై క్లిక్‌ చేయాలి.

  • ఆల్పైన్ గ్రీన్ నుంచి పింక్, బ్లాక్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ కలర్ ఆప్షన్‌ల వరకు మీకు నచ్చిన కలర్‌ ఫోన్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా నచ్చిన వేరియంట్‌ను ఎంచుకోవాలి.

  • బేస్ ఐఫోన్‌ 13 వేరియంట్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ను నెలకు 22.23 డాలర్‌లు చెల్లించే విధంగా సొంతం చేసుకోవచ్చు.

  • ఐఫోన్‌ 13ను నెలకు 2.78 డాలర్‌లు చెల్లించి పొందడానికి, AT&T ఇన్‌స్టాల్‌మెంట్ ఒప్పందానికి సభ్యత్వం పొందాలి, దీని ద్వారా ఐఫోన్‌ 13పై 700 డాలర్‌ల వరకు తగ్గింపును బిల్ క్రెడిట్‌లుగా పొందవచ్చు.

  • ఐఫోన్‌ని నెలవారీ వాయిదాల ప్లాన్ ద్వారా నెలకు 22.23 డాలర్‌లు చెల్లించి కొనుగోలు చేయాలి. అదే విధంగా AT&T అపరిమిత డేటా ప్లాన్‌లలో దేనికైనా సైన్ అప్ చేయాలి.

  • అలాగే ట్రేడ్-ఇన్ డీల్‌లో పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉంచాలి. 700 డాలర్‌ల తగ్గింపును పొందడానికి ఐఫోన్‌ ఎక్స్‌, లేదా కొత్త మోడల్‌లతో ట్రేడ్‌ చేయవచ్చు. ఈ వెబ్‌సైట్లో ఫోన్‌ కొనేముందు పాత ఐఫోన్‌కు ఎంత ధర ఇస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం.

First published:

Tags: 5g mobile, Apple iphone, Iphone, Tech news

ఉత్తమ కథలు