iPhone 13: ఐఫోన్ 13 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ఇండియాలో ధర ఎంతంటే

iPhone 13: ఐఫోన్ 13 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ఇండియాలో ధర ఎంతంటే

iPhone 13 Series | యాపిల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13 Series) స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ఈ సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వాటి ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    ఐఫోన్ 13 మినీ (iPhone 13 mini), ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro), ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ (iPhone 13 Pro Max) మోడల్స్‌ని పరిచయం చేసింది యాపిల్. ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇండియాలో రూ.69,900 నుంచి ప్రారంభం అవుతాయి. తక్కువ ధరలో కావాలంటే ఐఫోన్ 13 మినీ కొనొచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కొనాలి. ప్రతీ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వస్తుంటాయి. అందులో భాగంగా ఇప్పుడు నాలుగు కొత్త ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు కొనాలో తెలుసుకోండి.

    ఐఫోన్ 13 మినీ స్పెసిఫికేషన్స్


    ఐఫోన్ 13 మినీ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. 128జీబీ వేరియంట్ ధర రూ.69,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.79,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.99,900. ఐఫోన్ 13 మినీ స్మార్ట్‌ఫోన్‌లో 5.4 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్‌తో ఉన్న ఏ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.9,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది.

    WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... అదిరిపోయే టూల్ వచ్చేస్తోంది

    ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్


    ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.1,09,900. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్‌తో ఉన్న ఏ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,120 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది.

    Redmi 10 prime vs Redmi Note 10: రూ.15,000 లోపు ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బాగుంది? తెలుసుకోండి

    ఐఫోన్ 13 ప్రో స్పెసిఫికేషన్స్


    ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.1,19,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,29,900. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.1,49,900. వీటితో పాటు 1టీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.1,69,900. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. సియరా బ్లూ, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,120 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24న సేల్ మొదలవుతుంది.

    Best 5G Smartphones: బడ్జెట్ ధరలోనే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్... రూ.16,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

    ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్


    ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.1,29,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,39,900. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.1,59,900. వీటితో పాటు 1టీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.1,79,900. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. సియరా బ్లూ, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,120 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24న సేల్ మొదలవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: