iPhone 13: త్వరలోనే యాపిల్​ నుంచి ఐఫోన్ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్ల వివరాలివే...

Apple iPhone

iPhone 13| సంస్థ తన ‘ఐఫోన్​ 13’ సిరీస్​ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్​ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్లు మార్కెట్​లోకి రానున్నాయి. ఐఫోన్​ 12కు కొనసాగింపుగా ఈ స్మార్ట్​ఫోన్లు విడుదల కానున్నాయి.

  • Share this:
యాపిల్​ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం బ్రాండ్​గా ఐఫోన్లకు మంచి పేరుంది. యాపిల్​ నుంచి విడుదలైన ఐఫోన్​ 12 స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ తన ‘ఐఫోన్​ 13’ సిరీస్​ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్​ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్లు మార్కెట్​లోకి రానున్నాయి. ఐఫోన్​ 12కు కొనసాగింపుగా ఈ స్మార్ట్​ఫోన్లు విడుదల కానున్నాయి. కాగా, ఇటీవలి పరిణామాలతో చైనాపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. హువావే కంపెనీపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఐఫోన్​ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

యాపిల్ 13 సిరీస్​ విడుదలపై మార్కెట్​ అనలిస్ట్​ మింగ్​ చి కుయో మాట్లాడుతూ ‘‘2022 మొదటి అర్ధభాగంలోనే ఆపిల్ కొత్త 5జి ఐఫోన్ ఎస్‌ఈ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఐఫోన్ 14 మోడళ్లు విడుదల కానున్నాయి. ఐఫోన్ 13 SE మోడల్​లోని ఫీచర్లు​ ప్రస్తుత ఐఫోన్ 12 SE మాదిరిగానే ఉండనున్నాయి. అయితే, ఈ స్మార్ట్​ఫోన్​లో 5జీ టెక్నాలజీ, అప్‌గ్రేడ్ చేసిన A- సిరీస్ చిప్‌ను జోడించనున్నారు. ఇప్పటివరకు విడులైన ఐఫోన్​ మోడల్స్​లో ఈ​ మోడల్ అత్యంత చౌక ధర వద్దే లభించే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.

ఈ మోడళ్లకు అదనంగా, 2022 చివరి అర్ధ భాగంలో యాపిల్ రెండు హై-ఎండ్, రెండు లోయర్-ఎండ్ ఐఫోన్ మోడళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రెండు స్టాండర్డ్​ సైజ్​ మోడళ్లు 6.1-అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంటాయి. మరోవైపు యాపిల్ మాక్స్​ డివైజెస్​ 6.7 అంగుళాల డిస్​ప్లేతో రానున్నాయి. అయితే, మార్కెట్ అనలిస్ట్ మింగ్ చి కుయో మాత్రం చిన్న సైజ్​లోని ఐఫోన్‌ మోడల్స్​ గురించి ప్రస్తావించలేదు. కాగా, ఈ ఐఫోన్ మినీ సిరీస్​ 5.4- అంగుళాల డిస్​ప్లే కలిగి ఉంటాయని తెలుస్తోంది.

పోర్ట్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో..
ఐఫోన్​ 13 సిరీస్​లో కొన్ని అప్​డేటెడ్​ ఫీచర్లను అందించనున్నారు. నాన్​ డిజైన్​, ఇన్​ డిస్​ప్లే, ఫింగర్ ​ప్రింట్ స్కానర్​, పోర్ట్​లెస్​ ఛార్జింగ్​ వంటి సరికొత్త ఫీచర్లతో వీటిని రూపొందించనున్నారు. అయితే, గత సిరీస్​తో పోలిస్తే ఐఫోన్​ 13 ఫోన్లలో మెరుగైన కెమెరా లెన్స్​ అందించనున్నారు. వీటితో పాటు అండర్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్లు, 48MP కెమెరా అప్‌గ్రేడ్ వంటివి కూడా అభివృద్ధి చేయనుంది. వీటిని ఐఫోన్​ 13 సిరీస్​లో అందించనుంది. కాగా, ఈ స్మార్ట్​ఫోన్లను సెప్టెంబర్​ చివరల్లో విడుదల చేసే అవకాశం ఉంది. వీటి ధరలు 900 డాలర్లు ( భారత కరెన్సీలో సుమారు రూ. 67,000) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే, 2021లో ఐఫోన్ ఎగుమతులు 230 మిలియన్ల నుంచి 240 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. ఇవి 2022లో 250 మిలియన్ల నుంచి 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: