Discounts on iPhones: త్వ‌ర‌లో మార్కెట్‌లోకి ఐఫోన్ 13.. త‌గ్గిన ఐఫోన్ 12 ధ‌ర‌లు

ఐఫోన్ 12

ప్రముఖ మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్ నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించి ప్రీఆర్డ‌ర్(Pre-order) బుకింగ్‌ను సెప్టెంబ‌ర్ 14, 2021న ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేపథ్యంలో ఈ నేప‌థ్యంలో ఐఫోన్ 12 పై ఆపిల్ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది.

  • Share this:
    ప్రముఖ మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్ నెక్ట్స్(Next) జ‌న‌రేష‌న్ ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించి ప్రీఆర్డ‌ర్(Pre-order) బుకింగ్‌ను సెప్టెంబ‌ర్ 14, 2021న ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కొత్త సిరీస్ ఐఫోన్‌12 మాదిరిగానే కూడా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ వంటి మోడ‌ల్(Modal) రావొచ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఫ్రంట్ పేజ్ టెక్ వెబ్‌సైట్(Website) తెలిపిన స‌మాచారం ప్ర‌కారం ఆపిల్(Apple) ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌ల‌కు సంబంధించి సెప్టెంబ‌ర్ 24 నుంచి అమ్మ‌కాలు ప్రారంభించ‌వ‌చ్చ‌ని అంచనా వేస్తున్నారు.
    ఈ నేప‌థ్యంలో ఐఫోన్ 12 పై డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. ఐఫోన్ 12 64GB స్టోరేజ్, 128Gb స్టోరేజ్, 256GB స్టోరేజ్‌తో సహా మూడు స్టోరేజ్ మోడ‌ల్స్ ఉన్నాయి. ప్ర‌స్తుతం iPhone 12 64GB మోడల్ పై డిస్కౌంట్(Discount) ధర రూ. 66,999 కి లభిస్తుంది. 128GB మరియు 256GB స్టోరేజ్ మోడల్స్ వరుసగా రూ .71,999, రూ. 81,999 తగ్గింపు ధరలో లభిస్తాయి.

    ఐఫోన్ 12 ఫీచ‌ర్స్ ఇవే..
    ఇండియ‌న్ మార్కెట్‌లో ల‌భించే ఐఫోన్ స్పెసిఫికేష‌న్‌లు(Specifications) ఇలా ఉన్నాయి. రిసొల్యూష‌న్‌ 256x1170 పిక్సెల్ ఉంటుంది. ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ 256GB, కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్‌, ఫేస్ ఐడీ(Face id) సపోర్ట్ ఉంది. 4K వీడియో ఎడిటింగ్ చేసుకొనే వీలుగా A14 బయోనిక్ ఉంది.

    Whatsapp Features: ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే వారికి వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్ ఇదే..




    ఈ ఫోన్‌లోని 16-కోర్ న్యూరల్ ఇంజిన్ సెకనుకు 11 ట్రిలియన్ల వరకు ఆపరేషన్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐఫోన్ 12 సిరీస్ 5G నెట్‌వర్క్ స‌పోర్ట్ ఇస్తోంది. ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫోన్లు వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.6 లెన్స్ తో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ క‌లిగి ఉంటుంది.

    ఐఫోన్ 13 ఫీచ‌ర్స్ ఇవే..
    ఈ కొత్త ఐఫోన్ 13 మినీ మోడ‌ల్‌లో రెగ్యూల‌ర్ ఐఫోన్‌లానే డ్యూయ‌ల్(Dual) కెమెరాను క‌లిగి ఉంది. ఐఫోన్ 13 ప్రోలో ట్రిపుల్ కెమెరా(Camera)ను అందించారు. డ‌మ్మీ మోడ‌ల్స్‌లో కెమెరా మాడ్యూల్‌లో లేజ‌ర్ సెన్సాన్, ఎల్ఈడీ ఫ్లాష్‌లు ఉన్నాయి. ఐఫోన్ 12 ప్రో సెన్సార్‌లానే ఈ కొత్త ఫోన్‌లు(New Phones) లిడార్ సెన్సార్ ఉండే అవ‌కాశం ఉంది. ఐఫోన్ 13లో కూడా ప్రో మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయని అంచానా. ఇప్పటికే ఐప్యాడ్ ప్రో (2020, 2021) మోడళ్లలో “ప్రోమోషన్ డిస్‌ప్లే” ఫీచర్(Feature) ఇచ్చారు. ఐఫోన్ 13 సిరీస్‌లో కొత్త ఫేస్ అన్‌లాక్(Face unlock) టెక్ ఉంటుంది, అది ముసుగులు లేదా పొగమంచు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా పనిచేస్తుంది.
    Published by:Sharath Chandra
    First published: