IPHONE 13 FOR UNDER INR 50000 TO FOLLOW THESE STEPS TO FULL DETAILS UMG GH
iPhone 13: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13పై బంపరాఫర్.. రూ.50 వేలకే సొంతం చేసుకోండిలా..!
ఐఫోన్ 13
ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీ బడ్జెట్ రూ.50 వేలలోపే ఉందా.. అయితే మీరు ఖరీదైన ఐఫోన్ 13 (iPhone 13) సొంతం చేసుకోవచ్చు. గతేడాది ఐఫోన్ 13 రూ.79,990 ధరతో లాంచ్ అయ్యింది. అయితే కొన్ని ఆఫర్ల (Offers) కింద ఇప్పుడు మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రూ.50 లోపే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీ బడ్జెట్ రూ.50 వేలలోపే ఉందా.. అయితే మీరు ఖరీదైన ఐఫోన్ 13 (iPhone 13) సొంతం చేసుకోవచ్చు. గతేడాది ఐఫోన్ 13 రూ.79,990 ధరతో లాంచ్ అయ్యింది. అయితే కొన్ని ఆఫర్ల (Offers) కింద ఇప్పుడు మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రూ.50 లోపే కొనుగోలు చేయవచ్చు. 4-కోర్ జీపీయూతో ఏ15 బయోనిక్ చిప్, 12 ఎంపీ + 12 ఎంపీ రియర్ కెమెరాలు, 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఫేసియల్ అన్‌లాక్ 3240 mah లిథియం అయాన్ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో వచ్చే ఐఫోన్ 13.. వివిధ ఆఫర్లతో రూ.43 వేల నుంచి రూ.50 లోపు ధరలతో అందుబాటులోకి వచ్చింది. తాజాగా ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ క్రోమా (Croma) ఐఫోన్ 13పై కళ్లు చెదిరే ఆఫర్లు తీసుకొచ్చింది. ఆ ఆఫర్లతో ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. మరి ఆ ఆఫర్స్ ఏవో తెలుసుకుందాం.
* ఐఫోన్ 13పై బెస్ట్ ఆఫర్స్
ప్రస్తుతం క్రోమా ఐఫోన్ 13పై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ రిటైల్ ధర రూ.69,990కి తగ్గిపోయింది. లాంచ్ అయిన సమయం నుంచి ఐఫోన్ 13పై రూ.10 వేలు డిస్కౌంట్ అందించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు క్రోమాలో తప్ప ఎక్కడా ఐఫోన్ 13పై ఈ స్థాయిలో తగ్గింపు ప్రకటించలేదు. ఈ డిస్కౌంట్‌తో పాటు క్రోమా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఐఫోన్ 13పై మరో రూ.4,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెండు డిస్కౌంట్లతో ఐఫోన్ ధర రూ.65,900కి చేరుకుంటుంది.
ఐఫోన్ 13 ధర ఇంకా తగ్గించుకునేందుకు ఐఫోన్ 12ని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 12కి క్రోమా రూ.22 వేల ఎక్స్చేంజ్ వ్యాల్యూ అందిస్తోంది. దీంతో ఐఫోన్ 13 ధర రూ.43,800కి దిగి వస్తుంది. ఐఫోన్ 11 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,990 వరకు తగ్గింపు అందుకోవచ్చు. అప్పుడు ఐఫోన్ 13 ధర రూ.50,000 వరకు తగ్గుతుంది. అంటే కొనుగోలుదారులు రూ.20 వేలకు పైగా తగ్గింపుతో ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13 కొద్ది నెలల క్రితమే విడుదలైంది కాబట్టి ఈ ఫోన్‌కి ఇప్పటికీ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఐఫోన్ 14 లాంచ్ డేట్
సరఫరాలో అవాంతరాలు ఏర్పడిన కారణంగా యాపిల్ ఐఫోన్ 14 సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే టెక్ రిపోర్ట్స్ మాత్రం ఈ సరికొత్త ఫోన్ సెప్టెంబర్‌లోనే రిలీజ్ కావచ్చని పేర్కొంటున్నాయి. ఐఫోన్ 14 రెండు పెద్ద-సైజు మ్యాక్స్ వేరియంట్లలో వస్తుందని తెలుస్తోంది. 4 వేరియంట్లలో లాంచ్ కానుందని కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. రెగ్యులర్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో వేరియంట్లు వేర్వేరు చిప్సెట్స్తో రావచ్చని సమాచారం. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్‌లో ఫ్రంట్ కెమెరాల కోసం కటౌట్స్, నాచ్-లెస్ డిజైన్ ఉందని టాక్.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.