iPhone 13 : టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 14 సిరీస్‌ను ఇండియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాత తరం ఐఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. అయితే ఐఫోన్ వాడాలనేది ఒక డ్రీమ్‌గా ఉండి, భారీ ధరకు ఐఫోన్ 14 సిరీస్‌ను కొనుగోలు చేయలేని వారు, ఇప్పుడు ఐఫోన్ 13(iPhone 13)ను కొనుగోలు చేయవచ్చు. దీంట్లో ప్రస్తుత సిరీస్‌లో అందించిన హై రేంజ్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్‌లో వీటి ధరలు కూడా భారీగా తగ్గాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 13పై బంపర్ ఆఫర్ ప్రకటించింది ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌లో ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 45,000 కంటే తక్కువ ధరకే లభించింది. ఇప్పుడు దీన్ని రూ.50వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల వివరాలు చెక్ చేద్దాం.
ఐఫోన్ 13 128GB స్టోరేజ్ మోడల్ ధర అధికారికంగా రూ. 69,990 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని ధర ప్రస్తుతం తగ్గింది. ఈ మోడల్‌పై రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటిస్తుంది ఫ్లిప్‌కార్ట్ . అంటే ఐఫోన్ 13 ధర రూ. 65990కి తగ్గుతుంది. దీనిపై ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేదు. కానీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ధర మరింత తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్
ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ రూ. 17,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకొని, ఈ గరిష్ట విలువ పొందితే, ఐఫోన్ 13 ధర రూ.48,500కి తగ్గుతుంది. అయితే ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. పనితీరులో లోపాలు, ఇతర సమస్యలు ఉంటే, దానిపై ఫ్లిప్‌కార్ట్ తక్కువ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ అందిస్తుంది. అయితే పాత ఐఫోన్‌లు, లేదా ఫ్లాగ్‌షిప్ శామ్‌సంగ్ ఫోన్లు ఎక్స్ఛేంజ్ చేసే కస్టమర్లు ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఆఫర్లు అన్నింటితో కలిపి రూ.50వేల లోపు ధరకే ఐఫోన్ 13ను కొనుగోలు చేయవచ్చు.
Flipkart Phone Offers: సర్‌ప్రైజ్ ఆఫర్.. 200MP కెమెరా ఫోన్‌పై ఏకంగా రూ.35 వేల డిస్కౌంట్!
ఐఫోన్ 13 ఫీచర్లు
ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను కొనుగోలు చేయలేనివారు, గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 13ను కొనుగోలు చేయవచ్చు. లేటెస్ట్ సిరీస్‌లో యాపిల్ A16, A15 బయోనిక్ చిప్‌సెట్స్ అందించగా, ఐఫోన్ 13లో కూడా A15 చిప్‌సెట్ ఉంది. కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్, డిజైన్, బ్యాటరీ.. ఇలా అన్ని విషయాల్లో ఇది ఐఫోన్ 14కు ఏమాత్రం తీసిపోదు. అందుకే కొత్త ప్రీమియం ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న తాజా ఆఫర్లతో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple iphone, Iphone 13