యాపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 13(iPhone 13) కొనుగోలుపై ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌తో కలిపి దీన్ని కేవలం రూ. 56,000 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. గతేడాది, ఐఫోన్ 13 భారత మార్కెట్లోకి రూ. 79,900 వద్ద విడుదలైంది. ఫ్లిప్‌కార్ట్ డీల్ వివరాలను క్షణ్నంగా పరిశీలిస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై రూ. 5,000 తగ్గింపు అందిస్తోంది. అంటే, ఐఫోన్ 13 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.74,900 వద్ద లభిస్తుంది. ఇక, మీరు పాత ఐఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్(Exchange) చేయడం ద్వారా ఐఫోన్ 13పై గరిష్టంగా రూ. 18,850 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఐఫోన్ మోడల్‌ను బట్టి డిస్కౌంట్లో మార్పులుంటాయి. ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఫ్లిప్‌కార్ట్ పేమెంట్ పేజీలో తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు, మీ పాత ఐఫోన్ XR 64GB వేరియంట్‌పై రూ. 14,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, జనవరి 26 రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ XR పై రూ. 18,000 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో, మీ పాత ఐఫోన్ XR ఎక్స్ఛేంజ్పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా, అన్ని ఆఫర్లను పరిగణలోకి తీసుకుంటే ఐఫోన్ 13ను కేవలం రూ. 56,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, ఐఫోన్ 12 ధర వద్దే సరికొత్త ఐఫోన్ 13 మోడల్ లభిస్తుందనే విషయం స్పష్టమవుతోంది.
Jio, Airtel, Vi అందించే ఈ డేటా బూస్టర్ ప్లాన్ల గురించి మీకు తెలుసా..? కేవలం రూ. 15 నుంచే..
ఐఫోన్ XR ఎక్స్ఛేంజ్పై రూ. 18,850 డిస్కౌంట్
ఒకవేళ మీ పాత ఐఫోన్ XR ఎక్స్ఛేంజ్పై రూ. 18,850 డిస్కౌంట్ లభిస్తే.. ఐఫోన్ 13ను కేవలం రూ. 56,050 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. తద్వారా, ఐఫోన్ 13 మోడల్‌ను ఐఫోన్ 12 మోడల్‌తో సమానమైన ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే, అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. రూ.56,050లో 5 శాతం అంటే, దాదాపు రూ.2,800 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 13ను కేవలం రూ. 53,250 ధర వద్ద సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ మోడల్స్‌పై కూడా వర్తిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Iphone, Mobile News, Mobiles, Smartphone