సగం ధరకే iPhone 12... మీ పాత ఫోన్ ఇచ్చి కొనండి ఇలా

సగం ధరకే iPhone 12... మీ పాత ఫోన్ ఇచ్చి కొనండి ఇలా (image: iphone)

iPhone 12 | యాపిల్ ఇటీవల ఇండియాలో ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. మీరు యాపిల్ ఐఫోన్ 12 కొనాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. సగం ధరకే ఐఫోన్ 12 కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    పండుగ సీజన్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది యాపిల్. ఈ ఆఫర్‌తో మీరు సగం ధరకే ఐఫోన్ 12 కొనొచ్చు. ట్రేడ్ ఇన్ పేరుతో ఈ ఆఫర్ అందిస్తోంది యాపిల్. ట్రేడ్ ఇన్ ఆప్షన్ అంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అని అర్థం. మీ దగ్గరున్న పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేసి కొత్త ఐఫోన్ 12 కొనొచ్చు. ఏ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ ఎంతో వెబ్‌సైట్‌లో వెల్లడించింది యాపిల్. ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.3000 నుంచి రూ.63,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ ఇస్తోంది యాపిల్. ఉదాహరణకు ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌కు ట్రేడ్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.22,000 వరకు, ఐఫోన్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు ట్రేడ్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.34,000 వరకు ఎక్స్‌చేంజ్ లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో సేల్ అక్టోబర్ 30న ప్రారంభం అవుతుంది. మీరు ఐఫోన్ 12 మ్యాక్స్, ఐఫోన్ 12 మినీ కొనాలనుకుంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. ఈ రెండు ఫోన్లకు ఇండియాలో ప్రీ ఆర్డర్ నవంబర్ 6న, సేల్ నవంబర్ 13న మొదలవుతుంది. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌కు ట్రేడ్ ఇన్ వ్యాల్యూ ఎంతో తెలుసుకోండి.

    Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు

    Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    iPhone 11 Pro Max- రూ.63,000 వరకు
    iPhone 11 Pro- రూ.60,000 వరకు
    iPhone 11- రూ.37,000 వరకు
    iPhone XS Max- రూ.35,000 వరకు
    iPhone XS- రూ.34,000 వరకు
    iPhone XR- రూ.24,000 వరకు
    iPhone X- రూ.28,000 వరకు
    iPhone 8 Plus- రూ.21,000 వరకు
    iPhone 8- రూ.17,000 వరకు
    iPhone 7 Plus- రూ.17,000 వరకు
    iPhone 7- రూ.12,000 వరకు
    iPhone 6s Plus- రూ.9,000 వరకు
    iPhone 6s - రూ.8,000 వరకు
    iPhone 6 Plus- రూ.8,000 వరకు
    iPhone 6- రూ.6,000 వరకు
    iPhone SE- (1st Generation)- రూ.5,000 వరకు
    iPhone 5s- రూ.3,000 వరకు
    Samsung Galaxy S10- రూ.23,020 వరకు
    Samsung Galaxy S10 Plus- రూ.29,765 వరకు
    Samsung Galaxy S10e- రూ.19,650 వరకు
    Samsung Galaxy Note 10 Plus- రూ.36,230 వరకు
    Samsung Galaxy Note 10- రూ.27,175 వరకు
    Samsung Galaxy S9- రూ.13,140 వరకు
    Samsung Galaxy S9 Plus- రూ.13,020 వరకు
    Samsung Galaxy Note 9- రూ.18,395 వరకు
    Samsung Galaxy A51- రూ.11,545 వరకు
    Samsung Galaxy A71- రూ.13,975 వరకు
    Samsung Galaxy A70- రూ.9,710 వరకు
    Samsung Galaxy A70s- రూ.10,565 వరకు
    Samsung Galaxy A80- రూ.11,310 వరకు
    OnePlus 7- రూ.15,655 వరకు
    OnePlus 7T- రూ.19,170 వరకు
    OnePlus 6T- రూ.14,850 వరకు
    OnePlus 6- రూ.12,270 వరకు

    Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

    JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా

    పైన ఉన్న జాబితాలో మీ దగ్గర ఏ స్మార్ట్‌ఫోన్ ఉన్నా ఆ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే యాపిల్ ఎంత వ్యాల్యూ చెల్లిస్తుందో తెలుసుకోవచ్చు. కనీసం రూ.3,000 నుంచి రూ.63,000 వరకు ఎక్స్‌చేంజ్ వ్యాల్యూ ఇస్తోంది యాపిల్. ఈ వ్యాల్యూ మీ స్మార్ట్‌ఫోన్, కొన్న సంవత్సరం, ఫోన్ కండీషన్‌ను బట్టి మారుతుంది. యాపిల్ ట్రేడ్ ఇన్‌కు అన్ని స్మార్ట్‌ఫోన్లకు వర్తించదు. కేవలం యాపిల్ ఎంపిక చేసిన మోడల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.

    ఐఫోన్ 12 సిరీస్ ధరలు చూస్తే ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ రూ.79,900 కాగా 128జీబీ ధర రూ.84,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.94,900. ఐఫోన్ 12 మినీ 64జీబీ వేరియంట్ ధర రూ.69,900 కాగా 128జీబీ ధర రూ.74,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.84,900. ఐఫోన్ 12 ప్రో 128జీబీ జీబీ ధర రూ.1,19,900 కాగా 256జీబీ వేరియంట్ ధర రూ.1,29,900. హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.1,49,900. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ.1,29,900 కాగా 256జీబీ వేరియంట్ ధర రూ.1,39,900. హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.1,59,900.
    Published by:Santhosh Kumar S
    First published: