Home /News /technology /

IPHONE 12 PRO BIG DISCOUNT ON IPHONE 12 PRO ON AMAZON 25 THOUSAND DISCOUNT GH EVK

Big iPhone 12 Pro: అమెజాన్​లో ఐఫోన్ 12 ప్రోపై భారీ డిస్కౌంట్​.. ఏకంగా రూ. 25 వేల తగ్గింపు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

IPhone | ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ ఐఫోన్​ 12 ప్రో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం బిగ్​ డీల్ (Big Deal)​ ప్రకటించింది. ఈ డిల్ కింద ఐఫోన్​ 12 ప్రో మోడల్స్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మోడల్​పై ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్ (Discount)​ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ (New Year) ​కు కొత్త ఫోన్​ కొనాలని చాలా మంది ప్లాన్​ చేస్తుంటారు. అయితే, అటువంటి వారికి దాదాపు నెల రోజుల ముందే న్యూఇయర్​ ఆఫర్​ తీసుకొచ్చింది ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ (Amazon)​. ఐఫోన్​ 12 (IPhone 12) ప్రో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం బిగ్​ డీల్​ ప్రకటించింది. ఈ డిల్ కింద ఐఫోన్​ 12 ప్రో మోడల్స్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మోడల్​పై ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. ఐఫోన్​ 12  ప్రోకు చెందిన అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్​ వర్తిస్తుందని అమెజాన్​ స్పష్టం చేసింది. ఐఫోన్​ 12 ప్రో 128 జీబీ పసిఫిక్ బ్లూ వేరియంట్ అసలు ధర రూ.1,19,900 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 94,900 వద్ద కొనుగోలు చేయవచ్చు.

అంటే, ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కింద గరిష్టంగా రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ, మీరు 256 జీబీ, 512 జీబీ వేరియంట్ల కోసం చూస్తున్నట్లయితే, వాటిపై కూడా భారీ డిస్కౌంట్​ పొందవచ్చు.

ACT Fibernet: హైదరాబాద్​ యాక్ట్​ ఫైబర్​నెట్ యూజర్లకు గుడ్​న్యూస్​.. ఉచితంగా డేటా స్పీడ్​, లిమిట్​ పెంచుకునే ఛాన్స్​


Power Bank: ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తున్నారా..? ప‌వ‌ర్ బ్యాంక్ కొనాల‌నుకొంటున్నారా..? అయితే ఈ టిప్స్ చ‌ద‌వండి


ఐఫోన్​ 12 ప్రో 256 జీబీ వేరియంట్‌ను రూ. 99,990 ధర వద్ద విక్రయిస్తోంది. అంటే దీనిపై మీకు రూ. 30,000 డిస్కౌంట్​ లభిస్తుంది. మరోవైపు, 512 జీబీ వేరియంట్​పై రూ. 42,000 ఆదా చేసుకోవచ్చు. ఇది మీకు కేవలం రూ. 1,07,900 వద్ద లభిస్తుంది.

ఐఫోన్​ 12 ప్రో, ఎయిర్​పాడ్స్ కాంబోపై భారీ డిస్కౌంట్​..

కేవలం ఐఫోన్​ 12 ప్రో పైనే కాకుండా ఎయిర్​పాడ్స్​పై కూడా డిస్కౌంట్ (Discount)​ పొందవచ్చు. మీరు అమెజాన్​లో ఆపిల్ ఐఫోన్​​ 12 ప్రో, ఎయిర్​పాడ్స్​ ప్రో కాంబోను రూ. 1,15,395 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కాంబో అసలు ధర రూ.1,44,800 వద్ద ఉండగా.. దీనిపై దాదాపు రూ. 28,910 ఆదా చేసుకోవచ్చు.

No Password: ఇక పాస్‌వ‌ర్డ్ ఉండ‌దు.. అయినా మీ ఎకౌంట్ సేఫ్.. మైక్రోసాఫ్ట్ కొత్త ఆలోచ‌న‌


Cyber Security: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా.. ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి


అయితే, ఐఫోన్​ 13పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్​ ఉండదని అమెజాన్​ స్పష్టం చేసింది. ఆపిల్ ఐఫోన్​ 13 మినీ బేస్ వేరియంట్ రూ.69,900 వద్ద లభిస్తుంది. ఇక 256 జీబీ వేరియంట్​ రూ. 79,900, 512 జీబీ వేరియంట్​ రూ. 99,900 వద్ద అందుబాటులో ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Ios, Iphone, Latest Technology, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు