IPHONE 12 MINI GETS HUGE DISCOUNT AT FLIPKARTS ONGOING SMARTPHONE YEAR END SALE GH VB
iPhone: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి తరుణం.. భారీగా తగ్గిన ఐఫోన్ ధర.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
iPhone: మరికొద్ది రోజుల్లో 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ఈవెంట్ డిసెంబర్ 30తో ముగుస్తుంది.
మరికొద్ది రోజుల్లో 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ఈవెంట్ డిసెంబర్ 30తో ముగుస్తుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 12 మినీపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ మెథడ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద అదనపు డిస్కౌంట్, స్క్రీన్ ప్రొటెక్షన్ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇక, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఐఫోన్ 12 మిని కొనుగోలు చేయడం ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 64,900 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 55,199 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 74,900 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 65,199 వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఇక, ఈ సేల్ ఈవెంట్లో సాధారణ ఐఫోన్ 12 మోడల్‌పై కూడా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 12 64 జీబీ వేరియంట్‌ను రూ. 54,199 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 65,199 వద్ద లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా అతి తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
డిసెంబర్ 30 వరకు ఆఫర్లు..
ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12లో డిస్ప్లే మినహా మిగతా స్పెసిఫికేషన్లన్నీ ఒకేలా ఉంటాయి. ఐఫోన్ 12 రెగ్యులర్ మోడల్ 6.1 -అంగుళాల డిస్ప్లే, ఐఫోన్ 12 మినీ 5.4 -అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించే OLED ప్యానెల్లను అందించింది. కంపెనీ దీనిని సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్ప్లేగా పేర్కొంది. ఐఫోన్ 12 మినీ యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్తో పనిచేస్తుంది.
ఇది 5జీ సపోర్ట్‌తో వస్తుంది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీలో అందించిన మరో ముఖ్యమైన ఫీచర్ మ్యాగ్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. దీని ద్వారా ఐఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుకవైపు రెండు 12 -మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 12 -మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను అందించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.