Apple iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ బ్యాటరీ వివరాలివే..బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే...

ఐఫోన్ 12 సిరీస్ యొక్క బ్యాటరీ కెపాసిటీ లేదా ర్యామ్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. తాజాగా, ప్రముఖ బ్రెజిలియన్ టెలికాం ఆపరేటర్ అంటానెల్ ఐఫోన్ బ్యాటరీకి సంబంధించి కొన్ని వివరాలను పంచుకుంది.

news18-telugu
Updated: October 19, 2020, 9:32 PM IST
Apple iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ బ్యాటరీ వివరాలివే..బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఐఫోన్ 12 సిరీస్ ను ఎట్టకేలకు ప్రకటించింది యాపిల్ సంస్థ. తన "హాయ్, స్పీడ్" వర్చువల్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 14న ఐఫోన్ 12 సిరీస్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో ఐఫోన్ 12 సిరీస్ యొక్క బ్యాటరీ కెపాసిటీ లేదా ర్యామ్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. తాజాగా, ప్రముఖ బ్రెజిలియన్ టెలికాం ఆపరేటర్ అంటానెల్ ఐఫోన్ బ్యాటరీకి సంబంధించి కొన్ని వివరాలను పంచుకుంది.

అంతేకాక తన అధికారిక వెబ్ సైట్ టెక్నోబ్లాగ్ లో ఐఫోన్12 సిరీస్ బ్యాటరీ కెపాసిటీతో పాటు ఇతర వివరాలను పంచుకుంది. టెక్నోబ్లాగ్లో పొందుపర్చిన వివరాల ప్రకారం, ఐఫోన్ 12 మినీ 2,227 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. దీనిలో ఉండే బ్యాటరీ కెపాసిటీ ఐఫోన్ ఎస్ఈలో వచ్చే1,821 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా, ఐఫోన్ 11తో పోలిస్తే ఐఫోన్ 12లో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

2,815 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐఫోన్ 12 రానుండగా, 3,110 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఐఫోన్ 11 వస్తుంది. అంతే, ఐఫోన్ అఅ కంటే ఐఫోన్ 12లో బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉండనుందని చెప్పవచ్చు. కాగా, ఐఫోన్ 12 ప్రో లేదా ఐఫోన్ 12 ప్రో మాక్స్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వివరాలను మాత్రం ఈ నివేదిక ప్రస్తావించలేదు.

ఆపిల్ ఐఫోన్ 12 మినీని ఒక్కసారి ఫుల్ ఛార్జీ చేస్తే సుమారు 15 గంటల వీడియో ప్లేబ్యాక్ను పొందవచ్చని ఆపిల్ తన అధికారిక వెబ్ సైట్లో వెల్లడించింది. దీన్ని బట్టి, ఐఫోన్ 11లో వచ్చే17 గంటల వీడియో ప్లేబ్యాక్తో పోలిస్తే ఐఫోన్ 12 రెండు గంటలు తక్కువ ప్లేబ్యాక్ తో వస్తుందని చెప్పవచ్చు. అయితే, ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రోలో మాత్రం 17 గంటల వీడియో ప్లేబ్యాక్ ఉంటుందని ఆపిల్ తన వెబ్సైట్లో పేర్కొంది.

ఐఫోన్ 12 ప్రోను ఈసారి చైనాలో కాకుండా బ్రెజిల్ మరియు భారతదేశంలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీల్లో తయారు చేయనున్నట్లు టెక్నోబ్లాగ్ తన నివేదికలో పేర్కొంది. ఆపిల్ కంపెనీ జూలై నెలలో మొదటిసారిగా ఐఫోన్ 11 ప్రొడక్షన్ను భారత్ లో ప్రారంభించింది. తద్వారా ఐఫోన్ 11తో పాటు, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 7 మరియు ఐఫోన్ ఎస్ఈ ఫోన్లను భారతదేశంలోనే స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది.

ఈ కొత్త ఐఫోన్ 12 సిరీస్ 5జి టెక్నాలజీకి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆపిల్ యొక్క ఎ14 బయోనిక్ చిప్ ద్వారా పనిచేస్తుంది. కాగా, ఐఫోన్ 12 మోడల్స్ అన్నీ సూపర్ రెటినా ఎక్స్డిఆర్ డిస్ప్లేను కలిగి ఉన్నాయని ఆపిల్ పేర్కొంది.
Published by: Krishna Adithya
First published: October 19, 2020, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading