హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Saving Days: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఐ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Big Saving Days: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఐ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

తక్కువ ధరలో ఐఫోన్‌ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. బ్యాంక్ కార్డ్‌లతో పాటు ఇతర డిస్కౌంట్లతో ఈ డివైజ్ ధర రూ. 50,999కి తగ్గుతుంది.

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో కొత్త ఆఫర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భారీ ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లపై పెద్ద మొత్తంలో ఆఫర్స్ ఉన్నాయి. అయితే టాప్ బ్రాండ్స్‌పై మరిన్ని స్పెషల్ డిస్కౌంట్స్ అందిస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్‌ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. బ్యాంక్ కార్డ్‌లతో పాటు ఇతర డిస్కౌంట్లతో ఈ డివైజ్ ధర రూ. 50,999కి తగ్గుతుంది.

గతంలో ఐఫోన్ 12, 64GB వేరియంట్ ధర రూ.65,999గా ఉండేది. అయితే తాజా సేల్ సందర్భంగా ఫోన్ ధరను కంపెనీ రూ.51,999కి తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్ రూ. 1000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దీంతో దీని ధర రూ. 50,999కి తగ్గుతుంది. సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ కార్డ్‌లు ఉంటేనే బ్యాంక్ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. అందులోనూ ఈ స్పెషల్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటికి అదనంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, ఐఫోన్ 12 ధర మరింత తగ్గుతుంది.

ఇదీ చదవండి:  ఫిట్‌నెస్ ట్రాకర్స్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ లేని వారికి ఐఫోన్ 12 ప్రస్తుతం రూ. 59,999 వద్ద లిస్ట్ అయి ఉంది. అయితే యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో దీన్ని రూ. 56,999కి పొందవచ్చు. అయితే ఈ డీల్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉండదు. అయితే ఈ డీల్స్‌ను ఎంచుకునే ముందు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని ధరలను కూడా పోల్చి చూడాలి. ఆఫ్‌లైన్ స్టోర్స్ ఇప్పుడు తక్కువ ధరలను అందించడమే కాకుండా పాత ఫోన్‌లకు మంచి విలువను కూడా అందిస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్స్‌లో పాత ఫోన్‌లపై రూ. 3000 నుంచి రూ.8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌, ట్రేడ్-ఇన్ వ్యాల్యూ ఉన్నాయి.

* ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు

ఐఫోన్ 12 నెక్స్ట్-జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌తో A14 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. ఇది 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌ ఫీచర్లకు సపోర్ట్ చేసే 12-మెగాపిక్సెల్ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌ ప్రొటెక్షన్‌తో వస్తుంది. అయితే ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13లో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలామంది తికమక పడుతుంటారు. ఈ రెండు డివైజ్‌ల డిజైన్లలో పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ఐఫోన్ 12 కెమెరా సెటప్‌లో కెమెరా సెన్సార్లు నిలువుగా ఉంటాయి. కానీ అదే డిజైన్‌తో వచ్చిన ఐఫోన్ 13లో కెమెరా సెన్సార్‌లు డయాగ్నోనల్‌ షేప్‌లో ఉన్నాయి.

Published by:Mahesh
First published:

Tags: Apple iphone, Flipkart, Flipkart Big Billion Days, Iphone

ఉత్తమ కథలు