Home /News /technology /

IPADS STILL DONT HAVE A CALCULATOR APP BECAUSE OF THESE REASONS NS GH

Apple ipad: యాపిల్‌ ఐప్యాడ్స్‌లో క్యాలిక్యులేటర్‌ యాప్‌ ఎందుకు ఉండదో తెలుసా? ఇటీవలే బయటకు వచ్చిన వాస్తవాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫీచర్లు, డిజైన్ విషయంలో ముందుండే యాపిల్ ఫోన్ తన ఐప్యాడ్స్ లో ఇంత వరకు క్యాలుక్యులేటర్ ను ఇవ్వలేకపోయింది. ఇందుకు గల కారణాలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ కారణాలు ఏంటంటే..

మొబైల్ టెక్నాలజీ విషయంలో యాపిల్‌ తర్వాతే ఇంకెవరైనా అని అంటుంటారు. ఫీచర్లు, డిజైన్ విషయంలో యాపిల్‌ తర్వాతే మిగతా కంపెనీలు నిలుస్తాయి. అయితే.. అంత గొప్ప పేరున్న యాపిల్ తన ఐప్యాడ్స్‌లో ఇప్పటివరకు క్యాలిక్యులేటర్‌ యాప్‌ను పొందుపరచలేదు. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక క్యాలిక్యులేటర్‌‌ వంటి కొన్ని రకాల గ్యాడ్జెట్ల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. చాలామంది ప్రజలు వీటి ద్వారా కూడికలు, తీసివేతలు చేసుకోవడం మానేశారు. మొబైల్‌లో ఉండే క్యాలిక్యులేటర్‌ యాప్‌ ఈ అవసరాలను తీరుస్తోంది. కానీ యాపిల్‌ ఐప్యాడ్‌లో మాత్రం అలాంటి యాప్‌ కనిపించదు. దాని కోసం యూజర్లు మళ్లీ థర్డ్‌ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సంస్థ నుంచి మొదటి ఐప్యాడ్‌ వచ్చి 11 ఏళ్లు అవుతోంది. ఇంకా ఈ డివైజ్‌లలో క్యాలిక్యులేటర్‌ను సంస్థ ఇవ్వడం లేదు. దీని వెనుక ఉన్న కారణం ఇటీవల బయటికొచ్చింది.
Amazon Prime Day Sale: అమెజాన్ కస్టమర్లకు షాక్.. కరోనా నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం.. వివరాలివే..
Jio Plans: లాక్‌డౌన్ లో ఎక్కువ డేటా వాడే వారికి జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో తక్కువ ధరకు ఎక్కువ డేటా.. వివరాలివే

స్కాట్‌ ఫార్‌స్టల్‌ అనే డెవలపర్‌ యాపిల్‌ ఐప్యాడ్‌ తయారీలో కీలక పాత్ర పోషించాడు. 2010లో తొలి ఐప్యాడ్‌ లాంచ్‌కి కొద్ది రోజుల ముందు యాపిల్‌ హెడ్‌ స్టీవ్‌ జాబ్స్‌ చూసి ‘ఇదేంటి ఇందులో ఐఫోన్లలో వాడే క్యాలిక్యులేటర్‌ యాప్‌ ఉంది. కొత్త గా డిజైన్‌ చేయలేదా?’ అని అడిగారట. దానికి ఫార్‌స్టల్‌ నుంచి ‘లేదు ’అనే సమాధానం వచ్చింది. దీంతో జాబ్స్‌... వెంటనే ఆ పని చేయండి.. ఐప్యాడ్స్‌లో సరికొత్త క్యాలిక్యులేటర్‌ యాప్‌ ఉండాల్సిందే అన్నారట. కానీ ఫార్‌స్టల్‌ నిర్ణీత సమయంలో ఈ యాప్‌ను సిద్ధం చేయలేకపోయారట. దీంతో ఆ యాప్‌ లేకుండానే స్టీవ్‌ జాబ్స్‌ ఐప్యాడ్‌ను లాంచ్‌ చేసేశారు. అయితే తర్వాత వెర్షన్‌లో అయినా తీసుకొస్తారేమో అని యూజర్లు అనుకున్నారు.

వెర్షన్లు మారుతున్నాయి కానీ... క్యాలిక్యులేటర్‌ యాప్‌ మాత్రం రాలేదు. దీంతో యాడ్స్‌తో ఇబ్బంది పడుతూనే థర్డ్‌ పార్టీ యాప్‌లను వాడుతున్నారు యూజర్లు. ఇటీవల ఇదే విషయాన్ని యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రేగ్‌ ఫెడెరెగి దగ్గర ఓ యూట్యూబర్‌ ప్రస్తావిస్తే... ‘సంస్థ ఐప్యాడ్‌ కోసం మెరుగైన క్యాలిక్యులేటర్‌ యాప్‌లను రూపొందించే పనిలో ఉంది. అలాంటిది ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు ఐప్యాడ్‌లోకి తీసుకొస్తాం’ అని చెప్పారు. ఆయన మాటలు చూస్తుంటే ఇంత త్వరగా వచ్చేలా కనిపించడం లేదు. ఈలోపు డివైజ్‌ల యూజర్లు థర్డ్‌ పార్టీ యాప్‌లతో సరిపెట్టుకోవాల్సిందే.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, Ipad, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు