Home /News /technology /

IOS16 FULL LIST OF ALL IPHONES GETTING APPLE NEXT BIG SOFTWARE UPDATE GH PVN

iOS16 Update: త్వరలో ఐఓఎస్ 16 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ రిలీజ్..ఈ అప్‌డేట్ పొందనున్న ఐఫోన్లు ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

యాపిల్ కంపెనీ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 (WWDC 2022)లో ఐఓఎస్ 16 (iOS 16)ని ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లతో ఐఓఎస్ 16 అందుబాటులోకి రానుంది. మరి ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను పొందనున్న ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

iOS16 Update : ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ (Apple) ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 (WWDC 2022)లో ఐఓఎస్ 16 (iOS 16)ని ఆవిష్కరించింది. ఈ ఈవెంట్‌లో ఐఓఎస్16 ప్రత్యేకతలను యాపిల్ వివరించింది. ఈ ఓఎస్‌తో ఐఫోన్‌లలోని హోమ్ స్క్రీన్, నోటిఫికేషన్లు, ఫొటోస్‌ యాప్ సరికొత్తగా మారుతాయని తెలిపింది. లాక్‌స్క్రీన్‌లో ఇష్టమైన ఫొటోలు కనిపించేలా సెట్ చేసుకోవచ్చని, ఫాంట్ స్టయిల్స్ మార్చుకోవచ్చని.. సరికొత్త విడ్జెట్స్‌ అందించామని తెలిపింది. రీసెంట్‌గా పంపిన మెసేజ్‌ను ఎడిట్ లేదా డిలీట్ చేసే ఫీచర్ కూడా ఐఓఎస్16లో ఉంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో ఐఓఎస్ 16 అందుబాటులోకి రానుంది. మరి ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను పొందనున్న ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

- ఐఫోన్ 8

4.7-అంగుళాల రెటినా హెచ్‌డీ డిస్‌ప్లే, A11 బయోనిక్ చిప్‌, 12ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 7ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్న ఐఫోన్ 8కి ఐఓఎస్ 16 అప్‌డేట్‌ లభించనుంది.

- ఐఫోన్ 8 ప్లస్

ఐఫోన్ 8 ప్లస్‌లో 5.5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఐపీ67 రేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Poco F4 5G: త్వరలో మార్కెట్లోకి పోకో F4 5G స్మార్ట్‌ఫోన్..12GB RAMతో పాటు టాప్ ఫీచర్లతో రానున్న డివైజ్

- ఐఫోన్ ఎక్స్

2017లో వచ్చిన ఐఫోన్ ఎక్స్ కొత్త డిజైన్, ఆన్-ఆల్ డిస్‌ప్లే స్క్రీన్, నాచ్, ఫేస్ ఐడీని తొలిసారిగా పరిచయం చేసింది.

- ఐఫోన్ ఎక్స్ఆర్

ఐఫోన్ ఎక్స్ఆర్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా హెచ్‌డీ డిస్‌ప్లే, 7ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయింది.



- ఐఫోన్ ఎక్స్ఎస్

డ్యూయల్ సిమ్ సపోర్ట్‌, 5.8-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఐఓఎస్ 12తో ఐఫోన్ ఎక్స్ఎస్ వచ్చింది.

- ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌

2018లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్‌ ఏ12 బయోనిక్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి

- ఐఫోన్ 11

6.1-అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ 12ఎంపీ కెమెరాలు, ఐపీ68 రేటింగ్‌తో ఐఫోన్ 11 అందుబాటులోకి వచ్చింది.

- ఐఫోన్ 11 ప్రో

ఐఫోన్ 11 ప్రో 5.8-అంగుళాల సూపర్ రెటినా ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A13 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది.

- ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌ 5.8-అంగుళాల ఓఎల్ఈడీ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఏ13 బయోనిక్ చిప్‌సెట్‌తో లాంచ్ అయింది.

- ఐఫోన్ 12

ఐఫోన్ 12లో A14 బయోనిక్ చిప్‌సెట్‌, 6.1-అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను అందించారు.

- ఐఫోన్ 12 మినీ

ఐఫోన్ 12 మినీ 5.4-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఏ14 బయోనిక్ చిప్‌సెట్, ఐఓఎస్ 15తో మార్కెట్‌లో విడుదలైంది.

- ఐఫోన్ 12 ప్రో

ఐఫోన్ 12లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఏ14 బయోనిక్ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లున్నాయి.

- ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌

స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

- ఐఫోన్ 13

ఐఫోన్ 13లో 6.1-అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్‌, ఏ 15 బయోనిక్ ప్రాసెసర్ మెయిన్ ఫీచర్లు.

Mia Khalifa Car Collection: మియా ఖలీఫా కార్ కలెక్షన్..ఆమె వద్ద ఉన్న హాట్ అండ్ సెక్సీ రేంజ్ కార్లు ఇవే..

- ఐఫోన్ 13 మినీ

ఐఫోన్ 13 మినీలో 5.4-అంగుళాల డిస్‌ప్లే, ఐఓఎస్ 15, ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను ఆఫర్ చేశారు.

- ఐఫోన్ 13 ప్రో

ఐఫోన్ 13 ప్రో ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో ఐఓఎస్ 15పై రన్ అవుతుంది.

- ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌

ఈ ఫోన్ ఐఓఎస్ 15తో 12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయింది.

- ఐఫోన్ ఎస్ఈ (2020)

ఐఫోన్ ఎస్ఈ (2020) 4.7-అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ఏ13 బయోనిక్, ఐఓఎస్ 13తో మార్కెట్లోకి ప్రవేశించింది.

- ఐఫోన్ ఎస్ఈ (2022)

ఐఫోన్ ఎస్ఈ (2022) 64జీబీ, 128జీబీ, 256జీబీ మోడల్‌లలో వస్తుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Apple iphone, Ios, Iphone

తదుపరి వార్తలు