ఇండియాలో(India) ఇటీవలే 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ కొన్ని కంపెనీల ఫోన్లను వాడేవారికి 5Gని యాక్సెస్ చేసే టెక్నికల్ సపోర్ట్ రాలేదు. దీంతో ఈ మోడల్స్‌లో ఇండియన్ 5Gకి సపోర్ట్(Support) చేసేలా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయాల్సి ఉంది. దీంతో ఈ లేటెస్ట్ టెక్నాలజీకి(Latest Technology) సపోర్ట్ చేసేలా తమ 5G డివైజ్‌లలో కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ యూజర్లకు యాపిల్(Apple) ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఫోన్లకు 5G సపోర్ట్ అందించే iOS 16 బీటా సాఫ్ట్వేర్(iOS 16 beta Software)ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఇండియాలో యాపిల్ ఐఓఎస్ 16 5G బీటా అందుబాటులోకి వచ్చింది. యాపిల్ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే అప్డేట్ పొందడానికి అర్హులు.
ఈ అప్డేట్ ద్వారా దేశంలోని ఎయిర్టెల్(Airtel), జియో(Jio) కస్టమర్లు యాపిల్ ఐఫోన్లలో 5జీ సేవలను వినియోగించుకునే సదుపాయం లభిస్తుంది. ఐఫోన్ 14(iPhone 14) సిరీస్, ఐఫోన్ 13(iPhone 13) సిరీస్, ఐఫోన్ 12(iPhone 12) సిరీస్, ఐఫోన్ SE(iPhone SE) థర్డ్ జెనరేషన్ ఫోన్లను ఉపయోగించే కస్టమర్లు యాపిల్ ఐఓఎస్ 16 బీటా ద్వారా 5జీ సేవలను పొందవచ్చు.
యాపిల్ ఐఓఎస్ 16 5G వెర్షన్‌ను డిసెంబర్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ 5జీ సర్వీస్ ఎనేబుల్ చేశామని, ఈ డిసెంబర్లో ఐఫోన్ వినియోగదారులు అందరికీ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇన్స్టాల్ చేసే ముందు బ్యాకప్(Backup) చేయడం మంచిది
ఐఫోన్లకు 5జీ సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్ అందిస్తామని, భారతదేశంలోని క్యారియర్లతో కలిసి పని చేస్తున్నామని యాపిల్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. నెట్వర్క్ వ్యాలిడేషన్, క్వాలిటీ, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ పూర్తయిన వెంటనే ఐఫోన్ వినియోగదారులకు బెస్ట్ 5జీ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తామని పేర్కొంది. ఇప్పుడు బీటా వెర్షన్‌ను రోలవుట్ చేసింది.
ఐఓస్ 16 5G బీటా అనేది ఐఫోన్(iPhone 14, 13, 12, SE థర్డ్ జనరేషన్)ల వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వ్యాలిడ్ Apple IDని ఉన్న వారు బీటా సాఫ్ట్వేర్ కోసం సైన్ అప్ చేసుకోవచ్చు. సాధారణంగా ఏదైనా బీటా సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసే ముందు ఫోన్‌ను బ్యాకప్ చేయాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే బీటా వెర్షన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఏదైనా తప్పు జరిగితే, డేటా మొత్తం ఎరేజ్ అయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Apple, Iphone