Home /News /technology /

IOS 15 UPDATE AVAILABLE ON IPHONE NEW FEATURES ARE EVK

iPhone features: ఐఓఎస్ 15 వ‌చ్చేసింది .. ఫీచ‌ర్లు ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఐఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఓఎస్‌ 15  (ioS 15) అప్‌డేట్‌ని యాపిల్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 20 రాత్రి 10.30 తరువాత నుంచి ఐఫోన్‌ యూజర్లు తమ డివైజ్‌లలో ఈ కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

    ఐఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఓఎస్‌ 15  (ioS15) అప్‌డేట్‌ని యాపిల్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 20 నుంచి ఐఫోన్‌ యూజర్లు తమ డివైజ్‌లలో ఈ కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వరల్డ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్‌ 15కి సంబంధించిన వివరాలను యాపిల్‌ వెల్లడించింది. ఈ యాపిల్ ఐవోఎస్ 15 అప్‌డేట్ Phone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE, and the iPhone SE (2020) మోడ‌ల్స్‌లో చేసుకోవ‌చ్చు.

    ఐఫోన్ 13 అన్ని మోడ‌ల్స్‌లో ఐవోఎస్ 15తోనే వినియోగ‌దారుల ముందుకు వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ 20 రాత్రి 10.30 త‌రువాత ఈ అప్‌డేట్‌కు అవ‌కాశం ఉంది. ఫోన్‌లో ఈ సాఫ్ట్ వేరు అప్‌డేట్ చేసుకోవాలనుకొంటే ఫోన్‌లో Settings > General > Software update లోకి వెళ్లి క్లిక్ చేస్తే స‌రిపోతుంది. మాక్ కంప్యూట‌ర్‌లో మాన్యువ‌ల్‌గా ఐవోఎస్ 15ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

    Whatsapp Feature: అదిరిపోయే ఫీచ‌ర్‌.. సేవ్‌కాని నంబ‌ర్ల‌కు వాట్స‌ప్‌ మెసేజ్‌ చేయొచ్చు


    కొత్త అప్‌డేట్ ఫీచ‌ర్స్ ఇవే
    - iOS 15లో యాపిల్ కొత్తగా ఫేస్‌టైమ్‌ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచ‌ర్‌లో క్వాలిటీ వీడియో, ఆడియో అవ‌కాశం ఎక్కువ‌గా ఉండేలా రూపొందించారు. ఫేస్ క‌నిపిస్తూ మిగతా ప్రాంత‌మంతా బ్ల‌ర్ అవుతుంది.
    - యూజ‌ర్ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డే యాపిల్ మ్యాప్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్ అందిస్తుంది. 3డీ ల్యాండ్ మార్కింగ్‌తోపాటు మ్యాప్ ఆధారంగా వెళ్లిన ప్ర‌దేశానికి ప‌ట్టిన స‌మ‌యం కూడా తెలుసుకోవ‌చ్చు.
    - కొత్త సాఫ్ట్ వేర్‌లో యూజ‌ర్ల‌కు మెరుగైన అనుభ‌వాన్ని క‌లిగించేందుకు పిక్చ‌ర్ల‌ను ఐఫోన్ అందిస్తోంది. Shared with You ఫోల్డ‌ర్ ద్వారా వాటిని ఎమోజీలు, పిక్చ‌ర్ల‌ను ప‌దిల ప‌రుచుకోవ‌చ్చు. అంతే కాకుండా లైవ్ టెక్ట్స్ ఫీచ‌ర్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఫొటోలపైన ఉండే టెక్ట్స్‌ని డైరెక్టుగా కాపీ, పేస్ట్, షేర్‌ చేసుకొనే వెసులుబాటు ఇస్తోంది. ఇందుకోసం ఐఓఎస్‌ 15లో ఓసీఆర్ అనే ఫీచర్‌ను అంద‌నంగా అందిస్తున్నారు.
    - కొత్త సాఫ్ట్ వేర్‌లో నోటిఫికేష‌న్ బార్‌ల‌ను సెట్ చేసుకొనే అవ‌కాశం ఉంది. యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన అంశాల‌నే నోటిఫికేష‌న్ రూపంలో పొందేలా ఈ సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు. అయితే మిస్డ్ కాల్స్‌, మెసేజ్‌లు ఈ క్యాట‌గిరీలోకి రావు.
    - ఐఓఎస్ 15లో షేర్‌ప్లే ఆప్ష‌న్‌ను అద‌నంగా అందిస్తున్నారు. ఈ ఫీచ‌ర్ ద్వారా ఫోన్ స్క్రీన్‌ను ఎంత‌సైపైనా షేర్ చేసేలా రూపొందించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 5G Smartphone, Apple, Ios, Latest Technology, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు