Whatsapp Features: వాయిస్ మెసేజ్ పంపే ముందు వినొచ్చు.. వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్‌

(ప్రతీకాత్మక చిత్రం)

ఏదో ఒక కొత్త ఫీచ‌ర్‌ల‌ను నిరంత‌రం అందిస్తూ వినియోగ‌దారుల మ‌న‌సుకు ద‌గ్గ‌ర అవ్వ‌డం వాట్స‌ప్‌కు కొత్తేం కాదు. ఈ సారి వాట్స‌ప్‌(Whatsapp) ఇత‌ర మెసేజింగ్ యాప్‌ల‌కు ధీటుగా యూజ‌ర్ ఫ్రెండ్లీ ఫీచ‌ర్స్‌(Feature)ను తీసుకొస్తుంది. మ‌నం రికార్డు(Record) చేసిన త‌ర్వాత విని ఆ మెజేస్‌లో ఏమైన మార్పులు ఉంటే ఆ రికార్డు డెలిట్(delete) చేసుకొనేలా కొత్త ఫీచ‌ర్‌ను వాట్స‌ప్ ప్ర‌వేశ పెడుతుంది.

  • Share this:
    ఏదో ఒక కొత్త ఫీచ‌ర్‌ల‌ను నిరంత‌రం అందిస్తూ వినియోగ‌దారుల మ‌న‌సుకు ద‌గ్గ‌ర అవ్వ‌డం వాట్స‌ప్‌కు కొత్తేం కాదు. ఈ సారి వాట్స‌ప్‌(Whatsapp) ఇత‌ర మెసేజింగ్ యాప్‌ల‌కు ధీటుగా యూజ‌ర్ ఫ్రెండ్లీ ఫీచ‌ర్స్‌ను తీసుకొస్తుంది. ఆ కొత్త ఫీచ‌ర్‌ను వాట్స‌ప్ ప్ర‌క‌టించింది కూడా.. ఇది క‌చ్చితంగా ఎంతో ఉప‌యోగ‌ప‌డే ఫీచ‌ర్‌(Feature). మ‌నం చాలా సార్లు వాట్స‌ప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపుతూనే ఉంటాం. ఆ మెసేజ్(Message) ఎలా వ‌చ్చిందో కూడా మ‌న‌కు తెలియ‌కుండా సెండ్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. మ‌నం పంపిన త‌ర్వాత ఇత‌రులు వినేట‌ప్పుడే ఆ మెసేజ్ వింటాం. స‌రిగా రాకుంటే అయ్యో అనుకుంటాం. ఇక‌పై అలా కాకుండా డైరెక్ట్‌గా వాయిస్(Voice) మెసేజ్‌లు పంప‌కుండా మ‌నం రికార్డు చేసిన త‌ర్వాత విని ఆ మెజేస్‌లో ఏమైన మార్పులు ఉంటే ఆ రికార్డు డెలిట్(delete) చేసుకొనేలా కొత్త ఫీచ‌ర్‌ను వాట్స‌ప్ ప్ర‌వేశ పెడుతుంది. ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల మ‌ధ్య మెరుగైన నాణ్య‌మైన(Quality) స‌మాచారా మార్పిడీకి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని వాట్స‌ప్ తెలిపింది.

    Netflix: iOS యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ప‌టిక‌ల్ ఆడియో


    ఈ ఫీచ‌ర్‌తో పాటు అద‌నంగా వాయిస్ మెసేజ్ ఇంట‌ర్‌ఫేస్‌ లో కూడా మార్పులు చేస్తున్న‌ట్టు తెలిపింది. మ‌నం గ‌తంలో వాయిస్ మెసేజ్ పంపితే ఒక స్ట్రైట్ లైన్‌మీద‌ డాట్ క‌దులుతూ వాయిస్ వినిపిస్తుంది. ఇక మీద వ‌చ్చే ఫీచ‌ర్‌లో ఆడియో వేవ్‌(Audio Wave)లు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఈ ఫీచ‌ర్ త్వ‌ర‌లోనే వినియోగ‌దారులంద‌రికీ అందుబాటులోకి తెస్తామ‌ని వాట్స‌ప్ బీటా ఇన్ఫో వాట్స‌ప్ క‌మ్యూనిటీ బ్లాగ్‌లో ప్ర‌క‌టించింది. ఈ ఫీచ‌ర్‌తోపాటు మెసేజ్ రియాక్ష‌న్‌, క‌ల‌ర్ స్కీమ్‌, వెబ్ ప్రివ్యూ, డేటా ట్రాన్స్‌ఫ‌ర్‌, స్టేట‌స్ ట్యాబ్ వంటి ఎన్నో ఫీచ‌ర్‌లు వాట్స‌ప్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ ఫీచ‌ర్‌లు అన్ని ప్ర‌స్తుతం ప‌రీక్ష ద‌శ‌లోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.
    Published by:Sharath Chandra
    First published: