హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Women’s Day 2021: వుమెన్స్ డే సందర్భంగా మహిళలకు నీతా అంబానీ కానుక

Women’s Day 2021: వుమెన్స్ డే సందర్భంగా మహిళలకు నీతా అంబానీ కానుక

Women’s Day 2021: వుమెన్స్ డే సందర్భంగా మహిళలకు నీతా అంబానీ కానుక

Women’s Day 2021: వుమెన్స్ డే సందర్భంగా మహిళలకు నీతా అంబానీ కానుక

Women’s Day 2021 | నెట్వర్కింగ్‌తో పాటు లక్ష్యం నెరవేర్చుకునేందుకు హర్ సర్కిల్ వేదిక. ఇందులో మహిళలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా ముఖేష్ అంబానీ మహిళలకు కానుక ఇచ్చారు. మహిళా శక్తిని సమన్వయం చేసేందుకు డిజిటల్ విప్లవాన్ని ఉపయోగించుకొని సరికొత్త వేదికను Her Circle పేరుతో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారతకు చేయూతనిచ్చేందుకు, ఒకరికొకరు సహకరించుకునేందుకు సురక్షితమైన వేదికగా 'హర్ సర్కిల్' ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు డిజిటల్ సాధనాల ద్వారా ఒకేచోట చేరేందుకు 'హర్ సర్కిల్' ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడుతుంది. ఇది మొదట భారతీయ మహిళల కోసం ప్రారంభించినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు. మహిళల్లో వేగంగా పెరుగుతున్న ఆకాంక్షలు, ఆశయాలు, కలలు, సామర్థ్యాలకు సహకారం అందించే కంటెంట్ ఈ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తుంది.

మహిళలు మహిళలవైపు మొగ్గుచూపినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నా జీవితమంతా నా చుట్టూ బలమైన మహిళలే ఉన్నారు. వారి నుంచి నేను పాజిటివిటీ, దయాభావం లాంటివి నేర్చుకున్నాను. అందుకు బదులుగా నేను నేర్చుకున్నదాన్ని ఇతరులకు పంచుతున్నాను. 11 మంది అమ్మాయిలు ఉన్న ఇంట్లో ఓ కూతురిగా నన్ను నేను నమ్మడాన్ని నేర్చుకున్నాను. నా కలలను సాధించేందుకు నా కూతురు ఇషా నుంచి ప్రేమను, విశ్వాసాన్ని పొందాను. నా కోడలు శ్లోక నుంచి సహనం, సానుభూతి నేర్చుకున్నాను. రిలయెన్స్ ఫౌండేషన్‌లోని మహిళలైనా, జాతీయ, అంతర్జాతీయ మహిళలైనా వారితో కలిపి పనిచేశాను. ఎలాంటి పోరాటాలైనా చివరకు విజయాలతోనే ముగుస్తాయని ఒకరితో మరొకరు పంచుకున్న అనుభవాల ద్వారా తెలిసింది. ఇలాంటి వేదికనే కోట్లాది మంది మహిళలకు ఏర్పాటు చేసేందుకు HerCircle.in డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తున్నాం. ప్రతీ మహిళ ఇందులో చేరొచ్చు. తన భావాలను పంచుకోవచ్చు. అన్ని వర్గాలు, సంస్కృతులు, దేశాల నుంచి ఆలోచనల్ని, కార్యక్రమాలను నిర్వహించేందుకు హర్ సర్కిల్ ఆహ్వానిస్తోంది.

నీతా ముఖేష్ అంబానీ, రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్

' isDesktop="true" id="791096" youtubeid="7Y8z_h8t1CM" category="technology">

హర్ సర్కిల్ ఎలా పనిచేస్తుంది?


ఒకరినొకరు అనుసంధానించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి పనిచేసే సామాజిక వేదిక. ఇందులో వీడియోలు చూడొచ్చు. ఆర్టికల్స్ చదవొచ్చు. జీవితం, వెల్‌నెస్, ఫైనాన్స్, వర్క్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, యాక్టీవ్ పార్టిసిపేషన్ లాంటి కంటెంట్ ఉంటుంది. ఇది కేవలం మహిళల కోసం పనిచేసే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే. కాబట్టి ప్రైవసీ, విషయంలో సురక్షితంగా ఉండొచ్చు. కొత్త స్నేహితులను పొందొచ్చు. ఆసక్తులు వివరించొచ్చు. సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. కాన్ఫిడెన్షియల్ ఛాట్‌రూమ్స్ ద్వారా మెడికల్, ఫైనాన్స్ నిపుణుల నుంచి సలహాలు పొందొచ్చు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌లో ఈ వెబ్‌సైట్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, మైజియో యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు. హర్ సర్కిల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా ఉచితం. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో ప్రారంభమవుతోంది. త్వరలో ఇతర భాషల్లో అందుబాటులోకి రానుంది.

First published:

Tags: Nita Ambani, Reliance, Reliance Foundation, Women, Women health, Women's day, Womens day 2021

ఉత్తమ కథలు