అంతర్జాతీయ ప్రయాణికులు కోవిన్ (CoWin) పోర్టల్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సర్టిఫికెట్లో వారి పుట్టిన తేదీని కూడా కనిపించేలా రూపొందించారు. డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రమాణాలు పాటించేలా, వారి నియమనిబంధనలను అనుసరించి ఈ సర్టిఫికెట్‌ను అందిస్తున్నారు. ఈ ఫీచర్‌ను సెప్టెంబర్ 30, 2021నుంచి అమలులోకి తెచ్చినట్టు నేషనల్ హెల్త్ అథారిటీ (National Health Authority) సీఈఓ ఆర్ఎస్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. టీకాకు సంబంధించి ప్రపంచ స్థాయి డిజిటల్ ప్లాట్‌ఫాంగా కోవిన్‌ను రూపొందించామని ఆయన అన్నారు. ఈ కోవిన్ ట్రవెల్ సర్టిఫికెట్ WHO-DDCC: VS డేటా డిక్షనరీకి అనుగుణంగా ఉండేలా రూపొందించామని శర్మ పేర్కొన్నారు. కోవిన్ అంతర్జాతీయ వెర్షన్ సర్టిఫికెట్ (Certificate)ను పోర్టల్‌లో డౌన్లోడ్ చేసుకోండని ఆయన సూచించారు.
ఈ అంశంపై ఆర్ఎస్ శర్మ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. వినియోగదారులు సర్టిఫికెట్‌ను కోవిన్ పోర్టల్‌లోని కొత్తగా చేర్చిన “ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్” (Inter National Travel Certificate) ఆప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సర్టిఫికెట్ WHO యొక్క డిజిటల్ డాక్యుమెంటేషన్, COVID-19 సర్టిఫికెట్, టీకా స్థితి, డేటా డిక్షనరీకి అనుగుణంగా ఉంటుందని తెలిపారు. దేశ ప్రజలకు ట్రావెల్ సర్టిఫెకెట్ అవసరమని అందుకోసమే ఒక నిర్థిష్ట విధానంలో కోవిన్ సర్టిఫికెట్ ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు.
Step 2 : అందులో టీకా వేసుకొన్న వారు లాగిన్ సమాచారంతో లాగిన్ అవ్వాలి.
Step 3 : లాగిన్ అయిన తరువాత పోర్టల్‌లో కోవిన్ పేజీ యొక్క కుడి దిగువ మూలలో “సర్టిఫికెట్” ఎంపిక పక్కన కొత్త “అంతర్జాతీయ ప్రయాణ ధృవీకరణ పత్రం” ఎంపిక కనిపిస్తుంది.
Step 4 : సర్టిఫికెట్ కావాలనుకొన్నవారు దాన్ని క్లిక్ చేయండి.
Step 5 : ఈ ధ్రువీకరణ పత్రం పుట్టిన తేదీ, టీకా డోస్, టీకా పేరు, రకం, తయారీ దారు, రిజిస్టర్ నంబర్, సంవత్సరం, నెల, డోస్ తీసుకొన్న తేదీలు, డోస్ బ్యాచ్ నంబర్ ఉంటాయి.
Step 6 : ఈ సర్టిఫికెట్ WHO-DDCC కి అనుగుణంగా ఉందని అధికారులు తెలిపారు.
త్వరలో ఆమోదం..
ప్రస్తుతం అమెరికాలో కోవిన్ టీకా ధ్రువీకరణ పత్రాన్ని గుర్తించడానికి భారత దేశంతో చర్చలు జరుగుతున్నాయి. అంతే కాకుండా యూ.కె - భారతదేశం మధ్య కూడా టీకా సర్టిఫికెట్ గుర్తింపుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంలో త్వరలోనే కొలిక్కి వస్తుందని అధికారికి వర్గాలు చెబుతున్నాయి. అందుకోసమే ఈ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఒక సారి చర్చలు పూర్తయిన తరువాత ప్రయాణికులు ఎటువంటి నిర్బంధం లేకుండా ట్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా ప్రయాణించవచ్చని అధికారులు చెబుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.