IPhone: ఐఫోన్‌లో 7ఏళ్ల కొడుకు చేసిన పనికి షాక్.. కారు అమ్మి1.33 లక్షల బిల్లు కట్టిన తండ్రి

ఏడేళ్ల పిల్లడు ఆడిన గేమ్ తో కారు అమ్ముకున్న తండ్రి

పిల్లాడు అడిగాడు కదా అని ఓ తండ్రి ఫోన్ ఇచ్చాడు. అది కూడా ఐ ఫోన్.. ఆ ఫోన్ లో గేమ్ ఆడుతూ ఆ పిల్లాడు చేసిన బిల్లుకు.. తండ్రి కారును అమ్ముకోవాల్సి వచ్చింది.

  • Share this:
    చిన్న పిల్లలు మారం చేస్తున్నారని వారికి ఫోన్ ఇస్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్ గా ఉండాల్సిందే. సరే ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు కదా అని వదిలేశారో అంతే సంగతులు. తాజాగా ఏడేళ్ల కుర్రాడు చేసిన పని ఆ తల్లి దండ్రులకు షాక్ ఇచ్చింది. ఐఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ 7ఏళ్ల కొడుకు చేసిన పనికి ఓ డాక్టర్ 1.33 లక్షల రూపాయల బిల్లు కట్టాల్సి వచ్చింది. అంత డబ్బు లేకపోవడంతో.. ఆ బిల్ కట్టేందుకు ఫ్యామిలీ కార్ ను అమ్ముకోవాల్సి వచ్చిందట. ఈ ఘటన యూకేలోని నార్త్ వేల్స్ లో జరిగింది. ఏడు సంవత్సరాల వయస్సున్న ఆషాజ్ అనే పిల్లాడు ఐఫోన్ లో డ్రాగన్స్ రైజ్ ఆఫ్ బెర్క్ అనే గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ లో తన ప్రోగ్రెస్ పెంచుకోవడం కోసం వస్తున్న యాడ్ లను అనుసరిస్తూ.. పలు కొనుగోళ్లు జరిపాడు. ఈ యాప్ కొనుగోళ్లు అన్నీ కలిపి మొత్తం వెయ్యి 289.70పౌండ్లు అయిందట. అంటే రూ.1.33లక్షల రూపాయలు.

    అతని తండ్రి ముహమ్మద్ ముతాజా చూసేవరకూ దీని గురించి తెలియలేదు. కన్సల్టెంట్ ఎండోక్రినోలజిస్ట్ అయిన ఆ వ్యక్తి ఫ్రీ వెర్షన్ ఆడుతున్నాడు కదా అని భావించాడట. అసలు ఆ గేమ్ 99.99 పౌండ్ల వరకూ ఎలా వసూలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. మల్టిపుల్ ట్రాన్సాక్షన్లు జరిగాయని తెలుసుకుని ఇదేదో స్కాంలా ఉందని భావించి యాపిల్ వారికి కంప్లైంట్ చేస్తే కేవలం 207పౌండ్లు మాత్రమే తిరిగొచ్చాయట. ఇంకా ఆ బిల్ కట్టడానికి చాలా అమౌంట్ అవసరమవుతుందని భావించి టయోటా ఏగో కార్ అమ్మేసి బిల్ చెల్లించాడు. తర్వాతి సంగతి కోర్టులో తేల్చుకుంటానని ఆ తండ్రి చెబుతున్నాడు.

    ఏది ఏమైనా ఈ జనరేషన్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ గురించి తెలియన చిన్నారులు లేరు.. అలా అని వారికి ఫోన్ ఇవ్వకుండా ఉంచడం కష్టమే. ప్రస్తుతం కరోనా కాటు కారణంగా ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో పిల్లలకు ఫోన్ లపై పూర్తి గ్రిప్ వచ్చింది. ఆ క్లాస్ లు అయిపోయిన గేమ్ లు ఆడేవారు కొందరు.. ప్రస్తుతం పిల్లలను బయటకు పంపిచే పరిస్థితి లేక ఫోన్ తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే అలా ఫోన్ ఇచ్చిన తరువాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే ఈ డాక్టర్ మాదిరి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ తన కొడుకు ఎలా ఈ గేమ్ ఆడాడో అర్థం కాలేదని…బహుశా తన పాస్ వర్డ్ ని ఎప్పడో చూసి ఉంటాడని అయన అన్నాడు. ఇంకా పబ్జీ వంటి ఆటలు ఆడుతూ అనేకమంది పిల్లలు బంగారం లాంటి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కొందరైతే సూసైడ్లకు కూడా పాల్పడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: