ట్విట్టర్ సీఈఓతో మోదీ ఏం మాట్లాడాడో తెలుసా?

జూలైలో ప్రపంచంలోనే అత్యధికమంది ట్విట్టర్ ఫాలోవర్స్(4.34 కోట్లు) ఉన్న మూడో వ్యక్తిగా మోదీకి రికార్డుంది. ప్రస్తుతం 4.44 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

news18-telugu
Updated: November 14, 2018, 6:49 PM IST
ట్విట్టర్ సీఈఓతో మోదీ ఏం మాట్లాడాడో తెలుసా?
ట్విట్టర్ సీఈఓతో మోదీ సంభాషణ
  • Share this:
సోమవారం నాడు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటి అన్న ప్రశ్నలకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీనే స్వయంగా సమాధానమిచ్చారు. మోదీ తనకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారని, "ఆయన ప్రపంచాన్ని చాలా విస్తారంగా చూస్తారని, మనమంతా ఒకే భూమిపై ఉన్నామని, మానవత్వం అంతా ఒకటేనని ఆయనతో మాట్లాడినప్పుడు తెలిసింది" అని వివరించారు డోర్సీ. జూలైలో ప్రపంచంలోనే అత్యధికమంది ట్విట్టర్ ఫాలోవర్స్(4.34 కోట్లు) ఉన్న మూడో వ్యక్తిగా మోదీకి రికార్డుంది. ప్రస్తుతం 4.44 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

నేను ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టో కరెన్సీ గురించి ఎలా ఆలోచిస్తారో తెలుసుకున్నాను. ట్విట్టర్ గురించి మాట్లాడాం. ట్విట్టర్ ఎలా వాడతారో తెలుసుకున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు చేసిన ట్వీట్‌ని ప్రస్తావించారు. మనుషులంతా ఒకేలా ఎలా ఆలోచిస్తారో వివరించారు. ఆ చర్చ అద్భుతం.
సీఎన్‌బీసీ టీవీ18 ఇంటర్వ్యూలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ


ప్రధానితో సమావేశం పట్ల సంతోషంగా ఉన్నానని, తర్వాత డోర్సీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కోసం సలహాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ట్వీట్‌కు మోదీ బదులిస్తూ... ట్విట్టర్‌ను ప్యాషన్‌ను నడిపిస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, ఎంతో మంది గొప్ప స్నేహితులు అయ్యారని, ప్రజల సృజనాత్మకతను కూడా చూస్తున్నానని బదులిచ్చారు.

First published: November 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>