హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

FakeCatcher: ఫేక్‌ వీడియోలను క్షణాల్లోనే గుర్తించే ఫేక్‌ క్యాచర్‌.. ఇంటెల్ కొత్త టెక్నాలజీ..

FakeCatcher: ఫేక్‌ వీడియోలను క్షణాల్లోనే గుర్తించే ఫేక్‌ క్యాచర్‌.. ఇంటెల్ కొత్త టెక్నాలజీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫేక్‌ కంటెంట్‌ వ్యాప్తికి ఇంటెల్‌ కంపెనీ ఓ పరిష్కారం చూపింది. క్షణాల్లో వీడియో అసలైనదేనా.. ఫేక్‌ వీడియోనా అనేది తేల్చేసే లేటెస్ట్‌ టెక్నాలజీ ‘ఫేక్ క్యాచర్‌’ను (FakeCatcher) డెవలప్‌ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

FakeCatcher: ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఫేక్‌ కంటెంట్ కూడా ఒకటి. సోషల్‌ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ ఫేక్‌ కంటెంట్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. కొందరు నేరగాళ్లు సోషల్‌ మీడియా అకౌంట్‌ల నుంచి యూజర్స్‌ ఫొటోలు, వీడియోలు తీసుకొని మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి కొందరు అసత్యాలను ప్రచారం చేయడానికి ఫేక్‌ వీడియోలు రూపొందిస్తున్నారు. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా ఫేక్‌ కంటెంట్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఏంటో తెలియజేయాలని సోషల్‌ మీడియా కంపెనీలు, ప్రభుత్వాలను కోరాయి. ఇంతగా సమస్యలు సృష్టిస్తున్న ఫేక్‌ కంటెంట్‌(Fake content) వ్యాప్తికి ఇంటెల్‌ కంపెనీ ఓ పరిష్కారం చూపింది. క్షణాల్లో వీడియో అసలైనదేనా.. ఫేక్‌ వీడియోనా అనేది తేల్చేసే లేటెస్ట్‌ టెక్నాలజీ ‘ఫేక్ క్యాచర్‌’ను (FakeCatcher) డెవలప్‌ చేసింది.

 96 శాతం అక్యురసీ

ఇంటెల్ కంపెనీ 96 శాతం కచ్చితత్వ రేటుతో కంటెంట్‌ అథెంటిసిటీని గుర్తించగల కొత్త డీప్‌ఫేక్ డిటెక్షన్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచంలోని మొట్టమొదటి రియల్ టైమ్‌- డీప్‌ఫేక్ డిటెక్టర్. ఇంటెల్‌ డెవలప్‌ చేసిన FakeCatcher మిల్లీసెకన్లలోనే ఫలితాలను అందిస్తుంది.

 డీప్‌ఫేక్స్ అంటే ఏంటి?

డీప్ లెర్నింగ్, ఫేక్ అనే పదాల కలయిక నుంచి డీప్‌ఫేక్‌ అనే పదం వచ్చింది. ఇది విజులవ్‌ మీడియాకు సంబంధించింది. ఏదైనా ఇమేజ్‌ లేదా వీడియోలోని వ్యక్తిని మరో వ్యక్తితో రీప్లేస్‌ చేయడాన్ని డీప్‌ఫేక్‌ అంటారు. నేరగాళ్లు మోసపూరిత కంటెంట్‌ను క్రియేట్‌ చేయడానికి మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో పోర్నోగ్రాఫిక్‌ మెటీరియల్, ఫేక్ న్యూస్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ వంటివి పెరగడంతో డీప్‌ఫేక్స్‌పైకి అందరి దృష్టి మరలింది.

Amazon Alexa: స్మార్ట్‌ఫోన్లలో ఇక ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.. మార్చి 31 డెడ్‌లైన్!

ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది?

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో FakeCatcher ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటెల్ పత్రికా ప్రకటన తెలిపినట్లు.. హానికరమైన డీప్‌ఫేక్ వీడియోలను అప్‌లోడ్ చేయకుండా వినియోగదారులను నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఫేక్‌ కంటెంట్‌ను నియంత్రించే అవకాశం కలుగుతుంది. గ్లోబల్ న్యూస్ ఆర్గనైజేషన్లు కూడా ఉపయోగించవచ్చు. మానిప్యులేట్ చేసిన వీడియోలను సులువుగా గుర్తించవచ్చు.

FakeCatcher ఎలా పని చేస్తుంది?

ఈ లేటెస్ట్‌ టెక్నాలజీకి సంబంధించిన వివరాలను ఇంటెల్‌ కంపెనీ ఈ నెల ప్రారంభంలో ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఇంటెల్ టెక్నాలజీ వీడియో పిక్సెల్‌లలోని సూక్ష్మ 'బ్లడ్‌ ఫ్లో' అంచనా వేయడం ద్వారా రియల్‌ వీడియోలలో అథెంటిక్‌ క్లూస్‌ కోసం చూస్తుంది. మానవుల హృదయాలు బ్లడ్‌ పంప్ చేసినప్పుడు, శరీరంలోని సిరలు రంగు మారుతాయి. ఈ బ్లడ్‌ ఫ్లో సిగ్నల్స్‌ను ముఖం నలుమూలల నుంచి ఇంటెల్‌ టెక్నాలజీ సేకరిస్తుంది. అదే విధంగా అల్గారిథమ్‌లు ఈ సిగ్నల్స్‌ను స్పాటియోటెంపోరల్ మ్యాప్‌(Spatiotemporal Maps)లుగా ట్రాన్స్‌లేట్‌ చేస్తాయి. ఆ తర్వాత డీప్‌ లెర్నింగ్‌ ఉపయోగించి.. సంబంధిత వీడియో నిజమైనదా లేదా ఫేక్‌దా అని వెంటనే గుర్తించవచ్చు.

First published:

Tags: Technology

ఉత్తమ కథలు