New RT-PCR Kit: కరోనా నిర్ధారణకు కొత్త RT-PCR కిట్.. 100 శాతం కచ్చితమైన ఫలితం..

ప్రతీకాత్మక చిత్రం

New RT-PCR Kit: ప్రస్తుతం దేశంలో సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న దృష్ట్యా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిన ఆర్​టీపీసీఆర్​ కిట్​ ఎంతో ఆశాజనకంగా మారింది.

  • Share this:
కరోనా నిర్ధారణకు ప్రస్తుతం ఆర్​టీపీసీఆర్​, యాంటీజెన్​ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే వీటి ద్వారా కేవలం 80 శాతం మాత్రమే ఫలితం వస్తున్నందున కొత్త RT-PCR కిట్​ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఈ కొత్త కిట్​ద్వారా 100 శాతం కచ్చితమైన ఫలితాన్ని రాబట్టవచ్చు. అంతేకాక దీని సాయంతో అన్ని రకాల వైరస్​ వేరియంట్లను నిర్ధారణ చేయవచ్చు. చాలా తక్కువ సమయంలోనే టెస్ట్​ రిజల్ట్​ కూడా పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న దృష్ట్యా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిన ఆర్​టీపీసీఆర్​ కిట్​ ఎంతో ఆశాజనకంగా మారింది. ఈ సరికొత్త RT-PCR కిట్​ను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అభివృద్ధి చేసింది. ఇది వివిధ వైరస్ మ్యూటెంట్లను సులువుగా గుర్తిస్తుంది.

ఈ నూతన కిట్​పై సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. “కొత్తగా అభివృద్ధి చేసిన మల్టీప్లెక్స్ RT-PCR కిట్ ప్రపంచంలోని అన్ని వైరస్​ వేరియంట్లను గుర్తించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 100 శాతం కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. మహమ్మారి మ్యూటేషన్​ చెందుతూ మూడో వేవ్​ దిశగా వెళ్తున్నందున.. దీని నిర్ధారణకు తాజా మల్టీప్లెక్స్ RT-PCR కిట్​ ఎంతో ఉపయోగపడుతుంది” అని పేర్కొంది. కరోనావైరస్​లు ఇతర RNA వైరస్​ల కంటే చాలా తక్కువగా జన్యుమార్పిడిలకు లోనవుతున్నప్పటికీ, S, R, N జన్యువులలోని మ్యుటేషన్లు తరచుగా RT-PCR పరీక్ష ఫలితంపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో వైరస్​ మ్యుటేషన్​ చెందినప్పుడు దాన్ని నిర్ధారించడంలో విఫలమవుతున్నాయి. దీనికి చెక్​ పెట్టేందుకే ఈ కొత్త ఆర్టీపీసీఆర్​ కిట్​ను రూపొందించారు. ఈ కిట్​ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కి చెందిన పుణెలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) ధ్రువీకరించింది. కోవిడ్–19 డిటెక్షన్‌లో దీనికి 100% ప్రత్యేకత ఉందని తెలిపింది. అన్ని రకాల అనుమతులు రాగానే దీన్ని వైరస్​ నిర్ధారణకు వినియోగించనున్నారు.

కొత్త RT-PCR కిట్ ఎలా పని చేస్తుంది?
సైన్స్ అండ్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST) ఈ కొత్త మల్టీప్లెక్స్ RT-PCR కిట్​ను​ అభివృద్ధి చేసింది. ఈ కిట్ SARS-CoV-2 జన్యువులను లక్ష్యంగా చేసుకొని రూపొందించారు. ఇది RdRp, ORFb-nsp14, హ్యూమన్​ RNAse P జన్యువుల మార్పిడిని, కొత్త మ్యుటేషన్లను గుర్తించడంలో సహాయపడుతుంది.
First published: