Windows 11: అన్ స‌పోర్టెడ్ CPUలోనూ విండోస్ 11 వాడొచ్చు.. తెలుసుకోండి

మైక్రోసాఫ్ట్ విండోస్ 11 (ప్రతీకాత్మక చిత్రం)

మైక్రోసాఫ్ట్ ఈ కొత్తగా విండోస్‌11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్​ను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. ఎన్నో సింబల్స్​, థీమ్స్​ను కూడా రీ డిజైన్(design) చేసింది. కానీ కొన్ని ప్రాసెస‌ర్‌ల‌కు మాత్ర‌మే ఈ సాఫ్ట్‌వేర్‌(Software)ను ఉప‌యోగించే అవ‌కాశం ఇచ్చింది. దీంతో వినియోగ‌దారులు కాస్త నిరాశ చెందారు. కానీ విండోస్‌11 మ‌ద్ద‌తు లేని CPU లతో PC లలో కూడా ISO ఉపయోగించి విండోస్ 11ను ఇన్‌స్టాల్(install) చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

  • Share this:
    మైక్రోసాఫ్ట్ ఈ కొత్తగా విండోస్‌11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్​ను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. ఎన్నో సింబల్స్​, థీమ్స్​ను కూడా రీ డిజైన్ చేసింది. విండోస్ 11 ఇప్పుడు ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. విండోస్‌ 11 ఇన్​స్టాల్​ చేసుకోవడం ద్వారా మీ సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. తద్వారా వెబ్ బ్రౌజింగ్​, యాప్స్​లోడ్​కు ఎక్కువ సమయం తీసుకోదు. దీనికి అనుగుణంగా విండోస్​ 11 ఓఎస్​లో అనేక ఆప్టిమైజేషన్లను చేర్చింది. కొత్త విండోస్ మునుపటి వెర్షన్ల(versions) కంటే ఎక్కువ ఎఫీషియన్సీ కలిగి ఉంటుంది. ఇది మీ డేటాకు మరింత భద్రతనిస్తుంది. విండోస్​ 11లో కొత్తగా స్నాప్ లేఅవుట్‌ అనే ఫీచర్లను కూడా తీసుకొచ్చింది. ఇది మల్టిపుల్ సిస్టమ్స్​లో పనిచేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

    YouTube Videos: ప‌ది ల‌క్ష‌ల కోవిడ్ స‌మాచార వీడియోలను తొల‌గించిన యూట్యూబ్‌.. కార‌ణం తెలుసా


    కానీ కొన్ని ప్రాసెస‌ర్‌ల‌కు మాత్ర‌మే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించే అవ‌కాశం ఇచ్చింది. దీంతో వినియోగ‌దారులు కాస్త నిరాశ చెందారు. కానీ విండోస్‌11 మ‌ద్ద‌తు లేని CPU లతో PC లలో కూడా ISO ఉపయోగించి విండోస్ 11ను ఇన్‌స్టాల్(instal) చేసుకోవచ్చు.
    ది వెర్జ్ అందించిన రిపోర్టు ప్ర‌కారం మెక్రోసాఫ్ట్(Microsoft) విండోస్ 11 పాత కంప్యూట‌ర్‌ల‌లో వినియోగించ లేం. కానీ మీరు విండోస్ 11 వాడాల‌నుకుంటే మీ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ( Operating system)​ కోసం ISO ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకొంటే విండోస్‌11ను వినియోగించ వ‌చ్చు. మీ కంప్యూట‌ర్ క‌నీసం డ్యూయ‌ల్ కోర్(Dual Core) 1GHz 64-బిట్ CPU, 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఉంటే చాలు. మీరు విండోస్ 11ను పొంద‌వ‌చ్చు.
    మెక్రోసాఫ్ట్ చెబుతున్న ప్ర‌కారం విండోస్ 11 నిర్వ‌హ‌ణ‌కు ఎక్కువ ప్రాసెస‌ర్‌లు అవ‌స‌రం పాత వాటిలో ఆ సౌల‌భ్యం ఉండ‌దు. స‌రైన ప్రాసెస‌ర్(Processor) లేకుంటే విండోస్‌ను వినియోగించ లేరు అందుకే పాత వాటికి ఈ అవ‌కాశం క‌ల్పించ లేదంటుంది.

    Cyber Crime: జాగ్ర‌త్త‌.. ఈ వెబ్‌సైట్‌ల‌లో షాపింగ్ చేస్తే మీ ఖాతా ఖాళీ




    ఆ మాట‌లో వాస్త‌వం ఉన్నా.. చాలా మంది పాత ప్రాసెస‌ర్ వినియోగ‌దారులే ఉన్నారు. వారికి విండోస్ 11 వాడాలంటే ISO డౌన్‌లోడ్ ఒక్క‌టే మార్గంగా క‌న‌బ‌డుతుంది. ISO ఫైల్ డౌన్‌లోడ్(Download) చేసి మాన్యువ‌ల్‌గా అప్‌డేట్ చేస్తూ ఇన్‌స్టాల్ చేయ‌డం కాస్త క‌ష్టంగానే ఉంటుంది. కానీ ఒక్క‌సారి మీరు విండోస్ 11లోకి వ‌చ్చాకా అంద‌రిలాగా తాజా అప్‌డేట్‌ల‌ను పొందుతారు.
    పాత కంప్యూట‌ర్(Computer) ప్రాసెస‌ర్‌లు ఉన్న‌వారు ISO ఫైల్ ద్వారానే విండోస్ 11 నుపొంద‌గ‌ల‌రు. కానీ ISO ఫైల్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో స్ప‌ష్ట‌త(clarity) లేదు. బ‌హుశా అక్టోబ‌ర్ మ‌ధ్య వారంంలో దీనికి సంబంధించిన స‌మాచారం అందుబాటులో ఉండ‌వ‌చ్చు.
    Published by:Sharath Chandra
    First published: