హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: ప్రొఫెషనల్‌ అకౌంట్స్‌కు అకౌంట్‌ స్టేటస్‌ ఫీచర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌పై ఓ లుక్కేయండి..

Instagram: ప్రొఫెషనల్‌ అకౌంట్స్‌కు అకౌంట్‌ స్టేటస్‌ ఫీచర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌పై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెటా యాజమాన్యంలోని మీడియా షేరింగ్‌ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌లకు మరో కొత్త ఫీచర్‌ అందజేసింది. తమ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు, కంటెంట్‌ను మెరుగైన రీచ్‌ పొందేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

మెటా యాజమాన్యంలోని మీడియా షేరింగ్‌ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌లకు మరో కొత్త ఫీచర్‌ అందజేసింది. తమ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు, కంటెంట్‌ను మెరుగైన రీచ్‌ పొందేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రొఫెషనల్‌ అకౌంట్స్‌కు అకౌంట్‌ స్టేటస్‌ ఫీచర్‌ని ఎక్స్‌ప్యాండ్‌ చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో.. క్రియేటర్స్‌కు గైడ్‌లైన్స్‌ తెలుసుకోవడం అవసరమని, క్రియేటర్స్‌ పోస్ట్ చేసిన ఏదైనా తమను ఫాలో కాని వారికి రీచ్‌ అవుతుందా? లేదా? తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొంది.

అకౌంట్ స్టేటస్‌పై పూర్తి అవగాహన

ఇన్‌స్టాగ్రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. అకౌంట్‌ స్టేటస్‌ ఫీచర్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌లకు వన్‌ స్టాప్ షాప్ అని పేర్కొంది. దీని ద్వారా యూజర్‌లు తమ అకౌంట్‌లో, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని చెప్పింది. అంతేకాకుండా వినియోగదారులు తమ అకౌంట్‌ డిసేబుల్ అయ్యే ప్రమాదం ఉంటే.. ముందుగా ఆ పరిస్థితులను అంచనా వేయడం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. ఈ అప్‌డేట్‌లతో, యూజర్‌లకు వారి అకౌంట్‌ సమస్యలను అర్థమయ్యేలా చేస్తామని, కంపెనీ సిస్టమ్‌లు, నియమాలు ఎలా పని చేస్తాయో? పూర్తిగా వివరిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌ చెప్పింది.

ఆసక్తికరంగా వినియోగదారులు తమ కంటెంట్‌ని సిఫార్సు చేయవచ్చా? లేదా? అనే అంశాన్ని అకౌంట్‌ స్టేటస్‌ ఫీచర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా వారి కంటెంట్‌ రీల్స్, ఫీడ్‌లో కనిపించేలా సిఫార్సు చేయడానికి ఎలిజిబుల్‌ అవుతుందా? కాదా? అనే విషయాన్ని కూడా అకౌంట్‌ స్టేటస్‌ తెలియజేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ తరఫున పొరపాటు చేశామని వినియోగదారులు భావిస్తే, ఇన్‌స్టాగ్రామ్‌ రివ్యూ టీమ్‌ని సంప్రదించవచ్చని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ స్టేటస్‌ చెక్‌ చేయడం ఎలా?

మొదట ప్రొఫైల్‌ ఓపెన్ చేయడానికి దిగువ కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా ప్రొఫైల్ పిక్చర్‌ని క్లిక్‌ చేయాలి. అనంతరం ఎగువ కుడివైపున సెట్టింగ్స్‌ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి. ఆ తర్వాత అకౌంట్‌, అకౌంట్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి.

అందుబాటులోకి కంటెంట్‌ షెడ్యూలింగ్‌ టూల్స్‌

ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల కొన్ని కొత్త ఫీచర్లను యాడ్‌ చేసింది. యాప్ ఇప్పుడు రీల్స్ కోసం ఆర్టిస్టులకు రివార్డ్ చేయడానికి కంటెంట్ షెడ్యూలింగ్ టూల్స్‌, అచీవ్‌మెంట్స్‌ ఫీచర్‌ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. తాజా నివేదికల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రొఫెషనల్ అకౌంట్స్‌ ఇప్పుడు షెడ్యూలింగ్ టూల్స్‌ ఉపయోగించి 75 రోజుల వరకు రీల్స్, ఫోటోలు, కేరోసెల్‌ పోస్ట్‌లను షెడ్యూల్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు అడ్వాన్స్‌డ్‌ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌ కనిపిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ‘అచీవ్‌మెంట్స్’ ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్ రీల్స్‌ ప్రొడ్యూస్‌ చేసిన వారికి నిర్దిష్ట చర్యలకు సంబంధించిన అచీవ్‌మెంట్స్‌ పొందేందుకు వీలు కల్పిస్తుంది.

First published:

Tags: Instagram

ఉత్తమ కథలు