Home /News /technology /

INSTAGRAM WILL SOON ALLOW YOU TO PUT MUSIC ON VIDEOS PHOTOS ON YOUR FEED HERE FULL DETAILS NS GH

Instagram: ఇన్‌స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్.. ఫీడ్ పోస్ట్​లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్​స్టాగ్రామ్​ ఇప్పుడు మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు మరో కొత్త ఫీచర్​పై పనిచేస్తుంది. యాప్​ స్టోరీస్, రీల్స్‌లో మ్యూజిక్​ను ఎలాగైతే యాడ్​ చేయవచ్చో.. అదేవిధంగా ఫీడ్ పోస్ట్‌లకు సైతం మ్యూజిక్​ జోడించే ఫీచర్​ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్​ దశలోనే ఉంది.

ఇంకా చదవండి ...
మెటా-Meta (గతంలో Facebook) యాజమాన్యంలోని సోషల్​ మీడియా(Social Media) ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్​(Instagram)కు ఉన్ప పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే నంబర్​ 1 సోషల్​ మీడియా యాప్​గా కొనసాగుతోంది. యువత అభిరుచులకు తగ్గట్లు కొత్త కొత్త ఫీచర్లు పరిచయం చేస్తుండటమే ఇంతటి పాపులారిటీ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇన్​స్టాగ్రామ్​ ఇప్పుడు మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు మరో కొత్త ఫీచర్​పై పనిచేస్తుంది. యాప్​ స్టోరీస్, రీల్స్‌లో మ్యూజిక్​ను ఎలాగైతే యాడ్​ చేయవచ్చో.. అదేవిధంగా ఫీడ్ పోస్ట్‌లకు సైతం మ్యూజిక్​ జోడించే ఫీచర్​ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్​ దశలోనే ఉంది. వినియోగదారులు తమ ఫీడ్‌లో పోస్ట్​ చేయబోయే ఫోటో లేదా వీడియోకు ఒక పాటను జోడించేందుకు ఈ ఫీచర్​ అనుమతిస్తుంది.

అయితే.. యూజర్లందరికీ ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. కానీ, ఈ ఫీచర్‌ను మొదట పరిచయం చేయనున్న దేశాల్లో భారత్ కూడా ఉండటం గమనార్హం. అంటే, త్వరలోనే భారతీయ యూజర్లకు ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుందని స్పష్టమవుతోంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్​లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇకపై ఖాతా తెరవాలంటే ఏం చేయాలో తెలుసా?

త్వరలోనే భారతీయ యూజర్లకు అందుబాటులోకి..
కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ క్రియేట్ చేసే సమయంలో మ్యూజిక్​ను జోడించవచ్చు. ఏదైనా ఫోటో లేదా వీడియో సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్​పై క్లిక్​ చేస్తే వెంటనే ఆడియో పేజీ ఓపెన్​ అవుతుంది. అక్కడ నుండి మీకు నచ్చిన పాటను జోడించి షేర్​ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్​ విడుదల చేసిన ప్రెస్ నోట్‌ ప్రకారం, ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ కమ్యూనిటీలో కొద్ది మొదటి కొన్ని దేశాలకే పరిమితం అవువుతుంది. ప్రారంభంలో భారతదేశం, బ్రెజిల్, టర్కీలోని కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్​పై ఆయా దేశాల్లో ఫీడ్​బ్యాక్​ తీసుకుంటారు.
Instagram Tips: ఇన్‌స్టా స్టోరీస్‌లో లింక్ షేర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇతర దేశాల్లో సైతం అందుబాటులోకి తెస్తారు. కాగా, ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త పోస్ట్‌ను క్రియేట్​ చేసే క్రమంలో “యాడ్ మ్యూజిక్” ఆప్షన్​ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ ఇంటర్‌ఫేస్ ఓపెన్​ అవుతుంది. మ్యూజిక్​ ఆల్బన్​ నుంచి తమకు ఇష్టమైన పాటను ఎంచుకోవచ్చు. ఫోటో లేదా వీడియోకు సరిపోయేలా ట్రెండింగ్‌ పాటను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా పాట వ్యవధి, నిడివిని కత్తిరించుకోవచ్చు. వెంటనే ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Facebook, Instagram, Meta

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు