Home /News /technology /

INSTAGRAM WILL NOW LET YOU BUY FROM SMALL BUSINESSES DIRECTLY FROM DMS UMG GH

Instagram: ఇక ఇన్‌స్టాగ్రామ్‌‌లోనే డైరెక్ట్ బిజినెస్ ఫీచర్.. ఒక్క మెసెజ్‌తో కావాల్సింది కొనుక్కోవచ్చు.. ఎలాగంటే..?

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో న్యూ ఫీచర్

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో న్యూ ఫీచర్

మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా నేరుగా ఇన్‌స్టా డైరెక్ట్ మెసేజెస్‌ నుంచి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. బిజినెస్ యూనిట్ల నుంచి కొనుగోళ్లకు ఈ ఫీచర్ అవకాశం కల్పిస్తోంది.

ఇంకా చదవండి ...
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా నేరుగా ఇన్‌స్టా డైరెక్ట్ మెసేజెస్‌ నుంచి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. బిజినెస్ యూనిట్ల నుంచి కొనుగోళ్లకు ఈ ఫీచర్ అవకాశం కల్పిస్తోంది. కొత్త పేమెంట్‌ ఫీచర్ సహాయంతో వినియోగదారులు నేరుగా స్మాల్‌ బిజినెస్‌ నిర్వహించే వారి నుంచి వివిధ రకాల ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి అవకాశం కలుగుతుందని మెటా కంపెనీ తాజాగా ప్రకటించింది.

* కొనుగోళ్లు, పేమెంట్స్‌ ఇక సులువు
కంపెనీ షేర్ చేసిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొనుగోళ్లు చేయడానికి వినియోగదారులు యాప్‌ను లేదా చాట్‌ను కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వినియోగదారులు యాప్‌లో ఏదైనా ప్రొడక్ట్ గురించి తెలుసుకొని, దాన్ని కొనాలంటే.. ప్రొడక్ట్‌ గురించి విచారించడానికి బిజినెస్‌ చేస్తున్న వారికి మెసేజ్‌ పంపాలి. అనంతరం కొనుగోలు చేయడానికి వారు అందించిన లింక్‌పై క్లిక్‌ చేయాలి. అయితే కొత్త ఫీచర్‌తో వినియోగదారులు కస్టమైజేషన్‌ల గురించి నేరుగా చాట్ చేయగలరు, అక్కడి నుంచే ఆర్డర్ ఇవ్వగలరు. ఇదంతా మెసేజ్ చేసిన టైమ్‌లోనే జరుగుతుంది. అదే చాట్ థ్రెడ్‌లో ఆర్డర్‌ను ట్రాక్ చేయడం, బిజినెస్ ఓనర్స్‌ను ఫాలో అప్ ప్రశ్నలు అడగడం కూడా సులభం అవుతుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు మెటా పేని ఉపయోగించి పేమెంట్‌ చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది.

ఇదీ చదవండి: ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం.. ఏకంగా హ్యాకర్లను దించుతోంది! చదివితే ఆశ్చర్యపోతారు..


* వరుసగా అప్‌డేట్స్‌
క్రియేటర్స్‌ కోసం ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తున్న కొత్త అప్‌డేట్స్ పూర్తయ్యాక ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్రియేటర్‌లు ప్రస్తుతం సబ్‌స్క్రైబర్‌లతో కనెక్ట్ అవ్వడానికి, వారికి ఆసక్తి ఉన్న విషయాలను చర్చించడానికి, లేదా సబ్‌స్క్రైబర్‌లను ఒకచోట చేర్చడానికి గరిష్టంగా 30 మంది వ్యక్తులతో సబ్‌స్క్రైబర్‌ చాట్‌లను క్రియేట్‌ చేయవచ్చు. మెసెంజర్ బేస్డ్‌ సబ్‌స్క్రయిబర్ చాట్‌లు ఇన్‌బాక్స్ లేదా స్టోరీ నుంచి క్రియేట్ అవుతాయి. 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా ఎండ్‌ అవుతాయి, కాబట్టి క్రియేటర్‌లు బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయవచ్చు. సబ్‌స్క్రైబర్‌లతో ఎప్పుడు, ఎలా ఎంగేజ్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. సబ్‌స్క్రైబర్‌లు జాయిన్‌ చాట్‌ స్టిక్కర్‌ నుంచి చాట్‌లలో చేరవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన సబ్‌స్క్రిప్షన్ స్టిక్కర్ తరహాలోనే ఉంటుంది. ఇన్‌బాక్స్‌లోని కొత్త సబ్‌స్క్రైబర్ ట్యాబ్ సబ్‌స్క్రైబర్‌లతో చాట్‌లను సులభంగా నిర్వహించడానికి, క్రియేటర్‌లకు వీలు కల్పిస్తుంది. దీంతో క్రియేటర్స్‌ మెసేజ్‌ ఎప్పుడూ మిస్‌ కారు, అదే విధంగా సులువుగా రెస్పాండ్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.



* సేవల్లో అంతరాయం
గత వారం ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజామున యాప్‌ సేవలు ఆగిపోవడంతో దాదాపు 24,000 మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ప్రభావితమయ్యారు. ఇండియాలో గత శుక్రవారం 1AM, 3AM మధ్య అంతరాయం కలిగినట్లు నివేదికలు తెలిపాయి. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ సేవల్లో కూడా దాదాపు మూడు గంటలపాటు అంతరాయం కలిగింది. దీంతో దాదాపు 50,000 మంది వినియోగదారులు ప్రభావితం అయ్యారు.
Published by:Mahesh
First published:

Tags: Business, Instagram, New features, Tech news

తదుపరి వార్తలు