హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Repost: త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ ఫీచర్ లాంచ్.. దీని ఉపయోగం ఏంటంటే..

Instagram Repost: త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ ఫీచర్ లాంచ్.. దీని ఉపయోగం ఏంటంటే..

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో న్యూ ఫీచర్

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో న్యూ ఫీచర్

Instagram Repost: ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను చాలా తక్కువమంది యూజర్లకు రిలీజ్ చేసి టెస్టింగ్ చేస్తోంది. కొంతకాలంగా ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోన్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు దీనిని తీసుకొస్తున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తన యూజర్ల కోసం తరచుగా అదిరిపోయే ఫీచర్ల (Features)ను పరిచయం చేస్తోంది. వేరే సోషల్ మీడియా సైట్స్‌లో అందించిన చక్కటి ఫీచర్లను కూడా ఈ ప్లాట్‌ఫామ్ యాడ్ చేస్తోంది. ఇందులో భాగంగా ట్విట్టర్‌ (Twitter)లో అందించిన రీట్వీట్ లాంటి రీ-పోస్ట్ (Repost) ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ పరిచయం చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇతరుల పోస్ట్స్, రీల్స్ తమ ప్రొఫైల్స్‌, ఫీడ్స్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను చాలా తక్కువమంది యూజర్లకు రిలీజ్ చేసి టెస్టింగ్ చేస్తోంది. కొంతకాలంగా ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోన్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు దీనిని తీసుకొస్తున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేసింది. దీంతో త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల పోస్టులను షేర్ చేయడం ఎప్పటి నుంచో కుదురుతోంది. కానీ ఏదైనా పోస్ట్‌ను మళ్లీ షేర్ చేయాలనుకుంటే అది ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా మాత్రమే షేర్ చేయాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. స్టోరీస్ ద్వారా షేర్ చేస్తే అది 24 గంటల్లో అదృశ్యమవుతుంది.

దీనివల్ల ఫాలోవర్లందరూ షేర్ చేసిన కంటెంట్ చూడలేకపోవచ్చు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న రీపోస్ట్ ఫీచర్‌తో ప్రొఫైల్‌కు నచ్చిన పోస్టు లేదా రీల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. తద్వారా వాటిని ఫాలోవర్లందరూ ఎల్లప్పుడూ కనిపించే లాగా చేయొచ్చు. యూజర్లు రీపోస్ట్ చేసే పోస్టులు, రీల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ పేజీలో రీపోస్ట్ అనే ఒక సపరేట్ ట్యాబ్‌లో కనిపిస్తాయి.

ఒక టిప్‌స్టర్ ఇప్పటికే ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో ట్విట్టర్ వేదికగా వివరించారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ప్రొఫైల్ సెక్షన్‌లో ట్యాగ్ ఆప్షన్ పక్కనే రీపోస్ట్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని స్క్రీన్‌షాట్‌తో సహా ఆ టిప్‌స్టర్ వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కూడా రీపోస్ట్ అనేది తమ ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా వస్తున్న ఫీచర్ అని ధ్రువీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ రీపోస్ట్ బటన్ అన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, రీల్స్‌కి సంబంధించిన షేర్ మెనూలో ఉంటుంది. ఆ మెనూ ద్వారా మీకు బాగా నచ్చే పోస్ట్‌ని లేదా రీల్‌ను మీ ఫాలోవర్స్‌కి పోస్ట్‌గా లేదా రీల్‌గా కూడా షేర్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి :  సాంసంగ్ నుంచి కొత్త మౌస్... మీరు ఎక్కువసేపు పనిచేస్తే పారిపోతుంది

డెవలపర్లు ఈ ఫీచర్ విజయవంతంగా టెస్ట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ , iOS ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోని మొబైల్ యూజర్లకు రిలీజ్ చేస్తారు. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కొత్త రీపోస్ట్ ఫీచర్‌ను ఉపయోగించి ఫొటో, వీడియో, రీల్స్, ఇతర అన్ని పోస్టులను తమ ఫీడ్స్‌లో షేర్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజర్లు తమ ఇష్టాయిష్టాలను ఫాలోవర్లకు ఈజీగా తెలియజేయవచ్చు.

ప్రొఫైల్‌లో పోస్ట్‌ను షేర్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్‌ని ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు. అలానే ఈ ఫీచర్‌తో ఒరిజినల్ క్రియేటర్స్‌కు కూడా క్రెడిట్ ఇవ్వడం, రీచ్ పెంచడం సాధ్యమవుతుందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. పోస్టులను రీపోస్ట్ చేస్తున్నప్పుడు దానిపై కామెంట్ లేదా క్యాప్షన్ యాడ్ చేసే సదుపాయం కూడా ఇన్‌స్టాగ్రామ్ అందించవచ్చని సమాచారం.

Published by:Sridhar Reddy
First published:

Tags: Instagram, New feature, Tech news

ఉత్తమ కథలు