హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అలర్ట్.. ఆ ఫీచర్‌లో కొత్త మార్పులు చేసిన సంస్థ..!

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అలర్ట్.. ఆ ఫీచర్‌లో కొత్త మార్పులు చేసిన సంస్థ..!

ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను యూజర్లు వినియోగిస్తుంటే అలర్ట్‌ చేసే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ గతంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ మినిమం టైమ్ లిమిట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తాజాగా పొడిగించింది.

ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను యూజర్లు వినియోగిస్తుంటే అలర్ట్‌ చేసే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ గతంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ మినిమం టైమ్ లిమిట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తాజాగా పొడిగించింది.

ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను యూజర్లు వినియోగిస్తుంటే అలర్ట్‌ చేసే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ గతంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ మినిమం టైమ్ లిమిట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తాజాగా పొడిగించింది.

  సోషల్‌ మీడియాలో(Social Media) యూజర్లు ఎక్కువ సమయం గడిపాలని ఆయా సంస్థలు భావిస్తాయి. ఇదే తరహా చర్యలను ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) చేపడుతోంది. ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను యూజర్లు వినియోగిస్తుంటే అలర్ట్‌ చేసే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ గతంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లో ఎంతసేపటికి రిమైండర్‌ ఇవ్వాలనే సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆప్షన్‌లో ఎంపిక చేసిన టైమ్‌ను దాటి యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను(App) వినియోగిస్తుంటే అలర్ట్‌ చేస్తూ నోటిఫికేషన్‌(Notification) వస్తుంది. ఇంతే సమయం సోషల్‌మీడియాకు కేటాయించాలనే నిబంధన విధించుకొన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్ మినిమం టైమ్ లిమిట్‌ను(Time Limit) ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తాజాగా పొడిగించింది.

  ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో కనీసం పది నిమిషాలకు, 15 నిమిషాలకు రిమైండర్‌ సెట్‌ చేసుకొనే అవకాశం ఉండేది. తాజాగా ఆ కనీస సమయాన్నిరోజులో 30 నిమిషాలకు పెంచుతూ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌. కనీసం అరగంటకు కానీ ఎక్కువ సమయం యాప్‌ను వినియోగిస్తున్నారనే నోటిఫికేషన్‌ యూజర్లకు రాదు. యూజర్లు ఎక్కువ సమయం యాప్‌ వినియోగించేలా చేయడానికి ఈ తరహా నిర్ణయాన్ని సంస్థ తీసుకొంది.

  Instagram: ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ‘డైలీ లిమిట్’ ఫీచర్‌లో మార్పులు..


  దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను Mac Rumors అనే సంస్థ వెల్లడించింది. కొత్తగా వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ అప్‌డేట్‌లో యాప్‌లో ‘Set daily time limit’ మెనూ కనిపిస్తుంది. అందులో యూజర్‌ రోజులో యాప్‌ను వినియోగించాలనుకొంటున్న కనీస సమయాన్ని సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కనీస సమయం 30 నిమిషాలుగా ఉంటుంది. మ్యాగ్జిమం టైమ్ లిమిట్ రిమైండర్ 3 గంటలుగా ఉంటుంది.

  డైలీ టైమ్‌ లిమిట్‌ను సెట్‌ చేసుకొనే సదుపాయాన్ని 2018లో ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో వెచ్చిస్తున్న సమయాన్ని తగ్గించాలను కొనే వారిని అప్రమత్తం చేసేలా సెట్‌ చేసుకొన్న టైమ్‌ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ నోటిఫికేషన్లు ఇస్తుంది. అప్పుడు కనీస సమయాన్ని రోజుకు 5 నుంచి 10 నిమిషాల వరకు సెట్‌ చేసుకొనే అవకాశం ఉండేది. అంత తక్కువ సమయానికి రిమైండర్‌ సెట్‌ చేసుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. యాప్‌లో అప్పటికే సెట్‌ చేసి ఉన్న టైమ్‌ లిమిట్‌ను కావాలనుకొంటే కొనసాగించవచ్చని చూపించినా, 10 నిమిషాల టైమ్‌ను సెలక్ట్‌ చేసినప్పుడు, అందుబాటులో లేదని సూచిస్తుంది.

  Senior Citizens: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త స్కీమ్స్.. వాటిపై వివిధ బ్యాంకుల్లో లభించే వడ్డీ రేట్లను పరిశీలించండి..


  ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను అప్టేట్‌ చేసుకొంటే కొత్త లిమిట్స్‌ 30 నిమిషాల నుంచి ప్రారంభమై, 45 నిమిషాలు, గంట, 2 గంటలు, 3 గంటల వరకు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఎక్కువ సమయం వినియోగిస్తుంటే కొంత వ్యవధి ఇస్తూ వరుసగా రిమైండర్లు వచ్చే ‘Take a Break’ ఫీచర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది. ఈ ఆప్షన్‌ను ఎంచుకొంటే యాప్‌ను ఎక్కువ సమయం వినియోగిస్తుంటే కొంత వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు వస్తుంటాయి.

  First published:

  Tags: Instagram, Social Media, Users

  ఉత్తమ కథలు