Home /News /technology /

INSTAGRAM UPDATE OPENING A NEW INSTAGRAM ACCOUNT WILL REQUIRE SELFIE VIDEO ID VERIFICATION HERE DETAILS NS GH

Instagram: ఇన్‌స్టాగ్రామ్​లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇకపై ఖాతా తెరవాలంటే ఏం చేయాలో తెలుసా?

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​గా ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రాణిస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్​ చేసుకుంటూ సరికొత్త ఫీచర్లను (Features) తీసుకొస్తుంది.

మెటా-Meta (Facebook) యాజమాన్యంలోని పాపులర్​​ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్‌స్టాగ్రామ్(Instagram) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్​ మీడియా(Social Media) ప్లాట్​ఫామ్​గా రాణిస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్​ చేసుకుంటూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఇన్​స్టాగ్రామ్​కు ఈ రేంజ్​లో ఫాలోయింగ్​ పెరుగుతోంది. అటువంటి పాపులర్​ ఇన్​స్టాగ్రామ్​ తన యూజర్ల డేటా భద్రతే లక్ష్యంగా ఓ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇది ఫీచర్ కంటే​ సెక్యూరిటీ అప్​డేట్​ అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఫేక్​ ఖాతాలు ఓపెన్​ అవుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఇన్​స్టాగ్రామ్​ ఈ సరికొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్​పై యూజర్లలో అవగాహన పెంచేందుకు ఇన్​స్టాగ్రామ్​ గతేడాది నుంచే ప్రయత్నిస్తోంది.

ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ప్రకారం, ఇకపై ఇన్​స్టాగ్రామ్​ కొత్త అకౌంట్​ ఓపెన్​ చేయాలంటే ఆ యూజర్​ తన సెల్ఫీ వీడియో సబ్​మిట్​ చేయాల్సిందే!. ఈ ఫీచర్​ను గతేడాది నుంచే పరీక్షిస్తున్నట్లుగా సమాచారం. కొంత మంది వ్యక్తులు ఇన్​స్టాగ్రామ్​లో ఒకే పేరుతో మల్టిపుల్​ ఖాతాలు సృష్టించి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ గుర్తించింది. దీంతో, ఆయా యూజర్లకు చెక్​ పెట్టేందుకు ఇన్​స్టాగ్రామ్​ ఈ ఫీచర్​పై పనిచేస్తోంది. మల్టిపుల్​ ఖాతాలను క్రియే చేసే వారి ఆట కట్టించేందుకు దీన్ని సిద్ధం చేస్తోంది.
Flipkart Mobiles Bonanza Sale: ఫ్లిప్‌కార్ట్ లో మొబైల్స్ బోనాంజా సేల్.. రూ. 20 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

ఫేక్​ అకౌంట్లను కట్టడి చేసేందుకే..
ఈ కొత్త ఫీచర్‌ను మొదట సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా ధ్రువీకరించారు. నకిలీ ఖాతాలను నివారించేందుకు ఈ ఫీచర్​పై పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇన్​స్టాగ్రామ్​ యూజర్ల నుంచి కేవలం సెల్ఫీ వీడియో మాత్రమే తీసుకుంటుందని, వారి బయోమెట్రిక్ డేటాను సేకరించదని స్పష్టం చేశారు. నవర్నా విడుదల చేసిన స్క్రీన్‌షాట్‌లో “మీరు ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​కి సైన్​ ఇన్​ అయ్యే సమయంలో మీ తలని వేర్వేరు దిశల్లోకి తిప్పే చిన్న వీడియో మాకు అవసరం.
iPhone 13: ఐఫోన్​​ లవర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఐఫోన్​ 13పై ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్

మీరు నిజమైన వ్యక్తి అని నిర్ధారించడంలో ఇది మాకు సహాయపడుతుంది. నకిలీ ఖాతాలను అరికట్టేందుకే ఈ ఫీచర్​ను తీసుకురానున్నాం. ఇక, యూజర్లు తమ డేటా భద్రతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.” అని పేర్కొన్నారు. ఈ కొత్త ఫీచర్ నూతనంగా ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్లను క్రియేట్​ చేసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి గుర్తింపును ధ్రువీకరించాల్సిన అవసరం లేదని ఇన్​స్టాగ్రామ్​ ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Facebook, Instagram, Meta

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు