Home /News /technology /

INSTAGRAM TO STOP USERS POSTING TIKTOK VIDEOS AS REELS FULL DETAILS HERE PRN GH

Instagram Reels: వారికి షాకిస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ఇకపై అలా చేయడం కుదరదు.. కొత్తమార్పులివే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ ఫొటో అండ్ వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లోని రీల్స్ (Reels) ప్లాట్‌ఫామ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా క్రియేటర్లు ఆకట్టుకునే వీడియో క్లిప్‌లను షేర్ చేస్తున్నారు.

ప్రముఖ ఫొటో అండ్ వీడియో షేరింగ్ యాప్ ఇన్‌ స్టాగ్రామ్‌ (Instagram)లోని రీల్స్ (Reels) ప్లాట్‌ ఫామ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్లాట్‌ ఫామ్ వేదికగా క్రియేటర్లు ఆకట్టుకునే వీడియో క్లిప్‌లను షేర్ చేస్తున్నారు. అయితే కొందరు తమ ఒరిజినల్ కంటెంట్ షేర్ చేస్తుండగా... మరికొందరు మాత్రం టిక్‌టాక్ లాంటి ఇతర యాప్స్‌ లోని వీడియోలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. అలా వీడియోలను కాపీ చేసి ఒరిజినల్ క్రియేటర్లకు సమానంగా క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్ ఆడమ్ మోస్సేరి తమ ప్లాట్‌ ఫామ్‌ లో ఒరిజినల్ కంటెంట్‌ కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చే న్యూ ప్లాన్‌ లను తాజాగా ప్రకటించారు. అర్హులైన వారికి మాత్రమే క్రెడిట్ అందించేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తులో యూజర్లు, క్రియేటర్లు ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్స్‌లోని వీడియోలను కాపీ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో షేర్ చేసినా ఎలాంటి క్రెడిట్ దక్కదు. ప్రస్తుతం యూకే, యూఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టిక్‌టాక్ అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో ఆయా దేశాల ప్రజలు ఒరిజినల్ వీడియో కంటెంట్ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలనే కాపీ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు పోస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ వీడియోల్లో 'టిక్‌టాక్' అనే వాటర్‌మార్క్‌ కనిపిస్తుంది.

ఇది చదవండి: యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్‌... వారి నుంచి తప్పించేందుకు కొత్త ఫీచర్.. వివరాలివే..


ఈ వాటర్‌మార్క్‌ టిక్‌టాక్‌కు ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్‌గా పనిచేస్తుంది. దీనితో ప్రత్యర్థి యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌ ఉచితంగా ప్రమోట్ చేసినట్లవుతుంది. ఈ ఛాలెంజ్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవుతుందో ఆడమ్ మోస్సేరి చెప్పలేదు. అయితే స్పెషల్ అల్గారిథమ్‌తో టిక్‌టాక్‌ వాటర్‌మార్క్‌తో ఉన్న వీడియోలు ఎక్కువగా ఇతరులకు కనిపించకుండా చేయవచ్చు.

ఇది చదవండి: శామ్‌సంగ్‌ నుంచి ఇండియాలో రిలీజ్ అయిన సరికొత్త టీవీలు.. వీటి ధర, ఫీచర్లు ఇవే


“వీడియోలను కాపీ చేసి షేర్ చేయడానికి బదులు ఒరిజినల్ వీడియో క్రియేట్ చేస్తే, మీరు ఎక్కువ క్రెడిట్‌ని పొందుతారు. ముఖ్యంగా రీపోస్ట్ చేసిన కంటెంట్‌తో పోల్చితే అసలు కంటెంట్‌ని ఎక్కువగా పుష్ చేయడానికి, అలానే వ్యాల్యూబుల్ గా మార్చడానికి మరింత కృషి చేస్తున్నాం." అని ఆడమ్ మోస్సేరి తెలిపారు. అయితే థర్డ్-పార్టీ ఎడిటింగ్ యాప్‌లతో రూపొందించిన వీడియోల గురించి ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోని టూల్స్‌తో క్రియేట్ చేసిన రీల్స్‌కు వ్యాల్యూ ఇస్తామని మాత్రమే చెప్పారు. కాపీ కంటెంట్ విషయంలో ఫిబ్రవరి 2021లో చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. టిక్‌టాక్ వాటర్‌మార్క్ ఉన్న రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ ప్రమోట్ చేయదని ఆ కంపెనీ అధికార ప్రతినిధి దేవి నరసింహన్ గతంలో వెల్లడించారు.

ఇది చదవండి: త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న ఒప్పో ప్యాడ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!


యూఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్ లాంచ్ చేసిన ట్యాగ్ ఫీచర్ గురించి కూడా మోస్సేరి పంచుకున్నారు. ఈ టూల్ యూజర్లు తమ ఇమేజ్ పోస్ట్‌లపై బ్రాండ్‌ను ట్యాగ్ చేయడమే కాకుండా ప్రొడక్ట్స్ లింక్‌లను కూడా చేయడానికి అనుమతిస్తుంది. ఇది ప్రొడక్ట్స్ విజిబిలిటీని... భవిష్యత్తు సహకారం కోసం బ్రాండ్‌లలో క్రియేటర్ విజిబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది
Published by:Purna Chandra
First published:

Tags: Instagram live, Instagram reel

తదుపరి వార్తలు