Home /News /technology /

INSTAGRAM TO INTRODUCE NEW FEATURE THAT LET YOU REACT TO STORIES WITH VOICE NOTE FULL DETAILS HERE PRN GH

Instagram Update: కొత్త అప్‌డేట్‌ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇకపై స్టోరీస్‌కు రియాక్షన్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ (Instagaram) ఎంత పాపులర్ సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌గా సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సెలబ్రెటీల నుంచి కామన్ యూజర్స్ వరకూ ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగిస్తున్నారు.

ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ (Instagaram) ఎంత పాపులర్ సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌గా సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సెలబ్రెటీల నుంచి కామన్ యూజర్స్ వరకూ ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్‌ను ఎంకరేజ్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌.. స్టోరీస్ కోసం ‘క్విక్ రియాక్షన్స్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు యూజర్లు సరైన రీతిలో రెస్పాండ్ అయ్యేలా క్విక్‌ రియాక్షన్స్ అనే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకురానుంది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు తాము చూసే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు (Instagram Stories) రియాక్షన్స్ పంపొచ్చు. ప్రస్తుతానికి కేవలం లైక్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉన్న స్టోరీస్‌కు ఇప్పుడు అదనపు రియాక్షన్స్ కూడా జోడించొచ్చు.

అచ్చంగా ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ విజువల్ కంటెంట్ క్రియేటర్స్‌కు, ఇన్ ఫ్లుయెన్సర్లకు మంచి అడ్డాగా మారింది. అయితే యూజర్లను స్టోరీలకు మరింత కనెక్ట్ చెసేలా ఇప్పుడీ కొత్త ఫీచర్‌పై పనిచేస్తుంది ఇఇన్‌స్టాగ్రామ్‌ టీమ్. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తాము చూసే స్టోరీలకు జిఫ్, టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజెస్ లాంటి రియాక్షన్లు సెండ్ చేయొచ్చు. ఈ రియాక్షన్స్ సదరు స్టోరీ క్రియేటర్ డైరెక్ట్ మెసేజెస్ బాక్స్‌లోకి వెళ్తాయి. ఇక దీంతో పాటు ఇన్‌స్టాగ్రామ్ మరో ఫీచర్ పై కూడా పని చేస్తున్నట్టు డెవలపర్లు చెప్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో యూజర్లు.. తమ పోస్టులను తమకు నచ్చిన విధంగా ఆర్గనైజ్ చేసుకునేలా ఇన్‌స్టాగ్రామ్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రొఫైల్ పేజీలో కనిపించే పోస్టులు, వీడియోలన్నింటినీ మీకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఇది చదవండి: ఎస్​బీఐ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. యోనో యాప్​ ద్వారా ఎన్​పీఎస్​ ఖాతా తెరిచే అవకాశం..!


ఇక వీటితో పాటు కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ మరికొన్ని కొత్త ఫీచర్లు అందిచనుంది. కొత్త యూజర్లకు వారు ఫాలో అయ్యే ప్రొఫైల్స్ నుంచి ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు కనిపించేలా, అలాగే వాటిని ఫేవరెట్స్‌గా మార్క్ చేసుకునేలా సరికొత్త ఫీచర్లపై ఇన్‌స్టాగ్రామ్ పని చేస్తుంది.

ఇది చదవండి: ఏప్రిల్ 2న భారత్‌​లో శ్యామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం33 5జీ లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!


ఇకపోతే స్టోరీ క్రియేటర్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ ‘ప్రైవేట్ స్టోరీ లైక్స్’ అనే ఫీచర్‌ను తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించింది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల కంటే కూడా స్టోరీలకే ఎక్కువ మంది రియాక్ట్ అవుతుంటారు. ఫలితంగా స్టోరీ క్రియేటర్ మెసేజ్ ఇన్‌బాక్స్ అంతా ఆయా రియాక్షన్స్‌తో నిండిపోతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. స్టోరీ లైక్ కౌంట్‌ను క్రియేటర్లు మాత్రమే వ్యూయర్ షీట్ ద్వారా వీక్షించొచ్చు. స్టోరీని చూసిన యూజర్ల కౌంట్ లిస్ట్, స్టోరీలకు వచ్చిన లైక్స్‌ను క్రియేటర్స్‌ ప్రైవేటుగా చూసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ తీసుకురానున్న ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే అన్నిదేశాల యూజర్లకు ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి
Published by:Purna Chandra
First published:

Tags: Instagram, Social Media

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు