హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Tips: ఇన్‌స్టా స్టోరీస్‌లో లింక్ షేర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

Instagram Tips: ఇన్‌స్టా స్టోరీస్‌లో లింక్ షేర్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Instagram : గత నెలలో తమ ప్లాట్‌ఫాంలోని ప్రతి ఒక్కరి కోసం ఇన్‌స్టాగ్రామ్ లింక్ స్టిక్కర్స్ ఫీచర్‌ను ప్రారంభించింది. అయితే ఈ లింకులను షేర్ చేయడానికి మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కానవసరం లేదు.

ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. యూజర్ల (Users)కు మరింత చేరువయ్యేలా, సదుపాయంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఆగస్టులో ‘స్వైప్ అప్’ ఫీచర్‌ను ‘లింక్ స్టిక్కర్స్’ ఆప్షన్‌తో రీప్లేస్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు.. సింపుల్ స్వైప్ (Simple Swipe) అప్ ఫీచర్ ఉపయోగించి లింకులు, కంటెంట్ షేర్ (Content Share) చేయడంతో పాటు కంటెంట్ సేల్, ప్రమోషన్స్ చేసేవారు. ఈ క్రమంలో పరిచయం చేసిన ‘లింక్ స్టిక్కర్స్’(Link Stiker) ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ (Instagram Story)లలో లింక్‌లను షేర్ చేయడానికి మరో మార్గంగా నిలుస్తోంది.

గత నెలలో తమ ప్లాట్‌ఫాంలోని ప్రతి ఒక్కరి కోసం ఇన్‌స్టాగ్రామ్ లింక్ స్టిక్కర్స్ ఫీచర్‌ను ప్రారంభించింది. అయితే ఈ లింకులను షేర్ చేయడానికి మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కానవసరం లేదు. అంటే మీకు 10,000 మంది ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు.

WhatsApp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు.. అవేంటి? ఎలా పనిచేస్తాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?


నాన్- ఇన్‌ఫ్లుయెన్సర్లు కొన్ని సింపుల్ స్టెప్స్ (Simple Steps) తో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో లింక్‌లను సులభంగా యాడ్ చేయవచ్చు. మీరు ఒక్కో స్టోరీలో ఒక లింక్‌ను మాత్రమే షేర్ చేయగలరనే విషయం మర్చిపోవద్దు. స్టిక్కర్‌లను స్టోరీ పోస్ట్‌లలో మాత్రమే ఉపయోగించాలి. కానీ ఫీడ్ పోస్ట్‌లలో ఉపయోగించలేరు.

ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

1. మీ ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS)ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌ లైట్ (Insta Lite) యాప్ లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.

2. యాప్ హోమ్‌పేజీ (లేదా న్యూస్ ఫీడ్)లో, ఇన్‌స్టాగ్రామ్‌ కెమెరాను ఓపెన్ చేయడానికి రైట్ సైడ్ కి స్వైప్ చేయండి.

Jobs In Telangana: వ‌రంగ‌ల్ రీజియ‌న్ ప‌రిధిలో 275 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే


3. ఇప్పుడు మీరు ఒక ఫోటో తీసుకోండి. లేదా డివైజ్‌లో అందుబాటులో ఉన్న పిక్చర్ సెలక్ట్ చేసుకోండి.

4. నెక్స్ట్ స్క్రీన్ (Next Screen)లో మీకు టెక్స్ట్, ఎఫెక్ట్స్, డ్రాయింగ్, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవడం వంటి అప్షన్స్ కనిపిస్తాయి. లింక్ స్టిక్కర్‌ను యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నందున, స్టిక్కర్ల ప్యానెల్‌ను తెరవడానికి పైకి స్వైప్ చేయండి. ప్రత్యామ్నాయంగా టాప్ వరుసలో ఉన్న స్టిక్కర్ ఐకాన్‌పై కూడా మీరు క్లిక్ చేయవచ్చు.

5. స్టిక్కర్ ప్యానెల్ (Stiker Pannel) ఓపెన్ అయిన తర్వాత.. సెర్చ్ బార్‌ను ట్యాప్ చేసి దానిలో లింక్ అని టైప్ చేయండి.

6. స్టిక్కర్ల సెక్షన్ కింద లింక్ గుర్తు ఉన్న లింక్ స్టిక్కర్‌ను ఎంచుకోండి.

7. తదుపరి స్క్రీన్ స్టిక్కర్‌కు లింక్‌ను యాడ్ చేయమని అడుగుతుంది. వెబ్ అడ్రస్‌ను ఇక్కడ నమోదు చేయండి. ఒకవేళ మీరు లింక్‌ను కాపీ చేసినట్లయితే అక్కడ పేస్ట్ చేయవచ్చు. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్  లో ఉన్న డన్ బటన్ ను నొక్కండి.

8. ఇప్పుడు మీరు స్టోరీ అప్షన్ (Story Option) స్క్రీన్‌పైకి తిరిగి వస్తారు. లింక్ స్టిక్కర్‌ను మీకు కావలసిన పొజిషన్ లో సెట్ చేసుకోండి. స్టిక్కర్‌పై నొక్కడం ద్వారా స్టిక్కర్ వివిధ థీమ్‌ల మధ్య మారేలా చేస్తుంది.

9. చివరగా ఫాలోవర్స్ (Follwers) అందరి కోసం మీ స్టోరీని యాడ్ చేయడానికి లేదా సన్నిహిత మిత్రులకు మాత్రమే పరిమితం చేయడానికి ఉన్న ఆప్షన్‌లను ఎంచుకోండి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌ ఫీచర్ ను ఆస్వాదించండి.

Published by:Sharath Chandra
First published:

Tags: Instagram, Instagram storie, Latest Technology