Instagram: కొత్త ఫీచర్​పై పనిచేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. యాప్​లోని లోపాలపై ముందుగానే యూజర్లకు అలర్ట్​

Instagram followers

యాప్​లో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా వినియోగదారులకు తెలియజేసే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఇంక్ (ఎఫ్‌బిఓ) ఇన్‌స్టాగ్రామ్ సోమవారం పేర్కొంది. ఇప్పటికే ఈ ఫీచర్​కు సంబంధించిన టెస్టింగ్​ను యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించింది.

  • Share this:
Instagram :  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​ యాజమాన్యంలోని ఇన్​స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్​ తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఇటీవల వారం రోజుల్లోనే రెండు సార్లు ఫేస్​బుక్​తో పాటు ఇన్​స్టాగ్రామ్​ (Instagram) సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇన్​స్టా  Instagram యాప్​ ఓపెన్​ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్​డేట్​ చేయలేకపోయారు. మరోవైపు ఇన్​స్టా స్టోరీస్​ చూసేందుకు, అప్​లోడ్​ చేసేందుకు వీలు కాలేదు. దీంతో ఇన్​స్టాగ్రామ్ (Instagram) యూజర్లు తమ సమస్యను ట్విట్టర్​ వేదికగా లేవనెత్తారు. అనేక మంది ఫేస్​బుక్​ యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు. ఫన్నీ మీమ్స్​ను షేర్​ చేశారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన ఫేస్​బుక్​ సరికొత్త ఫీచర్​ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.

Facebook, Instagram, WhatsApp స్తంభించిపోవడానికి కారణాలేంటి?.. టెక్​ దిగ్గజం ఏం చెబుతోంది?


యాప్​లో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా వినియోగదారులకు తెలియజేసే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఇంక్ (ఎఫ్‌బిఓ) ఇన్‌స్టాగ్రామ్ సోమవారం పేర్కొంది. ఇప్పటికే ఈ ఫీచర్​కు సంబంధించిన టెస్టింగ్​ను యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించింది. ఈ టెస్టింగ్​ ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగుతుందని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. టెస్టింగ్​ పూర్తయ్యాక ఇన్​స్టాగ్రామ్​ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Moto E40: మోటో ఇ40 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే


అక్టోబర్ 4 న, ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలు దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోయాయి. ఈ సుదీర్ఘ అంతరాయంతో 3.5 బిలియన్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ వారం గడవక ముందే ఇలాంటి సమస్యే అక్టోబర్​ 9న ఇన్​స్టాగ్రామ్​ యూజర్లకు ఎదురైంది. దాదాపు రెండు గంటల పాటు ఇన్​స్టా సేవలు నిలిచిపోయాయి. దీన్ని వెబ్ పర్యవేక్షణ గ్రూప్ డౌన్‌డిటెక్టర్‌ ధ్రువీకరించింది.

టెస్టింగ్​ దశలో ఉన్న కొత్త ఫీచర్​..

దిగ్గజ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఇలా వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తే ముందే యూజర్లకు ఆ విషయాన్ని తెలియజేయాలని ఇన్​స్టాగ్రామ్​ భావిస్తోంది. యూజర్ల ఖాతా డిసేబుల్ అయ్యే ప్రమాదం ఉందో లేదో సులభంగా తెలుసుకోవడానికి సహాయపడే ఫీచర్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే,​ విద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారాన్ని అరికట్టడం కంటే కంపెనీ పదేపదే లాభాలకు ప్రాధాన్యతనిస్తోందని ఫేస్​బుక్​​ మాజీ ఉద్యోగి విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఫేస్​బుక్​​ యాజమాన్యం.
Published by:Krishna Adithya
First published: