హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Stories: ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్‌ ఫీచర్‌.. ఒకే క్లిప్‌లో 60 సెకన్ల స్టోరీ.. అదుర్స్ అంతే..

Instagram Stories: ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్‌ ఫీచర్‌.. ఒకే క్లిప్‌లో 60 సెకన్ల స్టోరీ.. అదుర్స్ అంతే..

ఇన్‌స్ట్రాగ్రామ్‌

ఇన్‌స్ట్రాగ్రామ్‌

Instagram Stories: ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు కంటిన్యూగా ప్లే అయ్యే 60 సెకన్ల స్టోరీ క్లిప్‌ను ఇప్పుడు అప్‌లోడ్‌ చేయవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు (Users) ఉన్నారు. ఈ ఫ్లాట్‌ఫామ్ తన యూజర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు తరచుగా అదిరిపోయే ట్రెండీ ఫీచర్ల (Features)ను పరిచయం చేస్తోంది. యూజర్లు అప్‌లోడ్‌ చేసే రీల్స్‌, స్టోరీస్‌ను బెస్ట్‌ ఫీచర్లతో పాపులర్‌ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు స్టోరీస్‌(Stories), రీల్స్‌(Reels) టైమ్‌ను పెంచింది. ఇప్పుడు యూజర్లు ఏదైనా స్టోరీని పూర్తిగా చూడటానికి ట్యాప్‌ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ చెబుతోంది. సరికొత్త ఇన్‌స్టాగ్రామ్‌ ఫీచర్‌ ఏంటి? ఎలా పని చేస్తుందనే అంశాలు ఇప్పుడు చూద్దాం..

ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు కంటిన్యూగా ప్లే అయ్యే 60 సెకన్ల స్టోరీ క్లిప్‌ను ఇప్పుడు అప్‌లోడ్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 60 సెకన్లలోపు స్టోరీని అప్‌లోడ్ చేస్తే, అది 15-సెకన్ల క్లిప్‌లుగా డివైడ్‌ అవుతుంది. స్టోరీ, రీల్స్‌లో 15 సెకన్ల క్లిప్‌లను తెలియజేస్తూ ఉండే లైన్స్‌ ఇకపై కనిపించవు. 60 సెకన్ల నిడివి ఉండే వీడియోను కంటిన్యూగా చూడవచ్చు. 60 సెకన్ల వీడియోను పోస్ట్ చేయడానికి ఇప్పుడు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ గురించి మెటా ప్రతినిధి టెక్ క్రంచ్‌తో మాట్లాడుతూ..‘ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా యూజర్లకు బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడమే మా లక్ష్యం. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా స్టోరీ అప్‌లోడ్‌ చేస్తే 15 సెకన్ల క్లిప్‌లుగా ఆటోమేటిక్‌గా కట్‌ అవ్వదు. 60 సెకన్ల వరకు కంటిన్యూగా స్టోరీ ప్లే అవుతుంది. ఇతరులు అప్‌లోడ్‌ చేసిన స్టోరీలను అంతరాయం లేకుండా చూడవచ్చు.’ అని చెప్పారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఏదైనా స్టోరీని పూర్తిగా చూడటానికి కంటిన్యూగా ప్రెస్‌ చేయాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఇలా చేస్తే రూ.549కే స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు!

* ఒకేసారి 100 స్టోరీలు అప్‌లోడ్‌ చేయవచ్చు

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్.. వరుసగా కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఇంతకుముందు ఉండే 60 సెకన్ల పరిమితి నుంచి 90 సెకన్ల వరకు పెంచింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను హైడ్‌ చేసే కొత్త స్టోరీస్ లేఅవుట్‌ను కూడా పరీక్షిస్తోంది. యూజర్లు ప్రస్తుతం ఒకేసారి 100 స్టోరీలను పోస్ట్ చేయవచ్చు. ఈ సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. అయితే అన్ని స్టోరీలను చూడటానికి యూజర్లు తప్పనిసరిగా ‘షో ఆల్‌(Show All)’ అనే బటన్‌ ప్రెస్ చేయాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Features, Instagram, Tech news

ఉత్తమ కథలు