Home /News /technology /

INSTAGRAM REVEALS INDIAS 25 MOST NOTABLE INSTAGRAMMERS UNDER 25 CHECK LIST HERE JNK GH

Instagram: భారత్‌లో 25 ఏళ్లలోపు వయసున్న 25 మంది ప్రముఖ ఇన్‌స్టాగ్రామర్లు వీరే.. లిస్ట్ అనౌన్స్ చేసిన ఇన్‌స్టాగ్రామ్..

ఇండియాలో ఫేమస్ ఇన్‌స్టాగ్రామర్లు వీళ్లే..

ఇండియాలో ఫేమస్ ఇన్‌స్టాగ్రామర్లు వీళ్లే..

Instagram: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అద్భుతమైన వీడియోలు, ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు క్రియేటర్లు. వారిలో టాప్ 25 ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది ఇన్‌స్టాగ్రామ్‌.

ప్రముఖ సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా అద్భుతమైన వీడియోలు, ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు క్రియేటర్లు. మన ఇండియాలో కూడా చాలా మంది యువతీ యువకులు అదిరిపోయే టాలెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నారు. అయితే, వారిలో టాప్ 25 ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితాను తాజాగా విడుదల చేసింది ఇన్‌స్టాగ్రామ్‌. "వి ఆర్ ఇన్ ద మేకింగ్" అనే ప్రచారంలో భాగంగా భారతదేశంలోని 25 ప్రముఖ ఇన్‌స్టాగ్రామర్‌లను ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. వీరంతా రీల్స్ (Insta Reels) ద్వారా పాపులారిటీ సంపాదించారు. వీరు 25 ఏళ్లలోపే ఇన్‌స్టాగ్రామ్‌లో బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఎదగడం విశేషం. ఈ కాంపెయిన్ ద్వారా పాపులర్ అయిన 25 ఏళ్లలోపు యువకులను ఇన్‌స్టాగ్రామ్ పొగుడుతుంది. మెటా ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 వర్చువల్ ఈవెంట్ డిసెంబర్ 15న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందుగానే లిస్టును విడుదల చేయడం గమనార్హం.

ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్‌టాక్‌ లాంటి రీల్స్ ఫీచర్ వచ్చాక క్రియేటర్లు మరింత సులువుగా తమ భావనలను వ్యక్తీకరిస్తున్నారు. తమ ప్రతిభ, పరిజ్ఞానంతో యూజర్లను ఫిదా చేస్తున్నారు. లక్షలాది మంది అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫాంలో ఇన్‌ఫ్లుయెన్సర్లగా మారుతున్నారు. అలా భారతదేశంలో కూడా యువకులు చక్కటి ప్రతిభతో రీల్స్ ద్వారా వీడియోలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పాపులర్ అయిన ఈ ఇన్‌స్టాగ్రామర్‌లను ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా క్రియేటర్లు అని కూడా పిలుస్తారు. గతేడాది అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. దీనితో షార్ట్ వీడియోలు సృష్టించడం మరింత సులభతరం అయ్యింది. దాంతో చాలామంది ఎక్కువ వీడియోలు క్రియేట్ చేయడం లేదా చూడటం ప్రారంభించారు.

Vivo Y55s: వివో వై 55ఎస్ బడ్జెట్ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. 50 ఎంపీ కెమెరాతో పాటు 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ


ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫాం మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా వివిధ మీడియా ఫార్మాట్‌లలో సక్సెస్ సాధించిన క్రియేటర్లను హైలైట్ చేయడం ద్వారా 25 మంది ప్రముఖ ఇన్‌స్టాగ్రామర్‌లను గుర్తించడం జరిగింది. వివిధ ఫార్మాట్‌లను ఉపయోగించి తమ పనిని ప్రదర్శించడానికి మార్గాలను అన్వేషిస్తున్న అత్యంత ఉత్తేజకరమైన, సృజనాత్మకమైన ట్రయల్‌బ్లేజింగ్ సృష్టికర్తలను హైలెట్ చేయడమే ఈ జాబితా లక్ష్యమని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది.

Moto G51: రూ.15,000 బడ్జెట్‌లో మోటో జీ51 రిలీజ్... ఫీచర్స్ ఇవే
ఇన్‌స్టాగ్రామ్ జ్యూరీతో పాటు భారతదేశంలోని 25 ఏళ్లలోపు ప్రముఖ ఇన్‌స్టాగ్రామర్‌లను హైలైట్ చేసే ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. సారా అలీ ఖాన్, క్రియేటర్లు కుషా కపిల, మసూమ్ మినావాలా, యూత్ మీడియా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ తనేజా, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ సహ-వ్యవస్థాపకుడు అజు ఫిలిప్, ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్ & పార్ట్‌నర్‌షిప్స్ అధిపతి మనీష్ చోప్రా అందరూ జ్యూరీలో భాగంగా ఉన్నారు.

Data Add on Plans: అదనంగా డేటా కావాలా? Jio, Airtel, Vi డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ ఇవే
“ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను సృష్టించే, వీక్షించే విధానాన్ని రీల్స్ పూర్తిగా మార్చేసింది. యువ క్రియేటర్లు సరికొత్త ట్రెండ్ సెట్ చేయడంలో రీల్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ లిస్టు యువ ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించడానికి, ప్రశంసించడానికి మేం ఎంచుకున్న మార్గం." అని ఈ లిస్ట్ గురించి మనీష్ చోప్రా మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ కూడా ఈ జాబితాను ప్రశంసించారు. "కొత్తవారు, అందులోనే యువకులు కొత్త మార్గాల్లో పాపులర్ కావడం చూస్తుంటే చాలా గొప్పగా ఉంది" అని సారా అలీ ఖాన్ చెప్పుకొచ్చింది.

iPhone XR: ఐఫోన్ రూ.20,000 లోపే... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్


* 25 ఏళ్లలోపు 25 ఇన్‌స్టాగ్రామర్‌ల జాబితాలో ఉన్న క్రియేటర్లు
బీట్‌బాక్సర్ సూర్య ఎంకేఆర్ (@suryamkrofficial), మెంటల్ హెల్త్ అడ్వకేట్ దివిజా భాసిన్ (@awkwardgoat3), ట్రాన్స్ కార్యకర్త త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (@trintrin), రూపా రామ్ (@superstar_dewasi99), సాగర్ పాప్ (@sagar_pop02), ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ ఆర్టిస్ట్ హర్ష్‌లెన్ జూప్‌హాన్ (@harshleenjhans), రోబోటిక్ డ్యాన్సర్ గురుప్రీత్ సింగ్ (@gurpreet_illusiontown), సాక్షి శివదాసాని (@sakshishivdasani), విష్ణు కౌశల్ (@thevishnukaushal) తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరంతా కూడా వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో నిత్యం ఫాలోవర్లను మెప్పిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Instagram, Instagram post

తదుపరి వార్తలు