ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ (Instagram) కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ ఫ్లాట్‌ఫామ్ తన యూజర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు తరచుగా అదిరిపోయే ట్రెండీ ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా టిక్‌టాక్ వంటి షాట్ వీడియోల ఫ్లాట్‌ఫామ్‌లకు దీటుగా రీల్స్ (Reels) ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ రీల్స్ తక్కువ కాలంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. అయితే ఇన్స్టాగ్రామ్ దీనికి మరింత హంగులను జోడిస్తోంది. ఈ క్రమంలోనే రీల్స్ చేసే వారు మరింత క్రియేటివిటీని ప్రదర్శించేందుకు వీలుగా రీల్స్‌లో కొత్త ఫీచర్లను (New Features) తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లు క్రియేటర్స్ తమ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ కావడానికి, వ్యూయర్లను ఆకర్షించడానికి కూడా యూజ్ అవుతాయి.
రీల్స్‌లో కొత్త సౌండ్ ఎఫెక్ట్స్
రీల్స్‌లో సౌండ్ ఎఫెక్ట్స్ కోసం కొత్త సదుపాయం ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. దీని సాయంతో క్రియేటర్లు రీల్స్‌లో తమ స్వంత ఆడియో ఫైల్‌లను నేరుగా అప్లోడ్ చేసుకోవచ్చు. కామెంట్రీ, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌కి అనుకూలమైన సౌండ్‌ను కెమెరా రోల్‌లోని ఏదైనా వీడియో నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కనీసం ఐదు సెకన్ల నిడివి ఉన్న ఆడియోని క్రియేటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కెమెరా రోల్లో ఉన్న వీడియోల నుంచి మాత్రమే మీరు ఆడియోని రీల్స్ కోసం యూజ్ చేయగలరు.
Social Media: సోషల్ మీడియా ఫిర్యాదులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఏమిటా కొత్త నిబంధనలు
ఈ ఆడియో రికార్డింగ్స్ ఇతర క్రియేటర్స్ కూడా తమ రీల్స్‌లో ఉపయోగించడానికి అందుబాటులో ఉంటాయి. ఎయిర్ హార్న్‌ల నుంచి డ్రమ్‌ల వరకు అనేక సౌండ్ ఎఫెక్ట్‌లను కూడా రీల్స్‌లో ఇన్స్టాగ్రామ్ అందిస్తోంది. వీటిని క్రియేటర్లు తమ రీల్ వీడియోల్లో యాడ్ చేసుకుని ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించవచ్చు.
రీల్స్ నిడివి 90 సెకన్లకు పెంపు
గతంలో అన్ని రీల్స్ వీడియోలు 15 సెకన్ల వరకు మాత్రమే రికార్డ్ చేయడం సాధ్యం అయ్యేది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దానిని 600% పొడిగించింది. అంటే ప్రస్తుతం క్రియేటర్లు 90 సెకన్ల పాటు (Up To 90 Seconds) రీల్స్ వీడియోలు చేసుకోవచ్చు. తద్వారా తాము ఆడియన్స్‌కు ఏం చెప్పాలో దానిని మరింత వివరంగా, క్రియేటివ్‌గా చెప్పుకోవచ్చు.
ఇంటరాక్టివ్ స్టిక్కర్లు
ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంటరాక్టివ్ స్టిక్కర్లు ఇప్పుడు రీల్స్ వీడియోలలో యూజ్ చేసేందుకు కూడా అందుబాటులో ఉన్నాయి. పోల్స్, క్విజ్లు, ఎమోజి స్లైడర్ల ద్వారా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఈ కొత్త ఇంటరాక్టివ్ స్టిక్కర్లు ఉపయోగపడతాయి.
టెంప్లేట్
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో క్రియేటర్లు వారి స్వంత రీల్స్‌ను క్రియేట్ చేసేటప్పుడు మరొక వీడియోను టెంప్లేట్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం క్రియేటర్లు ఇన్స్టాగ్రామ్ సోర్స్ వీడియోల నుంచి ఆడియో, క్లిప్ ప్లేస్హోల్డర్లను ముందే లోడ్ చేసి.. తమ స్వంత కంటెంట్ యాడ్ చేసి ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. టెంప్లేట్స్ వల్ల క్రియేటర్లు తమ కంటెంట్ యాడ్ చేయడం, ట్రిమ్ చేయడం తప్ప మిగతా ఎడిటింగ్ ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా చాలా టైమ్ సేవ్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram