మెటా (Meta) యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagram సేవలు నిలిచివడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagram సేవలు నిలిచివడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాగిన్ కావడంలో ఇన్‌స్టా అకౌంట్లలో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ లాగిన్ (Instagram Login) సమస్య రెండు రోజులుగా ఎదురవతున్నట్లు యూజర్లు చెబుతున్నారు. బుధవారం కూడా డెస్క్ టాప్, మొబైల్ వెర్షన్ ఇన్‌స్టా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతున్నట్లు అనేక మంది వినియోగదారులు చెబుతున్నారు. అనేక మంది వినియోగదారులు తమ ఖాతాల్లో లాగిన్ అవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది యూజర్లు ట్విట్టర్ (Twitter) వేదికగా ఇన్స్టాగ్రామ్ లాగిన్ లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు. సంబంధిత యాప్‌లో కూడా లాగిన్ అవలేకపోతున్నట్లు చెబుతున్నారు.
ఇన్‌స్టా సేవలు నిలిచిపోయిన విషయాన్ని డౌన్‌డిటెక్టర్ సైతం ధృవీకరించింది. ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయంలో వినియోగదారులు లాగిన్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైందని డౌన్ డిటెక్టర్ తెలిపింది. ఈ సమస్య మధ్యాహ్నం 12:45 వరకు ఇన్ స్టా సర్వీసులు నిలిచిపోయినట్లు తెలిపింది. ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు చెందిన ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఫీచర్స్.. తెలుసుకోండి.. ట్రై చేయండి
అయితే.. కొంతమంది ఇన్‌స్టా యూజర్లు మాత్రం తమ యాప్ లలో ఇన్స్టాగ్రామ్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు తమకు కలగలేదని తెలిపారు. ఇదిలా ఉంటే సేవలు నిలిచిపోవడంపై మెటా యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇన్‌స్టా సేవలు ఇగిపోవడంపై సోషల్ మీడియాలో వినియోగదారులు మీమ్స్ సెటైర్లు పేల్చుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.