హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ‘డైలీ లిమిట్’ ఫీచర్‌లో మార్పులు..

Instagram: ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ‘డైలీ లిమిట్’ ఫీచర్‌లో మార్పులు..

వినియోగాదారుల అభిరుచి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో ఇన్‌స్టా ఆకట్టుకుంటుంది. కొత్త ఫీచర్లను అందిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా కొన్ని ఫీచర్లలో మార్పులు చేసింది. అవేంటో చూద్దాం.

వినియోగాదారుల అభిరుచి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో ఇన్‌స్టా ఆకట్టుకుంటుంది. కొత్త ఫీచర్లను అందిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా కొన్ని ఫీచర్లలో మార్పులు చేసింది. అవేంటో చూద్దాం.

వినియోగాదారుల అభిరుచి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో ఇన్‌స్టా ఆకట్టుకుంటుంది. కొత్త ఫీచర్లను అందిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా కొన్ని ఫీచర్లలో మార్పులు చేసింది. అవేంటో చూద్దాం.

  సోషల్ మీడియాలో(Social Media) ఇన్ స్టాగ్రామ్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సినీ, స్టోర్స్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ ఫాలో అవుతుంటారు. మిగతా సోషల్ మీడియా యాప్‌లతో పోల్చితే ఇన్ స్టాగ్రాం(Instagram) వినియోగానికి చాలా అనువుగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది దీనికే ఓటు వేస్తున్నారు. అలాగే వినియోగాదారుల అభిరుచి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులతో ఇన్‌స్టా(Insta) ఆకట్టుకుంటుంది. కొత్త ఫీచర్లను అందిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా కొన్ని ఫీచర్లలో(Features) మార్పులు చేసింది. అవేంటో చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్ తాజాగా 'డైలీ లిమిట్' ఫీచర్‌ను మార్పులు చేసింది. వినియోగదారులు కనీసం10 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు సమయాన్ని గడిపేలా యాప్‌లో మార్పులు చేసినట్లు ఇన్‌స్టా‌గ్రామ్ తెలిపింది.

  Senior Citizens: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త స్కీమ్స్.. వాటిపై వివిధ బ్యాంకుల్లో లభించే వడ్డీ రేట్లను పరిశీలించండి..


  ఫోటో, వీడియో షేరింగ్ అప్లికేషన్ పేరుతో 2018లో 'యువర్ యాక్టివిటీ' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, అయితే వినియోగదారులు యాప్‌లో ఎంత సమయం వెచ్చిస్తున్నారో ట్రాక్ చేయడానికి ప్రస్తుతం ఉన్న 10 నుంచి 15 నిమిషాల చెక్‌బాక్స్‌ను తొలగించి, 30 నిమిషాల మినిమం లిమిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్‌ను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ కొత్త డెవలప్‌మెంట్ అమల్లోకి వస్తుంది. దీంతో యాప్‌లో సమయం గడుపుతున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

  ఇన్‌స్టా యూజర్లకు రోజువారీ టైమ్ లిమిట్‌ 30 నిమిషాలు లేదా 45 నిమిషాలు, ఒక గంట, రెండు గంటలు ఇలా ఒక రోజులో గరిష్టంగా మూడు గంటల వరకు ఉంటుంది. అయితే ఇంతకు ముందు, యాప్‌లో రోజువారీ యాక్సెస్‌ను పరిమితం చేయడానికి వినియోగదారులు 10 నుంచి 15 నిమిషాలను టైమ్ లిమిట్‌ను ఎంపిక చేనుకోవడానికి అనుమతి ఉండేది.

  Hyderabad EV Startup: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దూసుకెళ్తున్న హైదరాబాదీ కుర్రాళ్లు.. అసలేంటి వీళ్ల కథ.. తెలుసుకోండి..


  ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌‌లో పైన కనిపించే పాప్ అప్ ద్వారా కొత్త డెవలప్‌మెంట్ గురించి అలర్ట్ చేస్తుంది. రోజువారీ టైమ్ లిమిట్ ఎంపికను అప్‌డేట్ చేయమని కోరుతుంది. Metaకు సంబంధించిన 2021 4వ క్వార్టర్ లో వచ్చిన లాభాలు వచ్చాయన్న ప్రకటన తరువాత నుంచి సెట్టింగ్‌లలో కొత్త మార్పులు చేశారు. ఒకే సమయంలో ఎక్కువ నోటిఫికేషన్‌లను పంపడాన్ని నిరోధించడానికి 'డైలీ లిమిట్' ఆప్షన్స్ మార్చినట్లు ఇన్ స్టాగ్రాం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది.

  'టేక్ ఎ బ్రేక్' ఫీచర్‌ వల్ల వినియోగదారులు యాప్ నుండి బయటకు రావడానికి పూర్తి-స్క్రీన్ రిమైండర్‌లను పొందే అవకాశం ఉంది. గరిష్టంగా 10 నిమిషాల విరామం తీసుకొవచ్చు. దీన్ని మరో 30 నిమిషాల వరకు పొడిగించుకోవచ్చు. సోషల్ మీడియాలో వినియోగదారులు ఎలా వ్యవహరిస్తున్నారు అనేదానిపై మరింత నియంత్రణను కలిగి ఉండటం కోసం ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యమని ఇన్ స్టా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని స్క్రోలింగ్ ద్వారా విరామం తీసుకోవడానికి రిమైండర్‌లను సెట్ చేయడానికి ఈ ఫీచర్‌ను వినియోగించవచ్చు.

  First published:

  Tags: 5g technology, Instagram, Technology

  ఉత్తమ కథలు