ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్(Video Sharing) ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తన యూజర్ల కోసం తరచుగా అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్(Instagram) పరిచయం చేసిన ఆకర్షణీయమైన ఫీచర్ల (Features) కారణంగా యూజర్ ఎక్స్‌పీరియన్స్(Experience) మరింత మెరుగు పడింది. అయితే మరిన్ని ఫీచర్లతో ప్లాట్‌ఫామ్‌ను(Flatform) మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) నిత్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా "పిన్ టు యువర్ ప్రొఫైల్ (Pin To Your Profile)" అనే ఓ యూజ్‌ఫుల్ ఫీచర్‌ను(Feature) లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్(Feature) సాయంతో యూజర్లు తమకు నచ్చిన మూడు పోస్టులను లేదా రీల్స్ (Reels)ను ప్రొఫైల్ గ్రిడ్‌లో టాప్ ప్లేసులో(Place) ఉంచుకోవచ్చు. ప్రస్తుతం పిన్(Pin) చేసే ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా యూజర్లందరికీ రిలీజవుతోంది. ఇంకా మీకు ఈ ఫీచర్(Feature) రాకపోతే త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
ట్విట్టర్, వాట్సాప్ వంటి తదితర సోషల్ మీడియా సైట్స్‌లో ఇప్పటికే పిన్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు కూడా విడుదల అవుతోంది. ఈ ఫీచర్‌ను వినియోగించి యూజర్లు తమకు నచ్చిన పోస్టులను ప్రొఫైల్ టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. దీనర్థం ఇన్‌స్టా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీకు నచ్చిన మూడు పోస్టులు టాప్‌లో అందరికీ కనిపిస్తాయి.
మీరు నిర్దిష్ట ఫొటో లేదా రీల్‌ని పిన్ చేయాలనుకుంటే... దాన్ని ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి, "పిన్ టు యువర్ ప్రొఫైల్" ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. తద్వారా పోస్ట్‌ను పిన్ చేయవచ్చు. మీరు అలా చేసిన తర్వాత, పోస్ట్ మీ ప్రొఫైల్ గ్రిడ్ పైన కనిపిస్తుంది. భవిష్యత్తులో మీరు కొత్త పోస్ట్‌లను షేర్ చేసినప్పటికీ ఈ పోస్ట్‌లు అలాగే పైనే ఉంటాయి.
You like it? You pin it ????
You can now choose up to three posts or Reels to pin to the top of your profile. pic.twitter.com/9waQkueckG
— Instagram (@instagram) June 7, 2022
పిన్ చేసిన పోస్ట్‌లు ప్రొఫైల్ గ్రిడ్‌లో టాప్‌లో చిన్న తెల్లని పిన్ ఐకాన్‌తో కనిపిస్తాయి. మీరు కొత్త పోస్ట్‌ను పిన్ చేస్తే, ఇప్పటికే ఉన్న పోస్ట్ కుడి వైపుకు వస్తుంది. ప్రొఫైల్‌లో నిర్దిష్ట పోస్ట్‌ను పిన్ చేసే ఆప్షన్ దాదాపు యూజర్లందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఫొటో గ్రిడ్‌లో ఎవరికీ కనిపించకుండా ఎక్కడో లాస్ట్‌లో ఉన్న మీ ఫేవరెట్ పోస్ట్‌లను హైలైట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు మూడు కంటే ఎక్కువ పోస్ట్స్ లేదా రీల్స్‌ను పిన్ చేయడానికి ప్రయత్నిస్తే... 'పిన్ లిమిట్ రీచ్డ్" అనే ఒక అలర్ట్ పాప్-అప్ కనిపిస్తుంది.
iQoo Neo 6: గేమింగ్ ప్రియుల కోసం సూపర్ ఫోన్.. ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకోండి
ఈ పాప్-అప్‌లో ఇంతకుముందు పిన్ చేసిన పోస్ట్స్‌కు బదులు కొత్త పోస్ట్ పిన్ చేయాలా అని ఒక కొంచెం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం, యూజర్లకు తమ ప్రొఫైల్‌లో స్టోరీస్‌ను కూడా పిన్ చేసే ఆప్షన్‌ను అందుబాటులో ఉంది. అయితే ఈ కొత్త ఫీచర్ పోస్ట్‌లకు కూడా ఈ ఫెసిలిటీని విస్తరిస్తుంది.
Smart Phone: అదిరిపోయే ఫీచర్.. నిమిషాల్లో ఫుల్ చార్జింగ్.. వన్ ప్లస్ నుంచి కొత్త మోడల్
ఈ ఫీచర్ కాకుండా సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ అనే సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇటీవలే పరిచయం చేసింది. యూజర్లు ఇప్పుడు ప్లాట్‌ఫామ్‌లోని తమ సున్నితమైన కంటెంట్‌తో పాటు అకౌంట్స్‌ను ఎవరు చూడగలరనేది నియంత్రించగలరు. ఈ ఫీచర్ ఇప్పటికే చాలా మంది యూజర్లకు రిలీజ్ కాగా, మరి కొద్ది రోజుల్లో అందరికీ విడుదలవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram, New feature, New update