హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Lite app: టిక్​టాక్​కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ లైట్​ కొత్త ఫీచర్​.. ఎలా పనిచేస్తుందంటే?

Instagram Lite app: టిక్​టాక్​కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ లైట్​ కొత్త ఫీచర్​.. ఎలా పనిచేస్తుందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరో కొత్త ఫీచర్​తో ఇన్​స్టాగ్రామ్​ ముందుకొచ్చింది. ఇటీవల టిక్ టాక్ యాప్ కి పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కూడా రీల్స్​ ఆప్షన్​ను పరిచయం చేస్తోంది. తమ ఇన్‌స్టాగ్రామ్ లైట్ యాప్‌లో ఈ రీల్స్​ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది.

సోషల్​ మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతుంది ఇన్​స్టాగ్రామ్​. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇటీవలే డిలీట్​ చేసిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందడానికి ‘రీసెంట్లీ డిలీటెడ్​’ అనే ఫీచర్​ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు, మరో కొత్త ఫీచర్​తో ఇన్​స్టాగ్రామ్​ ముందుకొచ్చింది. ఇటీవల టిక్ టాక్ యాప్ కి పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కూడా రీల్స్​ ఆప్షన్​ను పరిచయం చేస్తోంది. తమ ఇన్‌స్టాగ్రామ్ లైట్ యాప్‌లో ఈ రీల్స్​ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. భారతీయ వినియోగదారులు తమ ఇన్​స్టాగ్రామ్​ లైట్​ యాప్​ను అప్​డేట్​ చేయడం ద్వారా ఈ రీల్స్ ఆప్షన్​ను చూడవచ్చు. అయితే, ఈ ఫీచర్​ ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్​లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు దీన్ని ఇన్​స్టాగ్రామ్​ లైట్ వినియోగదారులకు కూడా విస్తరించింది. ఈ రీల్ ఆప్షన్​ ద్వారా తాజా ఇన్​స్టా స్టోరీల్లోని వీడియోలను వర్టికల్​గా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే, వినియోగదారులు ఈ రీల్స్​ను చూడడానికే అనుమతి ఉంటుంది.

కానీ వారు ఎటువంటి కొత్త రీల్స్​ను సృష్టించలేరు. అయితే, ఈ సరికొత్త ఫీచర్​ను మొట్టమొదటగా భారతీయ వినియోగదారులకే అందించడం విశేషం. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఎంట్రీ లెవల్ ఫోన్లు వాడే వారి సంఖ్య ఎక్కువ. అందుకే, ఈ ఫీచర్​ను మొదటగా భారత్​లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పవచ్చు. కాగా, ఈ ఫీచర్ యూత్​ను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారత్​లో టిక్​టాక్​ బ్యాన్ అయిన తర్వాత ఇన్​స్టాగ్రామ్​ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు.

టిక్​టాక్ బ్యాన్​తో పెరిగిన ఇన్​స్టా యూజర్లు..

ఎంట్రీ లెవెల్​ (తక్కువ స్టోరేజ్ ఉన్న) స్మార్ట్​ఫోన్లలో ఇన్​స్టాగ్రామ్​ యాప్ ఇన్​స్టాల్​ చేసుకోవాలంటే స్టోరేజి సమస్య తలెత్తుతుంది. ఒకవేళ సదరు యాప్స్​ ఓపెన్​ చేసినా సరే ఫోన్​ చాలా స్లోగా రన్​ అవుతుంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకే ప్రముఖ కంపెనీలన్నీ కూడా తమ ఒరిజినల్​ యాప్స్​కు లైట్​ వెర్షన్​ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్​బుక్​ తన లైట్​ వెర్షన్​ను తీసుకురాగా, తాజాగా ఇన్​స్టాగ్రామ్​ కూడా లైట్​ వెర్షన్​ను తీసుకొచ్చింది.

దీంతో నెట్​వర్క్​ సరిగ్గా లేకపోయినా, మొబైల్​లో 2జీ నెట్​వర్క్​ ఉపయోగిస్తున్నా సరే ఎటుంటి బఫర్​ సమస్య లేకుండా దీన్ని యాక్సెస్​ చేయవచ్చు. అంతేకాక, 2 ఎంబి సైజ్​ ర్యామ్​తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కాగా, గత ఏడాది భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఇన్​స్టాగ్రామ్​ లైట్​ యాప్​ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Instagram, Tik tok

ఉత్తమ కథలు