హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram New Effects: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు.. రీల్స్‌లో మ్యూజిక్ ఎడిట్ చేయడానికి మూడు కొత్త ఎఫెక్ట్స్ లాంచ్

Instagram New Effects: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు.. రీల్స్‌లో మ్యూజిక్ ఎడిట్ చేయడానికి మూడు కొత్త ఎఫెక్ట్స్ లాంచ్

ఇన్స్టాగ్రామ్ (Instagram)
అక్టోబర్, 2021 నాటికి భారతదేశంలో 201 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్, టెక్స్ట్ టు స్పీచ్, లింక్ స్టిక్కర్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ కూడా దాని విజయానికి కారణం. యాప్ ద్వారా యూజర్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఇన్స్టాగ్రామ్ (Instagram) అక్టోబర్, 2021 నాటికి భారతదేశంలో 201 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్, టెక్స్ట్ టు స్పీచ్, లింక్ స్టిక్కర్ ఆప్షన్ వంటి అనేక కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ కూడా దాని విజయానికి కారణం. యాప్ ద్వారా యూజర్లు కూడా డబ్బు సంపాదించవచ్చు.

సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, 3డీ లిరిక్స్ అనే మూడు కొత్త ఎఫెక్ట్స్ యూజర్లకు రీల్స్‌లో మ్యూజిక్, ఏఆర్ ఎఫెక్ట్స్ సులువైన మార్గాలను అందిస్తాయి. సూపర్ బీట్ అనేది ఒక కొత్త మ్యూజిక్ బీట్ ఎఫెక్ట్.

నెటిజన్లు ఎక్కువగా వాడే యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పైవరుసలో ఉంటుంది. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడానికి నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌ను బాగా వాడుతుంటారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఫీచర్స్ తీసుకొస్తోంది. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రీల్స్‌ (Reels) అనే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. అంతేకాదు ఈ రీల్స్‌ ఫీచర్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రీల్స్‌లో మ్యూజిక్ ఎడిట్ చేయడానికి వీలుగా మూడు కొత్త ఎఫెక్ట్స్ లాంచ్ చేసింది. వీటిని సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, 3డీ లిరిక్స్ గా ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేర్కొంది. ఈ ఎఫెక్ట్స్ రీల్ మ్యూజిక్ ఆధారంగా స్క్రీన్ పై లిరిక్స్ అందించడం.. అలాగే ఆటోమేటిక్‌గా ఎడిట్ చేయడంలో సహాయపడతాయి. సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, 3డీ లిరిక్స్ అనే మూడు కొత్త ఎఫెక్ట్స్ యూజర్లకు రీల్స్‌లో మ్యూజిక్, ఏఆర్ ఎఫెక్ట్స్ సులువైన మార్గాలను అందిస్తాయి. సూపర్ బీట్ అనేది ఒక కొత్త మ్యూజిక్ బీట్ ఎఫెక్ట్. ఇది యూజర్ ఎంచుకున్న పాట ఆధారంగా వారి రీల్‌కు ఆకర్షణీయమైన విజువల్ ఎడిట్‌లను ఆటోమేటిక్‌గా అప్లై చేస్తుంది. డైనమిక్ & 3డీ లిరిక్స్ రెండు కొత్త లిరిక్ ఎఫెక్ట్‌లు. ఇవి రీల్‌కు పాటల లిరిక్స్‌ను అందిస్తాయి. తద్వారా యూజర్ మ్యూజిక్‌కి పర్ఫార్మ్ చేయగలరు.

ఈ కొత్త ఫీచర్లను ఎలా ఉపయోగించాలి

స్టెప్ 1: రీల్స్ కెమెరాను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఎఫెక్ట్ ట్రే/గ్యాలరీని ఓపెన్ చేయండి.

స్టెప్ 3: మీరు బూస్టెడ్ సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్ ఎఫెక్ట్ కనిపిస్తాయి. యాప్ ఒకేసారి 2 ఎఫెక్ట్‌లను మాత్రమే యూజ్ చేసేందుకు అనుమతిస్తుంది. త్వరలో ఇన్‌స్టాగ్రామ్ డైనమిక్‌కు బదులుగా 3డీ లిరిక్స్‌ను కూడా అందిస్తుంది.

స్టెప్ 4: సూపర్ బీట్/డైనమిక్ లిరిక్స్/3డీ లిరిక్స్ వాటిలో ఒక ఎఫెక్ట్‌ను ఎంచుకోండి.

స్టెప్ 5: పాటను ఎంచుకోవడానికి మ్యూజిక్ పికర్‌ని వినియోగించండి.

స్టెప్ 6: అప్పుడు రికార్డింగ్ ప్రారంభించండి.

Amazon Prime: అమెజాన్ యూజర్లకు అలర్ట్... భారీగా పెరుగుతున్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు

Mi Smart Band 6: ఫిట్‌నెస్ బ్యాండ్ కొనాలా? రూ.2,999 ధరకే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6

Published by:Krishna Adithya
First published:

Tags: Instagram

ఉత్తమ కథలు