ఫేస్బుక్ సొంతం చేసుకున్న సోషల్ నెట్వర్క్ యాప్ ఇన్స్టాగ్రామ్... ఇప్పుడు మరో మొబైల్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఎక్కువ డ్యూరేషన్‌తో యూజర్లు తీసే వీడియోల్ని షేర్ చేసుకునేందుకు రూపొందించిన ఈ యాప్ యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈవెంట్లో ఈ యాప్‌ని లాంఛ్ చేసారు.

"2010లో ఫోటో షేరింగ్ యాప్‌గా మొదలైన ఇన్‌స్టాగ్రామ్‌కు వందకోట్లకు పైనే యూజర్లున్నారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే యువతీయువకులు ఇప్పుడు 40 శాతం తక్కువగా టీవీ చూస్తున్నారు. వీడియోల విషయంలో ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరముంది. ఆదాయాన్ని వీడియో మేకర్స్‌తో పంచుకునే ఆలోచనలు ప్రస్తుతం లేవు, భవిష్యత్తులో ఆలోచిస్తాం"
— కెవిన్ సిస్ట్రోమ్, ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్
ఐజీటీవీ ఇన్స్టాగ్రామ్ యాప్‌లో భాగంగా, వేరుగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వీస్‌లో అడ్వైర్టైజింగ్ ఉండదు. భవిష్యత్తులో యాడ్స్ ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 20న కొత్త యాప్ విడుదల చేసిన తర్వాత ఫేస్బుక్ షేర్లు 2.3 శాతం పెరిగాయి. ఈ మధ్యే 200 డాలర్లు దాటిన షేర్ జూన్ 20న 202.06 డాలర్లకు చేరుకుంది. యూజర్లతో పాటు కార్పొరేట్ బ్రాండ్ అడ్వర్టైజింగ్ను ఆకర్షించేందుకు ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్‌చాట్ లాంటి టెక్ సంస్థలు మొబైల్ వీడియో సర్వీసెస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాయి. సెలబ్రిటీలు తమ వీడియోలు పోస్ట్ చేయడం కూడా వీరి వ్యూహంలో భాగమే. రెండున్నర కోట్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్న లిలీ పోన్స్ లాంటివాళ్లతో ఐజీటీవీ కోసం ఇన్స్టాగ్రామ్ ఒప్పందం కుదుర్చుకుంది.

"సిలికాన్ వ్యాలీకి చెందిన రెండు కంపెనీల్లో నేను ఎవరివైపు కాదు. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను"
— లిలీ పోన్స్, ఇంటర్నెట్ సెలబ్రిటీ
వీడియో మేకర్స్‌ను యూట్యూబ్‌కు దూరం చేయాలని ఫేస్బుక్ ప్రణాళికలు రచిస్తోంది. ఫేస్బుక్లో వీడియోలు పోస్ట్ చేసి డబ్బు సంపాదించండి అంటూ పిలుపునిస్తోంది. ఈ పోటీపై యూట్యూబ్ కూడా దృష్టిపెట్టింది. వారం రోజుల్లో వ్యాపార విధానాలను మార్చుకోబోతోంది.
Published by:Santhosh Kumar S
First published:June 21, 2018, 12:47 pm