ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే ఫీచర్ ఒకటి త్వరలో రాబోతోంది. ‘డ్రాప్స్’ పేరుతో లాంచ్ కానున్న ఈ ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ కోసం కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రాప్స్ అంటే ఆ పదం ఎక్కడో విన్నట్లే ఉంది కదా. ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి ఈ పదం బాగా సుపరిచితం. కొత్తగా లాంచ్ చేసే ఉత్పత్తుల విషయంలో వినియోగదారుల్లో క్రేజ్ పెరగాలని డ్రాప్స్ పేరుతో లాంచ్ చేస్తూ ఉంటారు. అంటే తక్కువ సంఖ్యలో ఉత్పత్తులు తీసుకొచ్చి... డిమాండ్ పెంచుతారు. అలాంటి ఉత్పత్తులను ఇన్స్టాగ్రామ్ నుంచే కొనేలా షాప్ ట్యాబ్‌లో డ్రాప్స్‌ను తీసుకొస్తోంది ఇన్స్టాగ్రామ్.
డ్రాప్స్ ఫీచర్‌ను ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగాదారులకు ఈ ఫీచర్‌ను అక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం చాలా ఉత్పత్తులకు ఇన్స్టాగ్రామ్ పేజీలు ఉంటాయి. వాటికి ఇటీవలే షాపింగ్ ట్యాబ్‌ను యాడ్ చేశారు. అందులోనే డ్రాప్స్ ఫీచర్ ఉంటుంది. డ్రాప్స్ ఫీచర్లో ఆయా సంస్థల కొత్త ఉత్పత్తులు, రాబోయే ఉత్పత్తుల సమాచారం అందుబాటులో ఉంటుంది. నోటిఫై మీ ఆప్షన్ ద్వారా కొత్త ఉత్పత్తులు వచ్చినప్పుడు నోటిఫికేషన్లు కూడా పొందొచ్చు. అంతేకాదు కొన్ని సంస్థల ఉత్పత్తులను నేరుగా ఇన్‌స్ట్రామ్ నుండే కొనేయొచ్చు. అంటే అక్కడ షాప్నౌ బటన్ క్లిక్ చేయగానే చెక్ అవుట్ పేజీకి వెళ్లిపోతుంది.
ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఉచితంగానే అందిస్తోంది. అయితే త్వరలో ఇలా జరిగిన షాపింగ్‌కు సంబంధించి సంస్థల నుంచి కానీ, వినియోగదారుల నుంచి కానీ డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొవిడ్ కారణంగా నష్టపోయిన వ్యాపారుల కోసం ఇన్స్టాగ్రామ్ గతేడాది సెల్లింగ్ ఫీజ్‌ను తొలగించింది. ప్రస్తుతం అమెరికాలో డ్రేక్ ఎక్స్ నోక్టా కార్డినల్ స్టాక్, వ్రెన్+గ్లోరీ, చార్లెట్ టిల్బరీ లాంటివి డ్రాప్స్ సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరిన్ని వచ్చి చేరుతాయి. యూజర్లు ఆ డ్రాప్‌ను షేర్ చేసుకొని తర్వాత వాడుకోవచ్చు. లేదంటే స్నేహితులకు పంపొచ్చు కూడా. విష్‌లిస్ట్‌లో కూడా పెట్టొచ్చు. దీంతోపాటు లైవ్షాపింగ్ ఫీచర్‌ను కూడా డ్రాప్స్‌లో తీసుకొస్తారట. కొన్ని వెబ్సైట్లలో వస్తువుల సేల్ కోసం కౌంట్‌డౌన్ టైమర్‌ను ఇస్తుంటారు. అంటే ఆ సమయంలో ఆ వస్తువు కొనేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆ తరహా ఫీచర్‌ను డ్రాప్స్‌లో తీసుకొస్తారట.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.