Home /News /technology /

INSTAGRAM LATEST MESSAGING EXPERIENCE ON INSTAGRAM LEARN 7 NEW FEATURES GH EVK

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త మెసేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌..7 కొత్త ఫీచ‌ర్లు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Instagram Features | మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్‌ల‌ (Features)తో యూజర్లను అలరించనుంది. ఫోటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత ఆకట్టుకొనేలా చేసేందుకు ఏడు కొత్త ఫీచర్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తోంది.

ఇంకా చదవండి ...
మెటా సంస్థ(Meta Company)కు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త అప్‌టేడ్స్‌ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఫొటో, వీడియో షేరింగ్‌లకు ప్రాధాన్యమున్న ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) .. ఇప్పుడు మెసేజింగ్‌ ఫీచర్‌పై దృష్టి పెట్టింది. యూజర్లు సులువుగా మెసేజ్‌లు సెండ్‌ చేసుకోవడానికి వివిధ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలుత కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని.. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది.

Career and Courses: ఐఐటీలో బీఎస్సీ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ కోర్సు.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం!

మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్ల(Features)తో యూజర్లను అలరించనుంది. ఫోటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై(Photo, Video Sharing Platform) మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత ఆకట్టుకొనేలా చేసేందుకు ఏడు కొత్త ఫీచర్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ అందిస్తున్న కొత్త ఫీచర్లు ఎంపిక చేసిన దేశాలలో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రపంవ్యాప్తంగా ఉన్న యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందించాలని ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థ భావిస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్లకు సంబంధించిన వివరాలను కొన్న సంస్థలు ప్రచురించాయి.

Job Openings: హైదరాబాద్‌లోని ప్ర‌ముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

మెసేజింగ్ ఫీచర్‌లు ఇవే..
ఏడు ఫీచర్లలో మొదటిది.. ఇతరులు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి.. ఇన్‌బాక్స్‌ను ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఆయా యూజర్లు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇచ్చే సదుపాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ కల్పిస్తోంది.
అదే విధంగా మరో క్విక్‌ సెండ్‌ ఫీచర్‌ను( Quick, Send Feature) ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకువస్తోంది. ఇతరులు పోస్టు చేసిన వాటిని వేగంగా షేర్‌ చేసే సదుపాయం కల్పిస్తోంది. షేర్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా క్లోస్‌ ఫ్రెండ్స్‌, ఇతరులకు పోస్టులను వెంటనే షేర్‌ చేయవచ్చు.

CUET 2022: నేటి నుంచి సీయూఈటీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న స్నేహితులను గుర్తించి.. అందరినీ ఇన్‌బాక్స్‌లోని టాప్‌లోకి చేర్చే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారందరినీ ఒకే చోట చూడవచ్చు. అందుబాటులో ఉన్న వారితో చాట్ చేసుకోవచ్చు.
వినియోగదారులు ఇప్పుడు ఒక పాట 30-సెకన్ల ప్రివ్యూని షేర్‌ చేసే అవకాశం ఉంది. నేరుగా చాట్‌ విండో ద్వారా స్నేహితులు ఆ పాటను వినే అవకాశం ఉంది. ఈ ప్రివ్యూ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి Apple Music, Amazon Music, Spotifyతో ఇన్‌స్టాగ్రామ్ ఒప్పందం చేసుకొంది.

కన్వర్జేషన్స్‌ను పర్సనలైజ్‌ చేసుకోనే సదుపాయంతోపాటు, కొత్త లో-ఫై చాట్ థీమ్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అందిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు నోటిఫికేషన్‌ లేకుండానే ఇతరులకు మెసేజ్‌లు పంపవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ అందిస్తున్న ఈ కొత్త ఫీచర్‌ ద్వారా.. మెసేజ్‌లో “@సైలెంట్” అని జోడిస్తే.. ఇతరుల ఫోన్‌లో నోటిఫికేషన్‌ సౌండ్‌ రాకుండానే నిశ్శబ్దంగా మెసేజ్‌ వెళ్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అందిస్తున్న మరో కొత్త ఫీచర్‌ ద్వారా.. గ్రూప్‌ చాట్‌లలో పోల్‌ను క్రియేట్‌ చేసుకొనే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Instagram, Latest Technology, Social Media

తదుపరి వార్తలు