ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. తాజాగా ఈ సంస్థ ప్రొఫెషనల్ అకౌంట్స్ కోసం షెడ్యూల్ (Schedule) ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వచ్చే ఈ అప్డేట్ సాయంతో యూజర్లు తమ పోస్ట్‌లు, రీల్స్‌ను 75 రోజుల వరకు షెడ్యూల్ చేసుకోవచ్చు. క్రియేటర్స్, ప్రొఫెషనల్ అకౌంట్స్ ఉన్న యూజర్స్ నేరుగా మొబైల్ యాప్ నుంచే 75 రోజుల ముందుగానే పోస్ట్‌లు, రీల్స్‌ను షెడ్యూల్ చేయవచ్చని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు రిలీజ్ అవుతుంది.
ప్రస్తుతం మొబైల్ యాప్‌లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం సాధ్యం కాదు. దీనివల్ల షెడ్యూల్ చేయడానికి థర్డ్-పార్టీ టూల్స్ లేదా Meta Business Suite వంటి డెస్క్‌టాప్ ఫీచర్స్ ఉపయోగించాల్సి వస్తోంది. కాగా త్వరలో యాప్ ద్వారానే షెడ్యూల్ చేసుకునే ఫెసిలిటీని ఇన్స్టాగ్రామ్ ఆఫర్ చేయనుంది. ఈ ఫీచర్ యాప్‌లోని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఈ ఆప్షన్‌ను మరికొద్ది వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు క్లారిటీ ఇచ్చింది. క్రియేటర్స్, ప్రొఫెషనల్ అకౌంట్స్ ఉన్నవారు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించుకోగలరు. బిజినెస్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగించే వారికి సాధారణంగా ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటుంది. లేనివారు ఈ ప్రొఫెషనల్ అకౌంట్‌కి రెగ్యులర్ అకౌంట్ నుంచి పూర్తిగా ఉచితంగా అప్‌గ్రేడ్ అవ్వచ్చు.
మరో ఫీచర్ కూడా
షెడ్యూల్డ్ పోస్ట్స్ ఫీచర్‌తో పాటు యాప్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో అచీవ్మెంట్స్ సెక్షన్ కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ రీల్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు కొన్ని యాక్షన్స్ యాక్షన్స్పై అచీవ్మెంట్స్ అన్‌లాక్ చేయడానికి క్రియేటర్స్‌కు హెల్ప్ అవుతుంది. ఒక క్రియేటర్ మరొకరితో కోలాబరేట్ అయి మరింత ఇంటరాక్టివ్ రీల్స్‌ను రూపొందించడం, ట్రెండింగ్‌లో ఉన్న ఆడియో, ఎఫెక్ట్‌లను ఉపయోగించడం, వారంలో ఒకటి కంటే ఎక్కువ రీల్‌లను రూపొందించడం, కమ్యూనిటీతో ఎంగేజ్ అవ్వడం ద్వారా ఒక అచీవ్మెంట్ అన్‌లాక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా అన్లాక్డ్ అచీవ్మెంట్స్ గురించి క్రియేటర్స్‌కి ఇన్స్టాగ్రామ్ తెలియజేస్తుంది. క్రియేటర్స్ నోటిఫికేషన్‌లోని 'వ్యూ' ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా అచీవ్మెంట్స్ చూడగలరు. రీల్‌లోని 'మెనూ' ఆప్షన్ నుంచి సాధించిన.. సంపాదించని అచీవ్మెంట్స్ కూడా ట్రాక్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం అచీవ్మెంట్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలానే షెడ్యూల్డ్ పోస్ట్ ఫీచర్ కూడా త్వరలోనే అందరికీ రిలీజ్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram