Instagram Stories: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్ తో డబ్బులు సంపాందించుకునే ఛాన్స్.. ఎలాగంటే..

Instagram image. (Image Credit: Pexels)

Instagram Stories: క్రియేటర్ల కు ఇన్‌కమ్‌ వచ్చేలా ఇటీవల ట్విటర్‌... సూపర్‌ ఫాలో అనే ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానికి పోటీగా... ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌ ఫీచర్‌ తెస్తోందని సమాచారం.

  • Share this:
కొత్త ఫీచర్లు తీసుకురావడంలో ఫేస్‌బుక్‌, దాని అనుబంధ కంపెనీల లెక్కే వేరు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ పేరు ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌’. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ ఫీచర్‌ ఉంది కదా... దానికి అదనపు సొబగులు అద్ది.. కొత్త అప్‌డేట్‌ను త్వరలో యూజర్లకు అందిస్తారట. క్రియేటర్ల కు ఇన్‌కమ్‌ వచ్చేలా ఇటీవల ట్విటర్‌... సూపర్‌ ఫాలో అనే ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానికి పోటీగా... ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌ ఫీచర్‌ తెస్తోందని సమాచారం. ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి క్రియేటర్‌ బ్యాడ్జ్‌ సాధించిన వారికి మాత్రమే ఈ ఫీచర్‌ తొలుత ఇవ్వనున్నారు. అలా క్రియేటర్లు రూపొందించిన స్పెషల్‌ కంటెంట్‌ వాళ్ల స్టోరీస్‌, హైలైట్స్‌ కనిపిస్తోంది. దాన్ని క్లిక్‌ చేసి చూడాలంటే... ఆ వ్యక్తి క్రియేటర్‌ అకౌంట్‌కు ఫాలోవర్‌ అయితే సరిపోదు... మెంబర్ కూడా‌ అయి ఉండాలి. అలా మెంబర్‌షిప్‌ తీసుకున్నవాళ్లకు మాత్రమే ఆ స్టోరీ కనిపిస్తుంది. తొలి రోజుల్లో ఈ మెంబర్‌షిప్‌ ఉచితంగా అందించినా... తర్వాతర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో లైవ్‌లోకి తీసుకొస్తారని సమాచారం. అప్పటికి ఇందులో చాలామార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన లీక్స్‌ ప్రకారం చూస్తే... సాధారణ స్టేటస్‌లకు, దీనికి చాలా తేడా ఉంటుంది. రంగుల విషయంలో ఆ తేడాను బాగా గమనించొచ్చు అని తెలుస్తోంది. ఇలాంటి స్టోరీల కోసం ప్రొఫైల్‌లో ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ ఇస్తారట. అంటే పోస్టులు, రీల్స్‌, ట్యాగ్డ్‌ ఫొటోస్‌ స్టైల్‌లో అన్నమాట.

ఈ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీల విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ తరహా స్టోరీలను స్క్రీన్‌ షాట్లు తీసే అవకాశం ఉండదు. అలాగే వాటిని హైలైట్స్‌గా మాత్రమే షేర్‌ చేయగలం. అలాగే ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలు చూసేటప్పుడు... వాటిని మీ హైలైట్స్‌లో పోస్ట్‌ చేసి ఎక్కువమందికి చేరేలా చేయండి అని కూడా సూచిస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌. ఇదంతా చూస్తుంటే... ఈ సరికొత్త స్టోరీస్‌ ఫీచర్‌తో ట్విటర్‌ సూపర్‌ ఫాలోకు గట్టి పోటీ ఇచ్చేలానే ఉంది.
Published by:Sridhar Reddy
First published: