హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటారా? ఇలా డబ్బులు సంపాదించొచ్చు

Instagram: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటారా? ఇలా డబ్బులు సంపాదించొచ్చు

Instagram (ప్రతీకాత్మక చిత్రం)

Instagram (ప్రతీకాత్మక చిత్రం)

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవారికి గుడ్ న్యూస్. త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్లు (Content Creator) డబ్బులు సంపాదించొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  మీరు ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) మీరు డబ్బులు సంపాదించొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోయర్స్ కోసం ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్ రూపొందించొచ్చు. ఫాలోయర్స్ తాము ఫాలో అవుతున్న ఇన్‌ఫ్లూయెన్సర్ల (Influencers) నుంచి ప్రత్యేకమైన కంటెంట్ చూడొచ్చు. ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్ కోసం యూజర్లు సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ తొలిసారిగా అమెరికాలో లాంఛ్ అయింది. దశలవారీగా ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఆ తర్వాత ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందించనుంది. ఈ ఫీచర్ గురించి ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. ప్రస్తుతం కొందరు క్రియేటర్స్‌‌తో ఈ ఫీచర్ టెస్ట్ చేస్తున్నామని, త్వరలో ఎక్కువ మంది ఇన్‌ఫ్లూయెన్సర్లను చేరుస్తామని తెలిపింది.

  ప్రస్తుతం కేవలం 10 మంది క్రియేటర్స్‌తోనే ఈ ఫీచర్ టెస్ట్ చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. బాస్కెట్ బాల్ ప్లేయర్ సెడోనా ప్రిన్స్, ఒలంపియన్ జొరాన్ చిలీస్, ఓ ఆస్ట్రాలజర్ అలీజా కెల్లీ వీరిలో ఉన్నారు. రాబోయే వారాల్లో ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లను ఫాలో అయ్యే యూజర్లు సబ్‌స్క్రైబ్ చేసుకొని మంత్లీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారి కోసం క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రత్యేక కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు.

  iPhone Offer: రూ.17,599 ధరకే ఐఫోన్ సొంతం చేసుకోండి... అమెజాన్‌లో ఆఫర్

  ఫేవరెట్ క్రియేటర్స్ నుంచి ఎక్స్‌క్లూజీవ్ లైవ్స్, స్టోరీస్ ప్రత్యేకంగా లభిస్తాయి. సబ్‌స్క్రైబర్లకు తమ యూజర్ నేమ్‌తో పర్పుల్ బ్యాడ్జ్ లభిస్తుంది. ఈ బ్యాడ్జ్ ఉంటే సదరు క్రియేటర్‌కు సబ్‌స్క్రైబర్‌గా ఉన్నారని అర్థం. సబ్‌స్క్రైబ్ చేయడానికి నెలకు 0.99 డాలర్ల నుంచి 99.99 డాలర్ల వరకు చెల్లించాలి. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే నెలకు రూ.73 నుంచి రూ.7,400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరను క్రియేటర్లే నిర్ణయిస్తారు. 2023 వరకు ఈ రెవెన్యూలో ఇన్‌స్టాగ్రామ్ వాటా తీసుకోదని ప్రొడక్ట్ కో హెడ్ ఆష్లీ యూకీ తెలిపారు. క్రియేటర్స్ కోసం మరిన్ని టూల్స్ రూపొందించడానికి ఆసక్తిగా ఉన్నామని, ఈ టూల్స్ మరింకొంతమంది క్రియేటర్స్ చేతికి రానున్నాయని ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

  Amazon: పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.23,500 వరకు డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్

  కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం ఇలాంటి ఫీచర్ అందిస్తున్న తొలి యాప్ ఇన్‌స్టాగ్రామ్ కాదు. గతంలో బైట్ డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ కూడా 2021 లో ఈ ఫీచర్ అందించింది. ప్రస్తుతం టిక్‌టాక్ యాప్‌పై ఇండియాలో నిషేధం ఉంది. మరోవైపు ట్విట్టర్ కూడా సూపర్ ఫాలోస్ ఫీచర్‌ను అందించింది. ఇక ఇప్పటికే యూట్యూబ్‌లో ఇలాంటి ఫీచర్ ఉంది. ఏదైనా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయితే జాయిన్ బటన్ ఉంటుంది. ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్ కోసం జాయిన్ కావొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Earn money, Earn money online, Instagram

  ఉత్తమ కథలు